OLA Gig: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికిల్స్ యుగం నడుస్తోంది. తక్కువ మెయింటెనెన్స్, చవకైన ఆపరేటింగ్ ఖర్చులు, పర్యావరణానికి అనుకూలం కావడంతో ప్రజలు ఈవీ వెహికిల్స్ వైపు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ కొత్తగా ఓలా గిగ్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఓలా ప్రత్యేకంగా వర్కర్ల కోసం అంటే డెలివరీ బాయ్స్, రైడ్-షేరింగ్ డ్రైవర్లు వంటి వృత్తులకు అనువుగా రూపొందించారు. దీని ధర కేవలం రూ.39,999 మాత్రమే. మార్కెట్‌లో లభ్యమయ్యే అత్యంత…
ఈవీ రంగంలో ఓలా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఓలా స్కూటర్లు మార్కెట్ లో హల్ చల్ చేయగా ఇప్పుడు ఓలా బైకులు దుమ్మురేపనున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ తన తొలి రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేసింది. స్టైలిష్ లుక్, స్పోర్టీ ఫీల్‌తో వచ్చిన ఈ బైక్ వాహనదారులను అట్రాక్ట్ చేస్తోంది. బడ్జెట్ ధరలోనే లభించనుంది. ఈ నెలలోనే డెలివరీలు ప్రారంభంకానున్నాయి. ఓలా రోడ్‌స్టర్ X మూడు బ్యాటరీ ఆప్షన్స్ తో రిలీజ్ అయ్యింది. 2.5kWh…
Ola S1 E-Scooters: ఓలా ఎలక్ట్రిక్ నేడు (గురువారం) S1 శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లపై పరిమిత కాల హోలీ ఫ్లాష్ సేల్ ఆఫర్‌లను ప్రకటించింది. ఈ సేల్ లో భాగంగా.. వినియోగదారులు S1 Airపై రూ. 26,750 వరకు, అలాగే S1 X+ (Gen 2)పై రూ. 22,000 వరకు తగ్గింపులను పొందవచ్చు. దీంతో, ఇప్పుడు S1 Air రూ. 89,999, S1 X+ (Gen2) రూ. 82,999 లకే అందుబాటులో ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో…
ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఫిబ్రవరి 2025కి సంబంధించి అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ నెలలో కంపెనీ 25,000 యూనిట్లను విక్రయించింది. ఇది గత ఏడాది ఫిబ్రవరి కంటే 25.86% తక్కువ. ఫిబ్రవరి 2024లో కంపెనీ 33,722 యూనిట్లను అమ్మింది. అయితే, అమ్మకాలు తగ్గినప్పటికీ.. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికీ భారతదేశ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో 28% మార్కెట్ వాటాతో అతిపెద్ద కంపెనీగా కొనసాగుతోంది.
ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకంతో డబ్బులు ఆదా అవుతున్నాయి. తక్కువ ఖర్చుతోనే వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించే వీలుకలుగుతోంది. దీంతో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈవీ తయారీ సంస్థలు సూపర్ ఫీచర్లు, బడ్జెట్ ధరల్లో ఈవీలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఓలా, బజాజ్, టీవీఎస్, ఏథర్,ఫెర్రాటో కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అందుబాటులో ఉన్నాయి. Also Read:AP Crime: వీడు…
OLA Electric Bike: ఇండియన్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన ఓలా ఎలక్ట్రిక్.. ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో టాప్ పొజిషన్‌లో కొనసాగుతోంది. తమ వినూత్నమైన మోడళ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూ భారీగా అమ్మకాలు సాధిస్తున్న ఈ సంస్థ త్వరలోనే ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన విన్నప్పటి నుంచీ ఆటోమొబైల్ ప్రియులు, ఓలా ఫ్యాన్స్ అందరూ ఈ బైక్ ఎప్పుడు విడుదల అవుతుంది? దీని డిజైన్, ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయి? అంటూ సోషల్…
ఓలా ఎలక్ట్రిక్ తన తదుపరి జనరేషన్(మూడో జనరేషన్) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను జనవరి 31, 2025న విడుదల చేయనుంది. మూడో జనరేషన్ ప్లాట్‌ఫారమ్‌పై కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించబోతోంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టులో తీసుకురావాలని భావించిన కంపెనీ.. తన ప్రణాళికను మార్చుకుంది. ఈ కొత్త స్కూటర్‌లో అనేక ఫీచర్స్ పొందుపరిచినట్లు, పలు సవరణలు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇందులో 3 ప్లాట్‌ఫారమ్‌లో…
విశాఖలో వింత ఘటన చోటుచేసుకుంది.. రూ.లక్షా 20 వేలు రూపాయలు పెట్టి కొన్న ఓలా ఎలక్ట్రిక్ బైక్ తరచూ కంప్లైంట్స్ రావడంతో విసిగిపోయాడు ఓ కస్టమర్. ఇంట్లో ఆడవాళ్లు బైక్ తీసినపుడు నడిరోడ్డు మీద ఆగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదనతో ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంకు తాళం వేసి నిరసన తెలిపాడు ఓ కస్టమర్.
ఓలా భారతదేశంలో తన మొదటి B2B ఓరియెంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ గిగ్, గిగ్+ అనే రెండు వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. ఈ రెండు వేరియంట్ల ధర రూ.50 వేల లోపే. వీటి ధరలు రూ.39,999, రూ.49,999గా నిర్ణయించింది. ఈ ఈవీలను సరకుల రవాణా కోసం రూపొందించారు.
భారత మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ నుంచి గిగ్, ఎస్1 జెడ్ స్కూటర్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సాధారణ ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ బైకులను తయారు చేశారు. ఓలా కొత్త శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఓలా గిగ్, ఓలా గిగ్+, ఓలా ఎస్1 జెడ్, ఓలా ఎస్1 జెడ్+లను చేర్చింది.