ఒమిక్రాన్ ఈ పేరు ప్రపంచాన్ని భయపెడుతున్నది. 32 మ్యూటేషన్లు కలిగి ఉండటంతో ఇన్‌ఫెక్షన్‌ను అధికంగా కలిగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదకరమైన డెల్టా కంటే ఈ వేరియంట్ పదిరెడ్లు ప్రమాదకరం కావడంతో ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం హెచ్చరికలు జారీ చేసింది. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. ఇక ఒమిక్రాన్ వేరియంట్‌ను మొదటగా దక్షిణాఫ్రికాలో గుర్తించారని వార్తలు వస్తున్నాయి. అయితే, మొదటగా ఈ వేరియంట్ ను నవంబర్ 11న బోట్స్‌వానాలో గుర్తించగా, దక్షిణాఫ్రికాలో నవంబర్ 14న బయటపడింది.
Read: ఒమిక్రాన్ వేరియంట్‌కు వ్యాక్సిన్ ఎప్పుడు రాబోతుంది?
అప్పటి నుంచి ఈ వేరియంట్‌పై వైరాలజిస్టులు పరిశోధనలు చేసి కొత్త వేరియంట్‌కు బి 1.1.529 అని సాంకేతిక పేరు పెట్టారు. ఇందులో 32 మ్యూటేషన్లు ఉన్నట్టు వైరాలజిస్టులు గుర్తించిన తరువాత ప్రపంచ ఆరోగ్యసంస్థ అన్ని దేశాలను అలర్ట్ చేసింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ వేరియంట్ కేసులు 160 వరకు నమోదయ్యాయి. అత్యధిక కేసులు దక్షిణాఫ్రికాలోనే ఉన్నాయి.