పూరీ జగన్నాథుడి రత్న భాండాగారంలో ఆభరణాల తరలింపు ప్రక్రియను నిలిపివేశారు అధికారులు. బయటి రత్న భాండాగారంలోని అన్ని ఆభరణాలు తరలించామని ఆలయ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు. లోపల రత్న భాండాగారం తెరుచుకోకపోవడతో తాళాలు పగలగొట్టి తెరిచినట్లు పేర్కొన్నారు. లోపల రత్న భాండాగారంలో ఆభరణాలన్నీ అల్మారాలు, లాకర్లలో పెట్టారు.
హైదరాబాద్ లో సంచలనం కలిగించిన మల్కాజిగిరి లేడీ మర్డర్ కేసులో ట్విస్ట్ బయటపడింది. నగలకోసం మహిళ హత్య జరిగిందని తెలుస్తోంది. భక్తురాలిని హత్య చేసిన పూజారి అని తేలడంతో అందరూ విస్మయానికి గురయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మల్కాజిగిరి పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు పూజారి మురళిని పట్టుకున్నారు మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు. మల్కాజిగిరి ఉమాదేవి అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈనెల 18న వినాయక టెంపుల్ కి వెళ్ళిన…
పోలీసులకు ఆధారాలు దొరకకూడదనే భయంతో ఓ దొంగ 35 గ్రాముల బంగారు ఉంగరాలను మింగాడు. ఆ దొంగ మింగిన బంగారు ఉంగరాలను ఆపరేషన్ చేసి డాక్టర్లు బయటికి తీశారు. ఈ సంఘటన కర్ణాటకలోని సుళ్య పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మార్చి చివర్లో సుళ్య పాత బస్టాండు వద్ద గల నగల షాపులో చోరీ జరిగింది. ఈ ఘటనలో రూ. 7.50 లక్షల విలువ చేసే 180 గ్రాముల బంగారం ఉంగరాలు, రూ. 50 వేలు…