Kaushik Reddy: వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావాలని ఎమ్మెల్యే అన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే బీఆర్ఎస్ ది కాదని క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. బీఏసీలో చర్చ జరగకుండా అసెంబ్లీలో ఎజెండా ఎలా పెడతారు? అని ప్రశ్నించారు. టూరిజం మీద చర్చ కాదు..లగచర్ల బాధితుల మీద చర్చ పెట్టాలన్నారు. రేవంత్ రెడ్డి కి ఓటు వేసినందుకు లగచర్ల వాసులకు బేడిలు వేశారని మండిపడ్డారు. వాళ్ళు ఏమి తప్పు చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి అల్లుడు, అదానీ కోసం భూములు గుంజుకుంటున్నారన్నారు. హరి నాయక్ కు గుండె పోటు వస్తే కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదన్నారు.
Read also: KTR Tweet: కాంగ్రెస్ పై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతాం.. అప్పుల అంశంపై కేటీఆర్ ట్వీట్..
హరి నాయక్ కు ఏమైనా అయితే ఎవరు బాధ్యులన్నారు. హరి నాయక్ కు గుండె పోటు వస్తే అంబులెన్స్ లో కాకుండా పోలీస్ వాహనంలో హాస్పిటల్ కు తీసుకు వెళ్లారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు. సభలో లగచర్ల రైతుల మీద చర్చ చేయాలని డిమాండ్ చేశారు. టూరిజం మీద చర్చ ఏముంది కేవలం డిల్లీ, జైల్ టూరిజం మాత్రమే రాష్ట్రంలో జరుగుతున్నాయన్నారు. పదుల సార్లు సీఎం డిల్లీకి వెళ్ళారు కానీ ఒక్క రూపాయి కూడా తీసుకు రాలేదన్నారు. టెర్రరిజం నడిపినట్టు రాష్ట్రంలో పాలన నడుస్తుందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో రుణమాఫీ, రైతు భరోసా, లగచర్ల మీద చర్చ చేయాలన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావాలని జనాలు కోరుకుంటున్నారన్నారు. 2027 లో ఎన్నికలు రావాలని కోరుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావాలి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే బీఆర్ఎస్ ది కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో పట్నం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిని చిత్తు చిత్తు ఓడగొడుతారన్నారు.
Telangana Assembly Live 2024: ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు