CM Revanth Reddy Emotional Speech at Osmania University: ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి.. ఆర్ట్స్ కాలేజీ ముందు నిలబడి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలి అని అనుకున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చినది ఉస్మానియా యూనివర్సిటీ అని కొనియాడారు. యూనివర్సిటీకి వచ్చే ముందుకు సీఎం మీరు చాలా ధైర్యం చేస్తున్నారు అన్నారు.. సీఎంని అడ్డుకునే చరిత్ర ఉంది.. మీరెందుకు ధైర్యం చేస్తున్నారు అని చెప్పారన్నారు. నాది దైర్యం కాదు... నాది అభిమానం…
CM Revanth Reddy to Visit Osmania University: ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ వెళ్లనున్నారు. సీఎం హోదాలో రెండు సారి ఓయూకి వెళ్లనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి ఓయూకు వెళ్లారు. డిసెంబర్ లో మళ్ళీ వస్తానని అప్పట్లో మాటిచ్చారు. కాగా.. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ది కోసం రూ. 1000 కోట్లు విడుదల చేశారు. సిబ్బంది నియామకం.. నూతన భవనాల నిర్మాణం, ఓయూలో సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్ పోస్టుల కోసం తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 (TG-SET 2025) నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ, ఉస్మానియా రెండూ అవిభక్త కవలల్లాంటివి.. 1938 సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ ఇది.. దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన శివరాజ్ పాటిల్, పీవీ నర్సింహారావు ఈ యూనివర్సిటీ విద్యార్థులే.. ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందిన జైపాల్ రెడ్డి ఈ యూనివర్సిటీ విద్యార్థినే.. తెలంగాణ నలుమూలలా ఏ సమస్య వచ్చినా…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఓయూలో 80 కోట్ల వ్యయంతో నిర్మాణమై 1200 మంది విద్యార్థులకు వసతి కల్పించే రెండు హాస్టల్స్ ను ప్రారంభించనున్నారు. గిరిజన సంక్షేమం శాఖ ఆర్థిక సహాయంతో మరో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించే రెండు కొత్త హాస్టల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సీఎం దాదాపు 10 కోట్ల నిధులతో డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూం పనులకు కూడా ప్రారంభించనున్నారు. Also Read:Agent…
TG CPGET-2025 PG Entrance Exams: వచ్చే నెల(ఆగస్టు) 4వ తేదీ నుంచి తెలంగాణలో పీజీ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో TG CPGET-2025 పరీక్షలు నిర్వహిస్తున్నారు. వివిధ PG కోర్సులు, డిప్లొమాలు, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలు పెట్టనున్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వివాదం ఇంకా పరిష్కారం కాకముందే.. ఓయూ భూవివాదం తెరపైకి వచ్చింది. ఓయూ ప్రొఫెసర్ క్వార్టర్స్ ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని ఆరోపణలు వస్తున్నాయి.
TG ECET 2025 : తెలంగాణ రాష్ట్రంలోని కాలేజీల్లో 2025–2026 విద్యా సంవత్సరానికి బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఈసెట్ (TS ECET) పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదల కాబోతున్నాయి. ఈ మేరకు ఈసెట్ కన్వీనర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ ప్రకటన విడుదల చేశారు. ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో మే 25న మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ…
ఓయూలో నిర్భంద ఆంక్షలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో తాజాగా లేఖ విడుదల చేయడం కలకలం రేపుతోంది. నేటి పాలకుల విధానాల వలన మునుపెన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఈ లేఖలో మావోయిస్టు పార్టీ ధ్వజమెత్తింది. ఈ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారి గొంతును నొక్కేస్తున్నారని మండిపడింది.
Harish Rao: పోరాటాల పురిటిగడ్డ, తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ లాంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధించడం అప్రజాస్వామికం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.