OLA Electric Bike: కిల్లింగ్ లుక్స్‌తో కొత్త ఈవీ బైక్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైన ఓలా
- ఇండియన్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన ఓలా ఎలక్ట్రిక్.
- కొత్తగా ఈవీ బైక్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైన ఓలా.
- సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసిన ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్ .
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OLA Electric Bike: ఇండియన్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన ఓలా ఎలక్ట్రిక్.. ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో టాప్ పొజిషన్‌లో కొనసాగుతోంది. తమ వినూత్నమైన మోడళ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూ భారీగా అమ్మకాలు సాధిస్తున్న ఈ సంస్థ త్వరలోనే ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన విన్నప్పటి నుంచీ ఆటోమొబైల్ ప్రియులు, ఓలా ఫ్యాన్స్ అందరూ ఈ బైక్ ఎప్పుడు విడుదల అవుతుంది? దీని డిజైన్, ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయి? అంటూ సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆసక్తిని మరింత పెంచుతూ ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఈ బైక్ ఫస్ట్ లుక్ ఫోటోలను విడుదల చేసింది.
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
తాజాగా ఓలా ఎలక్ట్రిక్ సంస్థ సీఈఓ భవీష్ అగర్వాల్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ బైక్ ఫోటోలను పంచుకున్నారు. ఫోటోల్లో పసుపు (Yellow) రంగులో ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ బైక్ కనిపిస్తోంది. హ్యాండిల్ బార్స్ కింద విల్లు ఆకారం (arrow shaped) ప్యానెల్స్ ఉండటం విశేషం. ఇది బైక్‌కు డైనమిక్ లుక్‌ను ఇస్తోంది. అయితే బైక్‌పై ఓలా ఎలక్ట్రిక్ లోగో లేకపోవడం గమనార్హం. దీని వల్ల బైక్ డిజైన్ ఇంకా పూర్తి కాలేదని అర్థం అవుతోంది. ఈ పోస్ట్ పై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు.
Going to ride this soon! Arrowhead @OlaElectric pic.twitter.com/mXPmXo4GWD
— Bhavish Aggarwal (@bhash) January 28, 2025
ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉండగా తయారీ కేంద్రం తమిళనాడులోని హూసూర్‌లో ఉన్న విష్యం తెలిసిందే. ఇక్కడే ఇప్పటివరకు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉత్పత్తి అవుతుండాగా ఇప్పుడు అదే ఫ్యాక్టరీలోనే ఎలక్ట్రిక్ బైక్ ప్రొడక్షన్ మొదలు పెట్టేందుకు ఓలా రంగం సిద్ధం చేసింది. స్కూటర్ విభాగంలో మంచి జోరు చూపించిన ఈ సంస్థ, ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోనూ తనదైన ప్రభావాన్ని చూపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బైక్ ఫోటోలు రిలీజ్ చేసినప్పటికీ, అధికారిక లాంచ్ డేట్‌ను మాత్రం ఓలా ఇంకా ప్రకటించలేదు. అయితే, లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఈ బైక్ 2025 రెండో భాగంలో విడుదలయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!