Minister Seethakka : ములుగు జిల్లా మంజీరా ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క రైతులకు ఆయిల్ ఫార్మ్ పంట ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఆయిల్ ఫార్మ్ సాగుతో రైతులు మంచి లాభాలు పొందవచ్చు. 10 ఎకరాల భూమి ఉన్న రైతులు కనీసం ఐదు ఎకరాలలో ఈ పంటను సాగు చేయాలి. ఈ పంటకు ఉన్న గ్యారంటీ మరే పంటకు లేదు” అని తెలిపారు. రైతుల భారం తగ్గించేందుకు సబ్సిడీతో ఒక్కో మొక్కను రూ.25కే…
దేశంలో ఏటా 22 మిలియన్ టన్నుల నూనెలు అవసరం.. ఇందులో ఎక్కువమొత్తం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సాహానికి జిల్లాల వారీగా జోన్లను విభజించి కంపెనీలకు అప్పజెప్పామని ఆయన చెప్పారు.
రైతుబంధు ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్.. రైతు భీమాతో రైతు కుటుంబాలను ఆదుకుంటున్నది కేసీఆర్ అని ఆయన పేర్కొన్నారు. పాలమూరు అంటే నాడు మైగ్రేషన్ నేడు ఇరిగేషన్.. పాలమూరు రంగారెడ్డితో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం అవుతాయని ఆయన అన్నారు. భవిష్యత్ లో పాలమూరు రైతులు అద్భుతాలు సృష్టిస్తారు అని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.