Amit Shah: బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని అన్ని వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాత వచ్చే 5 ఏళ్లలో దేశం మొత్తం యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ని అమలులోకి తెస్తామని కేంద్ర హోమంత్రి అన్నారు.
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను కలిపి నిర్వహిస్తే 8 వేల కోట్ల రూపాయల అదనపు వ్యయం అవుతుందని ఎన్నికల కమిషన్ పోల్ ప్యానెల్ ఉన్నతస్థాయి కమిటీకి స్పష్టంగా చెప్పింది.
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన 'ఒకే దేశం ఒకే ఎన్నికలు' అనే అంశంపై ఉన్నత స్థాయి కమిటీ తన సిఫార్సు నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గురువారం నాడు సమర్పించింది. ఈ నివేదికలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలనే భావనకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీల జాబితా కూడా ఉంది.
జమిలి ఎన్నికలపై (One Nation One Election) ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Former President Ram Nath Kovind) ఆధ్వర్యంలో భేటీ అయింది.
దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికల (One Nation One Election) నిర్వహణపై ఏర్పడిన అత్యున్నత స్థాయి కమిటీని ఢిల్లీలో (Delhi) ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) కలిశారు.
Simultaneous Polls: వన్ నేషన్-వన్ ఎలక్షన్ కోసం కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే కొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను (ఈవీఎం) కొనుగోలు చేసేందుకు ప్రతి 15 ఏళ్లకు రూ. 10,000 కోట్లు అవసరమవుతాయని ఎన్నికల సంఘం అంచనా వేసింది.
Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ సుప్రీమో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ని వ్యతిరేకించారు. దీనిపై ప్యానెల్ కార్యదర్శి నితేన్ చంద్రకు లేఖ రాశారు. ఏక కాలంలో దేశవ్యాప్తంగా ఎన్నికలను తాము ఒప్పుకోమని చెప్పారు. జమిలి ఎన్నికలకు ‘‘ అధ్యక్ష పరిపాలనకు ఒక అడుగు’’ అని పేర్కొంది.