ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ కరోనా మహమ్మారి ఇప్పుడు టెన్షన్ పెడుతోంది.. దీంతో అప్రమత్తమైన కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.. ఇక, ఈ కొత్త వేరియంట్‌పై రాజ్యసభలో క్లారిటీ ఇచ్చారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ.. భారత్‌లో ఇప్పటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదు కాలేదని స్పష్టం చేశారు.. ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభలో మాట్లాడిన ఆయన… ఒమిక్రాన్ వేరియంట్‌ను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.. ఎయిర్‌పోర్ట్‌ల వద్ద స్క్రీనింగ్ చేస్తున్నామని, పాజిటివ్…
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వ్యాక్సినేషన్ జరుగుతోంది.. ఇక, ఇప్పుడు సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను కలవర పెడుతోంది.. జట్ స్పీడ్‌తో వ్యాపిస్తున్న ఈ వైరస్.. అత్యంత ప్రమాదకారి అని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించగా.. మరోవైపు.. ఒమిక్రాన్‌కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంపై కూడా దృష్టిసారించారు శాస్త్రవేత్తలు.. ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా రష్యా కొత్త కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం షురూ…
తెలంగాణ కేబినేట్ భేటిలో చర్చించిన అనంతరం సీఎం కేసీఆర్ మంత్రులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. ఐదు గంటల పాటు కేబినేట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సన్నద్ధంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. కరోనా పరీక్షలు పెంచాలని నిర్ణయం. మందులు, వ్యాక్సిన్‌లు సమకూర్చుకోవాలని ఆదేశం. ఇప్పటికే ఒమిక్రాన్ పై మంత్రి హరీష్ రావు అధ్యక్షతన సబ్‌కమిటీని వేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంవంతం చేయాలని సూచించారు. వైద్యాఆరోగ్య శాఖతో…
ప్రపంచం మొత్తాన్ని ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం స్టాక్ మార్కెట్ సూచీలు కొంత ఆందోళన కలిగించాయి. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యాయి. అయితే, ఇది కేవలం అరగంట మాత్రమే అని స్పష్టమయింది. కోనుగోళ్ల తాకిడి పెరగడంతో సూచీలు భారీగా పుంజుకున్నాయి. రిలయన్స్ టారిఫ్ ధరలు పెంచడం, ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటాపై…
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రబలుతున్న నేపథ్యంలో సీఎం వైఎస్.జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యాక్సినేషన్ మరింత ఉద్ధృతంగా చేయాలని, కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్స్‌ను వీలైనంత త్వరగా వినియోగించాలన్నారు. వ్యాక్సినేషన్‌ను ఎంత త్వరగా పూర్తి చేయగలుగుతారనేది మీ ముందున్న టాస్క్ అన్నారు. ప్రజలందరూ మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకోవాలి. జనాలు గుమిగూడకుండా చూడాలి. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు.…
ప్రపంచం మొత్తం ఇప్పుడు కొత్త వేరియంట్‌తో భయపడుతున్నది. ఎటు నుంచి దేశంలోకి ప్రవేశిస్తుందో తెలియక ఆందోళనలు చెందుతున్నారు. ఈ వేరియంట్ నుంచి బయటపడేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని దేశాలు అంతర్జాతీయ ప్రయాణికులపై నిషేదం విధిస్తే, ఇజ్రాయిల్ వంటి దేశాలు సరిహద్దులు మూసివేశాయి. ప్రపంచ దేశాలు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంటే, చైనా మాత్రం తనకేమి తెలియదు అన్నట్టుగా బలప్రదర్శన చేస్తున్నది. Read: బ్రేకింగ్ : ఒమిక్రాన్‌పై సబ్ కమిటీ.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..…
ప్రపంచాన్ని కోవిడ్ కొత్త వేరింయట్ ఒమిక్రాన్ వణికిస్తుంది. ఇప్పుడిప్పుడే అన్ని సాధారణ స్థితికి వస్తున్న వేళ కొత్త వేరింయట్‌తో ఆయా దేశాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఊహించని విధంగా ఒమిక్రాన్ వ్యాపిస్తుంది. దాని లక్షణాలు తెలుసుకునే లోపే అది ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని తట్టుకుని వ్యాపిస్తున్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇతర దేశాల నుంచి భారత్ లోకి వచ్చినవారికి కోవిడ్ టెస్టులు చేయడంతో పాటు వారికి 14 రోజులు క్వారంటైన్ విధిస్తున్నారు.…
ఒమిక్రాన్ ఈ పేరు ప్రపంచాన్ని భయపెడుతున్నది. 32 మ్యూటేషన్లు కలిగి ఉండటంతో ఇన్‌ఫెక్షన్‌ను అధికంగా కలిగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదకరమైన డెల్టా కంటే ఈ వేరియంట్ పదిరెడ్లు ప్రమాదకరం కావడంతో ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం హెచ్చరికలు జారీ చేసింది. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. ఇక ఒమిక్రాన్ వేరియంట్‌ను మొదటగా దక్షిణాఫ్రికాలో గుర్తించారని వార్తలు వస్తున్నాయి. అయితే, మొదటగా ఈ వేరియంట్ ను నవంబర్ 11న బోట్స్‌వానాలో గుర్తించగా, దక్షిణాఫ్రికాలో నవంబర్ 14న…
ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాలో మొదలైన ఈ వేరియంట్ ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలకు వ్యాపించింది. దీంతో సౌత్ ఆఫ్రికాపై 18 దేశాలు ఆంక్షలు విధించాయి. అంతర్జాతీయ ప్రయాణికులపై కేంద్రం దృష్టిసారించింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులపై ప్రత్యేకమైన దృష్టిని సారించారు అధికారులు. Read: ప్రముఖ టెలికామ్ కంపెనీపై కన్నేసిన రిలయన్స్… వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లో కరోనా నిర్థారణ పరీక్షలు…
కరోనా మహమ్మారి కొత్త కొత్త వేరియంట్లుగా దాడి చేస్తూనే ఉంది.. తాజాగా సౌతాఫ్రికాలో వెలుగు చూసిన వేరియంట్.. జెట్ స్పీడ్‌తో ఎటాక్ చేస్తోంది.. కేవలం నాలుగు రోజుల్లోనే 14 దేశాలను తాకేసింది.. దీంతో, అప్రమత్తమైన దేశాలు.. ఆంక్షలు విధిస్తున్నాయి… ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్‌వో) కీలక వ్యాఖ్యలు చేసింది… కొత్త వేరియంట్ B.1.1.529 ప్రభావాన్ని మదింపు చేసేందుకు కొంత సమయం పడుతుందని.. కొద్ది వారాల తర్వాత దాని ప్రభావాన్ని మదింపు చేయగలమని పేర్కొంది.. అయితే,…