బీజేపీ హైకమాండ్ ఎంపీలకు విప్ జారీ చేసింది. మంగళవారం ఎంపీలంతా లోక్‌సభకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 17, 2024న కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సభలో చర్చకు రానున్నందున పార్లమెంట్ సభ్యులంతా తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేసింది.
Kaushik Reddy: వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావాలని ఎమ్మెల్యే అన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే బీఆర్ఎస్ ది కాదని క్లారిటీ ఇచ్చారు.
డిసెంబరు 12న కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన 'వన్ నేషన్-వన్ ఎలక్షన్' బిల్లు నిరంతర అభివృద్ధి కోసం ఆకాంక్షించే భారతదేశం తరపున ఒక ప్రధాన ప్రకటన అని రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ ట్వీట్ చేశారు. అంతకుమించి, మన దేశం 2047 నాటికి 'వికసిత్ భారత్'ను సాకారం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, మనం స్వాతంత్య్రం పొందిన 100 సంవత్సరాలను జరుపుకుంటున్నప్పుడు ఈ నిర్ణయం, ఈ చారిత్రాత్మక బిల్లు ప్రధాని మోడీ దార్శనికతకు గుర్తుగా నిలుస్తుందన్నారు.
సంక్రాంతి నుంచి రైతు భరోసా.. ఇప్పటికే ప్రకటించామన్న భట్టి రైతు భరోసాని సంక్రాంతి నుంచి అమలుచేస్తామని.. ఇప్పటికే ప్రకటించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రైతులకు ఇచ్చే బోనస్ రైతు భరోసా, రుణమాఫీ కన్నా ఎక్కువ లబ్ధి రైతులకు చేకూర్చుతుందని తెలిపారు. ఢిల్లీలో మీడియాతో డిప్యూటీ సీఎం చిట్ చిట్ నిర్వహించారు. రాహుల్ గాంధీని కలవలేదని తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. హైడ్రాకి ధనికా పేద అన్న తేడా లేదని భట్టి…
Parliament: ‘‘ వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లు’’కి గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశాల్లోనే బిల్లుని పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, డిసెంబర్ 13-14 తేదీల్లో పార్లమెంట్ సమావేశాలకు తప్పకుండా హాజరుకావాలని బీజేపీ తన ఎంపీలకు ‘‘త్రీ లైన్ విప్’’ జారీ చేసింది. ఉభయసభల్లో ముఖ్యమైన చర్చలకు హాజరుకావాలని కోరింది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేబినెట్ ‘‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’’ బిల్లుని ఆమోదించిన తర్వాత ఇది జరిగింది.
Parliament’s Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 25న ప్రారంభమై డిసెంబర్ 20 వరకు సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమయంలో పార్లమెంట్ ఉభయసభలు (లోక్‌సభ మరియు రాజ్యసభ) సమావేశపరచాలనే ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ధృవీకరించారు. Read Also: RK Roja: మీ వల్ల కాకపోతే రాజీనామా చేయండి.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు భారతరాజ్యాంగాన్ని ఆమోదించి 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని…
PM Modi: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు నివాళులు అర్పించారు. 149వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ గురువారం గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వద్ద నివాళులర్పించారు. ఈ సారి జాతీయ ఐక్యతా దినోత్సవం రోజు దీపావళి పండగ వచ్చిందని పీఎం మోడీ అన్నారు. దేశంలో ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’ నిజం అవుతుందని ఆయన అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఒకేసారి ఎన్నికలు ఉపయోగపడుతాయని అన్నారు. ప్రతిపక్షాలు…
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తగిన సమయం ఉంటుందని, పార్టీని మరింత పటిష్టం చేయడానికి మంచి అవకాశం ఉంటుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొ్న్నారు. ప్రతిక్షంగానూ, అధికారంలోనూ, మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంగానూ పార్టీ ఉందన్నారు. అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. 15 ఏళ్లలో పార్టీ ప్రస్థానం ముందుకు సాగిందన్నారు. కాకపోతే మనం ఆర్గనైజ్డ్‌గా యుద్ధంచేస్తున్నామా? లేదా? అన్నది చాలా ముఖ్యమని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగితేనే అది…
ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనేది రాజ్యాంగ నిర్మాతల ఆలోచన అని 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' అంశంపై ఏర్పాటైన కమిటీ ఛైర్మన్ రామ్నాథ్ కోవింద్ శనివారం అన్నారు. కనుక ఇది రాజ్యాంగ విరుద్ధం కాదని స్పష్టం చేశారు.