ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు.. అయితే, ఇది కక్షపూరితమని ప్రతిపక్ష టీడీపీ మండిపడుతుంటూ.. ఆధారాలున్నాయి కాబట్టే కేసులు పెడుతున్నాం, అరెస్ట్‌లు చేస్తున్నామని చెబుతోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. బాదుడే బాదుడు పేరు నిర్వహిస్తోన్న కార్యక్రమంలో భాగంగా ఇవాళ కుప్పంలో పర్యటిస్తున్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామన్నారు..…
ఉపాధి కూలీలు రోడ్డెక్కారు. పనులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. ఎంత కష్టపడిన రోజుకూలీకి మాత్రం సరైన ధర ఇవ్వడంలేంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆరుగాళం కష్టపడిన పై యజమానులిచ్చే కూలీ సరిపోవడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోజంతా కష్టపడితే వారికి వచ్చే రూ.30 మాత్రమేనా అంటూ ప్రశ్నించారు. కనీస ధర కూడా ఇవ్వకుండా మా శ్రమను యజమాను దోచుకుంటున్నారని మండి పడ్డారు. ఈఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. భూపాలపల్లి జిల్లా లోని గణపురం మండల కేంద్రంలోని…
ఉపాధి హమీ పథకం నిధులను పక్కదారి పట్టించారు..కొన్ని చోట్ల రాజకీయ నాయకులు,అధికారులు కలిసి కొంతమెక్కేస్తే మరికొన్నిచోట్ల ఈజీఎస్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి నిధులను మింగేసారు. చనిపోయిన వాళ్లు పనిచేసినట్టు రికార్డ్ చేసారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన అవినీతి ఎంత? ఇందులో ఎవరి పాత్ర ఎంత? రాజకీయ రచ్చకు దారితీస్తున్న ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆదిలాబాద్ జిల్లా జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం నిధులను దిగమింగుతున్నారు. కొన్నిచోట్ల చేయని పనులకు బిల్లులు లేపేస్తే…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయం (సీఎంవో)లో అధికారులకు శాఖలు కేటాయించారు.. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు స్పెషల్ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి… ఇక, సీఎంవోలో అధికారులకు కేటాయించిన శాఖల విషయానికి వస్తే.. స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డికి జీఏడీ, హోం, రెవెన్యూ, అటవీ, పర్యావరణ, వైద్య ఆరోగ్య, శాసనసభ వ్యవహారాలు, పరిశ్రమ, పెట్టుబడులు, మౌలిక వసతులు, కేంద్ర ప్రభుత్వ అంశాలు, సీఎంవో ఎస్టాబ్లిష్ మెంట్ అండ్ రెసిడ్యువల్ – సబ్జెక్టులు కేటాయించగా..…
కేంద్రం ప్రభుత్వం జాతీయ నిధుల నుండి nrgs నిధులు మంజూరు చేసిందని రఘునందన్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలో మాత్రం కేవలం టీఆర్‌ఎస్ సర్పంచ్‌లకే ఇచ్చారన్నారు. రూ. 53 కోట్ల నిధులు వస్తే మాకు కేవలం 3 కోట్ల నిధులు మంజూరు చేశారని మండిపడ్డారు. Nrgs నిధులు మాకు అన్యాయం జరిగింది.మా నియోజకవర్గ కు ఎన్ని నిధులు రావాలో అవి రావాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. రెండు మూడు నెలలు…
ఐఏఎస్ అధికారులకు మూడేళ్లకోసారి బదిలీలు జరుగుతాయి. ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని ట్రాన్స్‌ఫర్లు ఉంటాయి. తెలంగాణలో కొందరు IASలు మాత్రం ఏళ్ల తరబడి తాము పనిచేస్తున్నచోట కుర్చీలకు అతుక్కుపోయారు. అక్కడి నుంచి కదిలితే ఒట్టు. అధికార వర్గాల్లో ప్రస్తుతం వారి గురించి ఆసక్తికర చర్చ జరుగుతోందట. ఒకే పోస్టులో మూడేళ్లకంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న కొందరు ఐఏఎస్‌లు..! తెలంగాణ కేడర్‌లో దాదాపు 150 మంది IASలు పనిచేస్తున్నారు. వీరిలో కొందరు కేంద్ర సర్వీసుల్లో ఉంటే.. మరికొందరు రాష్ట్రంలోనే వివిధ…