ఒమిక్రాన్‌పై హై అలర్ట్… సీఎం జగన్ కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రబలుతున్న నేపథ్యంలో సీఎం వైఎస్.జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యాక్సినేషన్ మరింత ఉద్ధృతంగా చేయాలని, కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్స్‌ను వీలైనంత త్వరగా వినియోగించాలన్నారు. వ్యాక్సినేషన్‌ను ఎంత త్వరగా పూర్తి చేయగలుగుతారనేది మీ ముందున్న టాస్క్ అన్నారు.
ప్రజలందరూ మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకోవాలి. జనాలు గుమిగూడకుండా చూడాలి. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. మాస్క్ విషయంలో మళ్ళీ డ్రైవ్…గతంలో ఉన్న నిబంధనలు అమలుచేయండి. డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్, ఫీవర్ సర్వే రెండూ చేయండి. ఆక్సిజన్ పైప్‌లైన్లు సరిగ్గా ఉన్నాయా? లేవా? డాక్టర్లు అందుబాటులో ఉన్నారా లేదా చూసుకోవాలన్నారు.
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ఎంప్యానల్ ఆసుపత్రులు, క్వారంటైన్ సెంటర్స్, కోవిడ్ కేర్ సెంటర్స్, కోవిడ్ కాల్ సెంటర్‌లను తిరిగి పరిశీలించాలి. ఏ అనారోగ్య సమస్య ఉన్నా 104కు కాల్ చేస్తే వైద్యం అందుబాటులో ఉండాలన్నారు సీఎం జగన్. జిల్లా స్ధాయిలో కలెక్టర్‌లను, లైన్ డిపార్ట్‌మెంట్‌లను సిద్దం చేయండన్నారు. అవగాహన, అప్రమత్తత రెండూ ముఖ్యం. వ్యాక్సినేషన్ విషయంలో దూకుడుగా ఉండడం చాలా ముఖ్యం అన్నారు జగన్.
డిసెంబర్ నెలాఖరికల్లా రెండు కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నదే టార్గెట్ అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ మాక్ డ్రిల్ చేయాలి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లలో స్పెషల్ మెడికల్ టీమ్స్‌ను ఏర్పాటు చేయాలి. ఏపీకి వచ్చే వారిని ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేయాలన్నారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు మాత్రమే చేయాలి, ర్యాపిడ్ టెస్ట్‌లు వద్దన్నారు సీఎం జగన్. ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలన్నారు జగన్.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు