తెలంగాణ సర్కార్‌లో బ్లాక్‌షీప్ ఎవరో తెలిసిందా? కేబినెట్ రహస్యాలు.. ముఖ్యమైన నిర్ణయాలు ముందే ప్రతిపక్షాలకు ఎలా లీక్ అవుతున్నాయో క్లారిటీ వచ్చిందా? సదరు లీకు వీరులు కేబినెట్ మంత్రులా? లేక అత్యున్నత అధికారులా? రహస్య సమాచారాన్ని వాళ్ళు ఎక్కడికి పంపుతున్నారో కూడా సర్కార్ పెద్దలకు క్లారిటీ వచ్చేసినట్టేనా? Also Read:Agibot A2 Robot: 106 కి.మీ నాన్‌స్టాప్‌గా నడిచి.. హ్యూమనాయిడ్ రోబో నయా రికార్డ్ తెలంగాణ కేబినెట్‌లో చర్చల సారాంశం అధికారికంగా వెల్లడించడానికంటే ముందే కొందరు ప్రతిపక్ష…
ఎవ్వరినీ వదలం.. ఎక్కడున్నా.. కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోండి అని సూచించారు వైఎస్ జగన్.. ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం.. అది మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చారు..
ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన అలా….అలా…. కట్టు తప్పుతోందా? అధికారులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా? అసలు……. స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలకే దిక్కు లేకుండా పోతోందా? మీ ఆఫీసర్స్‌కి కాస్త చెప్పండంటూ…. ఏకంగా పక్క రాష్ట్ర మంత్రి సీఎంకు లేఖ రాయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఏపీ సర్కార్‌లో అసలేం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా తొమ్మిది నెలలవుతోంది. ఈ కాలంలో రకరకాల వివాదాలు, అంతకు మించిన ట్విస్ట్‌లు చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా…
Blood For Pregnant: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో గడచిన మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భామ్రగఢ్ తహసీల్‌లో పరిస్థితి ఘోరంగా తయారైంది. వర్షాల వల్ల అనేక రోడ్లు మూసుకుపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతంతో సంబంధాలు తెగిపోయాయి. అయితే అక్కడ ఓ గర్భిణీ స్త్రీ పరిస్థితి విషమంగా మారింది. ఆమెకు అత్యవరంగా రక్తం అవసరం పడింది. దాంతో అధికారులు మహిళ ప్రాణాలను కాపాడేందుకు హెలికాప్టర్‌లో రక్తాన్ని అందించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Arekapudi…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు ప్రాజెక్ట్ గండి పడడంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం.. ఆయకట్ట రైతులను పరామర్శించి నీట మునిగిన ఇళ్ళను సందర్శించారు. కొత్తూరు గ్రామానికి చెందిన మురళి అనే వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి చెందిగా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా.. గుమ్మడవల్లి ప్రభుత్వ కాలేజీలో అధికారులతో సమీక్షలో అన్ని శాఖల అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లాస్ పీకారు. ఇరిగేషన్ అధికారులతో ఆయన మాట్లాడుతూ.. అసలు…
వైసీపీ హయాంలో కేంద్రం నుంచి ఏపీకి డిప్యూటేషన్ మీద వచ్చిన అధికారులకు కేంద్రం ఝలక్ ఇస్తుంది. ఏపీ ప్రభుత్వ ఆమోదం లేకుండా మాతృ శాఖల్లో చేరడానికి వచ్చే అధికారులకు నో ఎంట్రీ బోర్డు పెడుతుంది. కేంద్ర సర్వీసుల నుంచి డెప్యూటేషన్ మీద వచ్చిన అధికారులను రిలీవ్ చేయొద్దని గతంలోనే సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.
Rythu Runa Mafi: ఆగస్టు 15వ తేదీలోపు రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలుకు రేవంత్ సర్కార్ విధివిధానాలపై కసరత్తు కొనసాగిస్తుంది. అర్హులైన వారికే రుణమాఫీ వర్తింపజేసేందుకు అధికారులు వివిధ ప్రతిపాదనలను అందిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని రైసెన్‌లో నరమాంస భక్షక రాయల్ అర్బన్ టైగర్ ఎట్టకేలకు అటవీశాఖ అధికారులకు చిక్కింది. అయితే పులిని పట్టుకోవడం కోసం అధికారులు ఎంతో శ్రమించారు. అందుకోసం.. మూడు పులుల సంరక్షణ కేంద్రాల బృందాలు 11 రోజులుగా రెస్క్యూ పనిలో నిమగ్నమయ్యాయి. అంతేకాకుండా.. పులిని పట్టుకునేందుకు 5 ఏనుగులతో పాటు 150 మంది సైనికులు రంగంలోకి దిగారు. ఈ పులి ఒక వ్యక్తిని చంపడంతో 36 గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మొత్తానికి.. రైసెన్‌లో రాయల్ అర్బన్ టైగర్‌ను…
ఏపీకి డెప్యుటేషన్ పై వచ్చిన అధికారుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెప్యూటేషనుపై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో డెప్యుటేషన్ పై వచ్చిన అధికారులపై కీలక ఆదేశాలు ఇచ్చింది. కాగా.. తమను రిలీవ్ చేయాలంటూ డెప్యుటేషన్ పై వచ్చిన పలువురు అధికారులు దరఖాస్తులు చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఇదివరకే పూర్తయ్యాయి. మార్చి 1 నుండి 20 వరకు జరిగిన ఈ పరీక్షలకు వోకేషనల్ కోర్స్ తో కలిపి 10,52,673 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 52,900 విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వలేదు. 75 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో మాల్ ప్రాక్టీస్ కు ప్రయత్నించారు. వీటికి సంబంధించి వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇంటర్మీడియట్ సంబంధించిన ఇంటర్ సమాధాన పత్రాలు మూల్యాంకనం కూడా మొదలైంది.…