కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.. అందులో భాగంగా హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో.. ఆయనతో ఓ కార్యక్రమం నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నా అనుమతి మాత్రం దొరకలేదు.. ఇక, ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది.. అయితే, ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతిపై వీసీదే తుది నిర్ణయమని చెప్పింది హైకోర్టు.. ఓయూ విద్యార్థులు వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాహుల్ గాంధీ టూర్ అనుమతికి సంబంధించిన అవకాశాన్ని పరిశీలించాలని వీసీని ఆదేశించింది. దీంతో, వీసీ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: Rahul Gandhi and KTR Tour: వరంగల్‌లో పొలిటికల్ హీట్.. 6న రాహుల్, 7న కేటీఆర్..
కాగా, ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతి నిరాకరించారు వీసీ.. రాజకీయ సభలకు అనుమతి ఇవ్వకూడదని పాలకమండలి నిర్ణయం తీసుకుందన్న ఆయన.. ఇతర సంఘాల నుంచి కూడా అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. ఓయూలో అధికారుల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని.. శాంతి భద్రతలను కూడా పరిగణలోకి తీసుకుని రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వడంలేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇవాళ విచారణ సమయంలో.. ప్రభుత్వం, ఉస్మానియా యూనివర్సిటీ తరుపు న్యాయవాదులు ఎవరూ హైకోర్టుకు హాజరు కాలేదు.. అనుమతిపై వీసీదే తుది నిర్ణయమంటూ.. ఆ పిటిషన్‌పై విచారణ ముగించింది హైకోర్టు.