తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం క్యాంపస్ కి వెళ్లారు. ఈ సందర్బంలో విద్యార్థులు మంత్రికి అడ్డుగా వచ్చి గో బ్యాక్ అంటూ నిరసన వ్యక్తంచేశారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆయన్ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, కేజీ టూ పీజీ హామీలు ఏమైయ్యాయంటూ నిలదీశారు. అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో మంత్రి క్యాంపస్…
ఓయూ భూములు కబ్జా అవుతున్నాయన్న లేఖపై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ జరిపింది. ఓయూ విద్యార్థి పి.రమణారావు లేఖపై హైకోర్టు విచారణకు కోరారు. సుమారు 3వేల గజాలకు పైగా భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసి ఆక్రమిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. కబ్జాకు కాకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపిన ఏజీ… తులసి హౌజింగ్ సొసైటీపై పోలీసులకు ఓయూ ఫిర్యాదు చేసిందని తెలిపారు. దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో నివేదిక సమర్పించాలని హైకోర్టు అదహేశాలు జారీ చేసింది. హైదరాబాద్ సీపీ, అంబర్…
కరోనా సమయంలో పీజీ విద్యార్థులకు వెసులుబాటు కల్పించింది ఉస్మానియా యూనివర్సిటీ… పీజీ పరీక్షలు రాసే విద్యార్థులు.. తమకు దగ్గర్లో ఉన్న జిల్లా కేంద్రంలో పరీక్ష రాసే అవకాశం ఇచ్చింది… విద్యార్థి తనకు ఏ సెంటర్ అందుబాటులో ఉందని భావిస్తున్నాడో… ఏ సెంటర్‌లో పరీక్ష రాయాలని అనుకుంటున్నాడో.. ముందే ఉస్మానియా యూనివర్సిటీ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.. ఒకవేళ ఒక సెంటర్ లో 20 మంది విద్యార్థులు ఉంటే ఆ సెంటర్ ను మార్చడం జరుగుతుందని ఓయూ తెలిపింది..…