పేరుకే అది ఒంగోలు నగర పాలక సంస్థ. నగరంలో మూడు-నాలుగు రోజులకు ఒక సారే నీళ్లిస్తారు. అది కూడా అర్థరాత్రి దాటాకే. ఇక శివారు ప్రాంతాలకు అరకొర ట్యాంకర్లే గతి. దీంతో గుక్కెడు మంచినీళ్ల కోసం అవస్థలు పడాల్సివస్తోంది. మూడు లక్షలకు పైగా జనాభా ఉన్న ఒంగోలు నగరంలో ఈ దుస్థితి ఇంకెన్నాళ్ళు అంటున్నారు ప్రజలు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంచినీటి కోసం జనం జాగారాలు చేయాల్సి వస్తోంది. ఒంగోలు నగరంలో…
ఒకవైపు ఒంగోలులో టీడీపీ మహానాడు.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మంత్రుల సామాజిక న్యాయభేరీ బస్సు యాత్రతో ఏపీలో ఎన్నికల వాతావరణం ప్రారంభం అయినట్టే కనిపిస్తోంది. మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు గర్జించారు. యుద్ధం ప్రకటించారు. వైసీపీని భూస్థాపితం చేస్తానని ప్రతిన బూనారు. జగన్ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఇదీ వైసీపీ అవినీతి, అక్రమాల, దౌర్జన్యాలు, దారుణాల చిట్టా అంటూ లెక్క చెప్పారు. జగన్ మింగిన అవినీతి సొమ్ము మొత్తం కక్కిస్తామని తెలుగు తమ్ముళ్ళ సాక్షిగా…
ఏ మహానాడులోనూ ఒంగోలు మహానాడులో ఉన్నంత కసి చూడలేదు.ఉన్మాదుల పాలన నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలని కార్యకర్తలు తరలి వచ్చారు.మనకు జనాలు ఉన్నారు.. వారికి బస్సులున్నాయి.అధికారం పోతే ఆ బస్సులు కూడా వైసీపీకి ఉండవు. మహానాడును అడ్డుకునేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నించారు. మహానాడు వాహానాలకు గాలి తీసేస్తున్నారు.ప్రభుత్వం గాలి తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.జగనుకు ఈ రోజు పిచ్చెక్కుతుంది.జగనుకు ఇవాళ నిద్ర పట్టదు. వైసీపీ నేతలు వెల వెల.. టీడీపీ మీటింగులు కళ కళ.భవిష్యత్తులో ఎన్టీఆర్ రికార్డులను ఎవ్వరూ…
ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడులో ఉద్వేగభరితంగా ప్రసంగించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వైఎస్సార్సీపీ అంటే యువజన శృంగార రౌడీ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు రాముడు.. జగన్ రాక్షసుడు. టీడీపీ స్థాపించిన 40 ఏళ్ల చరిత్రలో ఈ రోజు ప్రత్యేక స్థానం. పార్టీ పునాదులు గట్టిగా ఉన్నాయి.. ఎవ్వరూ ఏం చేయలేరు. టీడీపీని ఏదో చేద్దామనుకున్న వాళ్లు గాల్లో కొట్టుకుపోయారు. టీడీపీ కార్యకర్తల శరీరం కొస్తే పసుపు రక్తం వస్తుంది. వైసీపీ నేతలు చంపే…
ఒంగోలులో టీడీపీ మహానాడు బహిరంగ సభ ప్రారంభం అయింది. భారీ ఎత్తున మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు కార్యకర్తలు. ఇంకా వివిధ మార్గాల్లో చేరుకుంటున్నారు. సాయంత్రం 5:30 గంటలకు బహిరంగ సభకు రానున్నారు చంద్రబాబు. 6:30 చంద్రబాబు ప్రసంగం వుంటుంది. ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్నారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్. బహిరంగ సభకు బాలకృష్ణ హాజరు కానున్నారు. బడుగులకు ప్రాధాన్యం ఇచ్చిన ఘనత టీడీపీదే అన్నారు టీడీపీ పొలిటి బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు,…
మహానాడు రెండో రోజున భారీ బహిరంగ సభ జరగనుంది. వివిధ జిల్లాల నుంచి బహిరంగ సభకు తరలి వస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వస్తారని టీడీపీ అంచనా వేసింది. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి కార్లు, ట్రాక్టర్లు, వివిధ వాహనాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు వస్తుండడంతో ఒంగోలుకి వచ్చే దారులన్నీ పసుపుమయంగా మారాయి.
టీడీపీ మహానాడులో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఏపీలో ఉన్మాది పాలన కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. చేతకాని పాలన వల్ల ఏపీ పరువుపోయిందన్నారు. అటు మూడేళ్లుగా తమ నేతలను, కార్యకర్తలను ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఎంతోమంది టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తే తాను నిద్రలేని రాత్రులు గడిపానన్నారు. అనవసరంగా ఉన్మాది చేతిలో బలికావొద్దని కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు. ఏపీలో పోలీసుల్లో మార్పు రావాలని… వాళ్ల లాఠీదెబ్బలకు ఇక్కడ ఎవరూ భయపడరని చంద్రబాబు హెచ్చరించారు.…
ఒంగోలు సమీపంలో టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. రెండు రోజుల పాటు మహానాడు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో మహానాడు కార్యక్రమానికి వచ్చే అతిథుల కోసం టీడీపీ భారీ ఫుడ్ మెనూ సిద్ధం చేసింది. మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పర్యవేక్షణలో ఆహార కమిటీ రుచికరమైన వంటకాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే వెయ్యి మంది నిష్ణాతులైన వారు మహానాడు ప్రాంగణంలో వంటకాలను సిద్ధం చేస్తున్నారు. మొత్తం 11 ఫుడ్ కోర్టులు ఏర్పాటు…