హైదరాబాద్ లో సంచలనం కలిగించిన మల్కాజిగిరి లేడీ మర్డర్ కేసులో ట్విస్ట్ బయటపడింది. నగలకోసం మహిళ హత్య జరిగిందని తెలుస్తోంది. భక్తురాలిని హత్య చేసిన పూజారి అని తేలడంతో అందరూ విస్మయానికి గురయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మల్కాజిగిరి పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు పూజారి మురళిని పట్టుకున్నారు మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు.
మల్కాజిగిరి ఉమాదేవి అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈనెల 18న వినాయక టెంపుల్ కి వెళ్ళిన ఉమాదేవి.. తిరిగి ఇంటికి రాకపోవడంతో గుడి పరిసరాలు పరిశీలించారు కుటుంబ సభ్యులు. అనంతరం మిస్సింగ్ పోస్టర్లు రిలీజ్ చేశారు కుటుంబ సభ్యులు. ఉమాదేవి చేతికి బంగారు ఆభరణాలు, మంగళసూత్రం ఉందంటూ మిస్సింగ్ పోస్టర్లలో పేర్కొన్నారు. దీంతో బంగారం కోసం ఆమెని ఎవరైనా అపహరించి వుంటారని భావించారు.
3 రోజుల క్రితం గుడి పరిసరాల్లో గాలించారు పోలీసులు. అనూహ్యంగా గురువారం గుడి పరిసరాల్లో లభించింది ఉమాదేవి మృత దేహం. ఆమె మృత దేహం పై బంగారు గాజులు, మంగళ సూత్రం మాయం అయ్యాయి. గుడి పరిసరాల్లో సీసీ కెమెరాలు లేవు. బంగారం కోసమే ఉమా దేవిని హత్య చేసి ఉంటారని భావించారు పోలీసులు. మల్కాజ్ గిరి పోలీసులు అనుమానాలు నిజం అయ్యాయి. గుడి పూజారి ఈ దారుణానికి ఒడిగట్టాడని తేలింది.