అవినీతి అధికారుల భరతం పడుతున్నారు ఏసీబీ అధికారులు. విజయవాడలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం సూపరిండెంట్ వాసా నగేష్ ఆస్తుల పైన సోదాలు కొనసాగుతున్నాయి. నగేష్ కి సంబంధించిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ద్వారకాతిరుమల దేవస్దానం ప్రసాదాల తయారీ కేంద్రాలకు సంబంధించి చెల్లించే బిల్లులో జీఎస్టీ 6 లక్షలు కాజేశాడు నగేష్. 6 లక్షల రుపాయలు అవినీతి రుజువుకావడంతో ఇప్పటికే నగేష్ జీతం నుండి జమ చేస్తుంది ప్రభుత్వం..
నగేష్ కు చెందిన సిండికేట్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేసిన ఏసిబి అధికారులు..పలు కీలక డాక్యుమెంట్లు లభ్యం అయ్యాయి. ఇంద్రకీలాద్రిపై మహశివరాత్రి రోజు ప్రసాదాలు టోకెన్లు లేకుండా విక్రయాలు చేసిన ఆరోపణలు రుజువైన నగేష్ పై చర్యలు తీసుకోలేదు ఆలయ ఈవో.. కొండపై పలు కీలక బాధ్యతలు అప్పగించడం వివాదాస్పదం అవుతోంది.
Read Also:Cyclone Mocha: వచ్చేవారం తూర్పుతీర రాష్ట్రాలకు ‘మోచా’ తుపాను ముప్పు..
ప్రతి విభాగం నుండి వారం మామూళ్ళు తప్పనిసరి.. ఇవ్వని సిబ్బంది పై నగేష్ వేధింపులు చేసేవాడు. ఇప్పటికే నగేష్ అవినీతి పై ఈవో భ్రమరాంభకు పాలకమండలి సభ్యులు ఫిర్యాదు చేశారు. పాలకమండలి సభ్యులు ఫిర్యాదు చేసిన నగేష్ పై చర్యలు శూన్యం అపూ విమర్శలున్నాయి. ఏసిబి సోదాలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. కుమ్మరిపాలెంలోని లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్ లోని నివాసం, తూర్పుగోదావరి & పశ్చిమగోదావరి జిల్లాల్లోని మరో 6 చోట్ల (భీమడోలు, ద్వారకా తిరుమల, నిడదవోలు) దుర్గా దేవాలయంలోని ఏఓ కార్యాలయంతో పాటు ఏఓ బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు జరిగాయి.
వాసా నగేష్ నుండి స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలను ఏసీబీ అధికారులు విడుదల చేశారు. నగేష్ ఇంట్లో 17.91 లక్షల నగదు తో పాటు 2209,10 గ్రాముల బంగారం.. ద్వారకా తిరుమలలో G+4 ఇల్లు, తాడేపల్లి గూడెంలో ఇల్లు, జంగారెడ్డిగూడెంలో ఇల్లు, నిడదవోలో ఇంటి ఫ్లాట్,నిడదవోలులో ఇల్లు, సుజుకి వ్యాగన్ – కారు, రెండు యాక్టివా స్కూటర్లు లభించాయి. దుర్గగుడి సూపరిడెంటెంట్ వాసా నగేష్ నుండి భారీగా ఆస్తులు స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. ఇంకా వాసా నగేష్ ఇంటి తో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో కొనసాగుతున్నాయి సోదాలు..నగేష్ ఇంటిలో సీజ్ చేసిన బంగారం బహిరంగ మార్కెట్‌లో విలువ 13 లక్షలుగా ఉంటుందని సమాచారం.
Read Also: Off The Record: కమలం పని వాయిదాలతో సరి