Central Govt key announcement in Parliament on Jamili election: కేంద్రం జమిలి ఎన్నిలకు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. జమిలి ఎన్నికలపై కేంద్రం పార్లమెంట్ లో కీలక ప్రకటన చేసింది. పార్లమెంట్ కు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశం పరిశీలనలో ఉందని తెలిపింది. జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, సీఈసీతో చర్చించామని వెల్లడించింది. అలాగే అనేక భాగస్వామ్య పక్షాలతో చర్చించామని కేంద్రం వెల్లడించింది.
ప్రతి ఏడాది దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా రాష్ట్రాల ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు వేరువేరుగా నిర్వహించడం వలన అధికవ్యయం అవుతున్నది. అంతేకాకుండా అభివృద్ది సైతం కొంత వెనకబడే అవకాశం ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వలన ఒకేసారి ఖర్చు చేస్తే సరిపోతుంది. దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు కేంద్రం నిధులు కేటాయిస్తే, రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు ఆయా రాష్ట్రాలు నిధులు సమకూర్చుకోవాలి. అదే అన్ని ఎన్నికలు…