పారిస్ ఒలింపిక్స్‌ను అస్థిరపరిచేందుకు కుట్ర పన్నిన 40 ఏళ్ల రష్యా వ్యక్తిని ఫ్రెంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తిని ముందస్తు నిర్బంధంలో ఉంచారు. నేరం రుజువైతే 30 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు. రెండు రోజుల్లో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్నాయని పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం బుధవారం తెలిపింది.
ఇది కూడా చదవండి: Paris Olympics 2024: 14 ఏళ్లకే ఒలింపిక్స్ లో చోటు సంపాదించిన భారత స్విమ్మర్..
అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచన మేరకు ఫ్రెంచ్ పోలీసులు రష్యన్ ఇంటిపై దాడి చేసిన తర్వాత 40 ఏళ్ల వ్యక్తిని మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు ప్రాసిక్యూటర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.ఇంటి దగ్గర లభించిన సాక్ష్యాలు ప్రకారం.. ఒలింపిక్స్ క్రీడల సమయంలో గేమ్స్‌ను అస్థిర పరిచేందుకు కుట్రపన్నినట్లుగా గుర్తించారు.
ఇది కూడా చదవండి: GNSS-Based Toll System : “ఎంత దూరం ప్రయాణిస్తే అంతే టోల్ ఫీ”.. నితిన్ గడ్కరీ బిగ్ అనౌన్స్‌మెంట్..
ఇదిలా ఉంటే పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం సీన్ నది దగ్గర ప్రారంభ వేడుకలతో ప్రారంభం కానున్నాయి. ఇక ఉక్రెయిన్, గాజాలో యుద్ధాల నేపథ్యంలో ఒలింపిక్స్ క్రీడలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఫ్రాన్స్ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. మరోవైపు రష్యాతో ఫ్రాన్స్‌కు సరైన సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ పోలీసులు అప్రమత్తం అయ్యారు.
ఇది కూడా చదవండి: Kalki 2898 AD: ఆర్ఆర్ఆర్ రికార్డ్ దిశగా కల్కి పరుగులు