Vijay: తమిళగ వెట్రీ కజగం (టీవీకే) చీఫ్, తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ శనివారం తన రాష్ట్రవ్యాప్త పర్యటనను ప్రారంభించారు. తిరుచిరాపల్లి నుంచి తన తొలి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో డీఎంకేలు రెండూ కూడా ప్రజల్ని మోసం చేస్తున్నాయని ఆరోపించారు. వారు ఇచ్చిన హామీలు విఫలమయ్యాయని అన్నారు. రాజులు యుద్ధానికి వెళ్లే ముందు దేవాలయాల్లో ప్రార్థనలు చేసినట్లుగా, 2026 ప్రజాస్వామ్య యుద్ధానికి సిద్ధమయ్యే ముందు ప్రజలను కలవడానికి వచ్చానని…
Youth Awardees Meet President: ఒక దేశం ఒకే ఎన్నిక అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ చర్చలు చేస్తోంది. అయితే ఎన్నికల అంశంపై యువతలో అవగాహన పెంచేందుకు దేశవ్యాప్తంగా చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఒక దేశం – ఒకే ఎన్నిక కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు యువకులు. రాష్ట్రపతిని కావలసిన వాళ్లలో ఆంధ్రప్రదేశ్ యువజన అవార్డ్…
వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది.. దేశానికి, తమిళనాడుకు కొత్తదేమీ కాదు అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన ధినేత పవన్ కల్యాణ్.. చెన్నైలో జరిగిన వన్ నేషన్ - వన్ ఎలక్షన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1952-67 వరకు దేశంలో ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరిగాయి... వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనేది కోరుకున్నది మాజీ సీఎం దివంగత కరుణానిధి .. ఇప్పుడు వారి కూమారుడు స్డాలిన్ వద్దు అంటున్నారు అని మండిపడ్డారు.
చెన్నైలో జరిగిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ సమావేశంలో పాల్గొన్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కీలక వ్యాఖ్యలు చేశారు.. తమిళనాడులో చాలాకాలం పాటు పెరిగాను.. తమిళనాడును వదిలి ముప్పై ఏళ్లు అయ్యింది.. నేను తమిళనాడు వదిలి పెట్టి వెళ్లాను.. కానీ, నన్ను తమిళనాడు వదలలేదు.. తమిళనాడు నాపై చాలా ప్రభావం చూపించింది... ఇక్కడే రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక భావన, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను.. అందుకే తమిళనాడు అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం,…
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెన్నైలోని తిరువాన్మియూర్‌లో జరిగిన ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ అనే సెమినార్‌కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సెమినార్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తిరువల్లువర్, భారతియార్, ఎంజీఆర్ జీవించిన నేల తమిళనాడు.. తమిళనాడు సిద్ధుల భూమి. తమిళ దేవుడు మురుగన్ భూమి.. నేను తమిళనాడులో నివసించాను.. నేను చెన్నైలో పెరిగాను.. నేను తమిళనాడు వదిలి వెళ్ళిపోయినా, తమిళనాడు నన్ను వదిలి వెళ్ళలేదు అని అన్నారు. Also Read:Kakani…
ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు చెన్నైలో పర్యటించనున్నారు. ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ అంశంపై జరగనున్న సెమినార్‌లో ముఖ్యఅతిథిగా అయన పాల్గొననున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు తిరువాన్మియూరు రామచంద్ర కన్వెన్షన్ హాలులో ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’పై సదస్సు జరగనుంది. తెలంగాణ మాజీ గవర్నర్, ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్ తమిళనాడు రాష్ట్ర కన్వీనర్ తమిళసై సౌందర రాజన్ నేతృత్వంలో ఈ సెమినార్ ఏర్పాటైంది. Also Read: Pawan Kalyan: ప్రధాని మోడీ ఓట్లు కోసం…
జమిలిపై మరోసారి కదలిక వచ్చింది. ఇక మంగళవారం ఢిల్లీలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం కానుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశం జరగనుంది.
2029 పార్లమెంట్ ఎన్నికల తర్వాతే ‘జమిలి ఎన్నికలు’ అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రక్రియను 2029 తర్వాతే రాష్ట్రపతి ప్రారంభిస్తారని, 2034లో జమిలి జరిగే అవకాశం ఉంటుందన్నారు. జమిలిపై ఏమీ జరగక ముందే రాజకీయ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అనేది కొత్త ఆలోచన కాదని, ఇది ఎప్పటి నుంచో ఉన్నదే అని పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో దాదాపు రూ.లక్ష కోట్లు…
Nirmala Sitharaman: జమిలి ఎన్నికలపై వస్తున్న పుకార్లపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’పై వస్తున్న తప్పుడు కథనాలను శనివారం ఆమె తోసిపుచ్చారు. రాబోయే ఎన్నికల్లో దీన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, ఏక కాల ఎన్నికల ద్వారా ఇంత భారీ ఖర్చును ఆదా చేయవచ్చని…
ఒకే దేశం – ఒకే ఎన్నిక ప్రాముఖ్యత, సవాళ్ళు, ప్రభావం పై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ న్యాయమూర్తి బి.శివశంకరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతు.. రాజకీయాలు విరమించి ప్రజాజీవనంలో మాత్రమే పాల్గొంటున్నా.. రాజ్యాంగంలో ఉన్నత పదవి నుంచి వచ్చాక రాజకీయాలు మాట్లాడకూడదు.. పదవీ విరమణ చేసాను కానీ పెదవి విరమణ చేయలేదు.. రాజకీయంగా కనిపించని రాజకీయ అంశాలు మాట్లాడతాను.. ఒకే దేశం ఒకే ఎన్నిక…