ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాలో మొదలైన ఈ వేరియంట్ ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలకు వ్యాపించింది. దీంతో సౌత్ ఆఫ్రికాపై 18 దేశాలు ఆంక్షలు విధించాయి. అంతర్జాతీయ ప్రయాణికులపై కేంద్రం దృష్టిసారించింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులపై ప్రత్యేకమైన దృష్టిని సారించారు అధికారులు.
Read: ప్రముఖ టెలికామ్ కంపెనీపై కన్నేసిన రిలయన్స్…
వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లో కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనెల 25,26,27 తేదీల్లో దక్షిణాఫ్రికా నుంచి 185 మంది ప్రయాణికులు వచ్చారని అధికారులు దృవీకరించారు. బోట్స్‌వానా నుంచి 16 మంది, కొత్త వేరియంట్ నిర్ధారణ జరిగిన 12 దేశాల నుంచి కూడా ప్రయాణికులు హైదరాబాద్‌కు వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఇలా మూడు రోజుల నుంచి వచ్చిన ప్రయాణికులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్ ఉన్నట్టు తేలింది. దీంతో వీరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీసీఎంబీకి పంపారు.