OU Phd Admissions: ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ)లో పీహెచ్‌డీ ప్రవేశాల విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ప్రవేశపెట్టిన కొత్త రూల్స్‌పై విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఓయూలో గతంలో ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టేవారు. అందులో వచ్చిన మార్కుల
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, టెక్నికల్, నాన్ టెక్నికల్ కళాశాలలు ఇలా అన్ని విద్యాసంస్థలు జూలై 11 నుంచి…
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. శనివారం ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. అయితే రాహుల్ ఓయూ పర్యటనకు యూనివర్సిటీ అధికారులు అనుమతి నిరాకరించారు. దాంతో కాంగ్రెస్ ఇప్పటి వరకు రెండు సార్లు హైకోర్టును ఆశ్రయించింది. అయినా ఫలితం లేకపోయింది. రాహుల్ ఓయూ సందర్శనకు అనుమతించాలని ఓయూ వీసీని ఆదేశించేందుకు రాష్ట్ర అత్యున్న న్యాయస్థానం నిరాకరించింది.…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.. తెలంగాణ హైకోర్టు న్యాయవాది రామారావు హెచ్‌ఆర్సీలో ఈ ఫిర్యాదు చేశారు.. కాంగ్రెస్ పార్టీ శాంతిభద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తోందని తన ఫిర్యాదులో ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణలు ప్రేరేపించే విధంగా వారి వ్యవహారం ఉందంటూ హెచ్ఆర్సీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. Read Also: Rahul Gandhi in Pub: సాయిరెడ్డికి ఠాగూర్ స్ట్రాంగ్…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.. అందులో భాగంగా హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో.. ఆయనతో ఓ కార్యక్రమం నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నా అనుమతి మాత్రం దొరకలేదు.. ఇక, ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది.. అయితే, ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతిపై వీసీదే తుది నిర్ణయమని చెప్పింది హైకోర్టు.. ఓయూ విద్యార్థులు వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాహుల్ గాంధీ టూర్ అనుమతికి సంబంధించిన అవకాశాన్ని పరిశీలించాలని…
ఉస్మానియూ యూనివర్సీటీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌ను ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు ముట్టడించారు. ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ సభకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ.. బిల్డింగ్ గేట్లు ఎక్కి లోపలికి విద్యార్థులు దూసుకెళ్లారు. అంతేకాకుండా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అద్దాలను విద్యార్థులు ధ్వంసం చేశారు. దీంతో 17 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా పోలీసుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ.. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ సహా విద్యార్థులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. వారిని రిమాండ్‌కు…