Off The Record: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా జడలు విప్పింది. నలుగురైదుగురు కూటమి నేతలు ముఠాలుగా ఏర్పడి…. కొండల్ని పిండిచేసి మింగేస్తున్నారట. మరీ ముఖ్యంగా ఇక్కడ జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అండదండలతో అనుచరులు బరితెగించేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన నియోజకవర్గంలో అక్రమాలకు తావులేదని బత్తుల చేస్తున్న హెచ్చరికలు ఉత్తుత్తి చప్పుళ్ళేనని, తెర వెనక వాస్తవాలు మాత్రం వేరేలా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. తన ఇమేజ్ డ్యామేజ్ అవకుండా బలరామకృష్ణ స్టేట్మెంట్స్…
Off The Record: అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నది సామెత. ఇప్పుడు ఏపీ లిక్కర్ ఎపిసోడ్లో జరుగుతున్న పరిణామాల్ని చూస్తున్న వాళ్ళంతా… ఈ సామెతను గుర్తు చేసుకుంటున్నారట. ఎవరు దొంగలు, ఎవరు దొరలు…. అసలు ఎవరిది పాతివ్రత్యం అంటూ…పొలిటికల్ సర్కిల్స్‌తో పాటు సామాన్య జనంలో కూడా చర్చలు మొదలయ్యాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భారీ ఎత్తున మద్యం కుంభకోణం చేసిందని ఆరోపిస్తున్న కూటమి పార్టీలు… అధికారంలోకి వచ్చాక దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేశాయి. ఈ…
Off The Record: ఒక్క రీ ట్వీట్… ఒకే ఒక్క రీ ట్వీట్…. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తోందట. దాని వాస్తవ సారాంశం, అలా మెసేజ్ పెట్టడం వెనక ఆయన ఉద్దేశ్యం ఏదైనా కావచ్చు. అది మంచా చెడా అన్నదాంతో… అస్సలు సంబంధమే లేదు. కానీ… పవన్ రాజకీయ ప్రత్యర్థులకు మాత్రం ఆ ట్వీట్ కాస్త డిఫరెంట్‌గా అర్ధమైందట. హవ్వ… డిప్యూటీ సీఎం అయి ఉండి అంత మాట అంటారా? అవే…
Off The Record: ఇక మాటల్లేవ్…. మాట్లాడుకోవడాల్లేవ్…. ఓన్లీ యాక్షన్… అంటూ టీడీపీ పెద్దలు క్లాప్ కొట్టేశారా? ఓపిగ్గా వెయిట్ చేసి…. టైం చూసి…. పెదరాయుడిని కొట్టాల్సిన చోట గట్టిగానే కొట్టేశారా? ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అని చెప్పకనే చెప్పేశారా? ఎవరా పెదరాయుడు? ఆయన మీద తీసుకున్న యాక్షన్ ఏంటి? కర్మ రిటర్న్స్ అన్న సిద్ధాంతం సినీ నటుడు మోహన్‌బాబుకు అతికినట్టు సరిపోతుందన్న అభిప్రాయం బలపడుతోంది వివిధ వర్గాల్లో. బాబూ… మోహన్…
Off The Record: ఏపీ బీజేపీలో ఏ స్వరాలూ… వినిపించడం లేదు ఎందుకు? పార్టీలో పూర్తిస్థాయి స్తబ్దత పెరిగిపోవడానికి కారణాలేంటి? చివరికి అధికార ప్రతినిధులు కూడా అధికారికంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? వాళ్ళ గొంతులకు అడ్డుపడుతున్నదేంటి? ఎంత అధికార కూటమిలో భాగస్వామి అయినా… కనీసమైన రాజకీయ స్పందనలు కరవవడానికి కారణాలేంటి? ఏపీ బీజేపీలో ఎవ్వరూ సౌండ్ చేయడం లేదు. పార్టీ అధికార ప్రతినిధులైతే… అసలే మాట్లాడ్డం లేదు. స్పందించాల్సిన, నోరు తెరవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. కానీ…అంతా చూద్దాం……
Off The Record: వైసీపీలో వార్నింగ్ బెల్ మోగిందా? డైరెక్ట్‌గా ముఖ్య నాయకుల్ని ముందు పెట్టుకుని మరీ.. అధ్యక్షుడు జగన్ రెడ్ బజర్ నొక్కారా? పార్టీ కార్యక్రమాల విషయంలో సీరియస్గాలేని మమ బ్యాచ్ ఇక ఇంటికేనంటూ డైరెక్ట్‌గానే చెప్పేశారా? నేను గేర్ మార్చేశా.. మీరు స్పీడ్ అందుకోకుంటే.. కష్టమని ఏ సందర్భంలో చెప్పారు జగన్? ప్రస్తుతం ఆయన ప్లానింగ్ ఎలా ఉంది? వైసీపీ… తాడేపల్లి సెంట్రల్ ఆఫీస్‌లో ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో పలు ఆసక్తికర పరిణామాలు…
Off The Record: తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెడ్బుక్కే హాట్ టాపిక్. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక కూడా చాలా రోజులు చర్చంతా దాని చుట్టూనే తిరిగింది. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమసు చేస్తున్నారని, దాని ప్రకారం తమ కేడర్ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ పెద్దలు. అందుకు కౌంటర్‌గా…. కార్యకర్తల కోసం డిజిటల్ బుక్‌ని లాంఛ్ చేసింది వైసీపీ అధిష్టానం. వాళ్ళు ఎలాంటి ఆపదలో ఉన్నా,…
Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చింది. ఈ నెల 13న నోటిఫికేషన్ వెలువడుతుంది. కానీ… బీజేపీ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు. అసలా విషయంలో ఒక క్లారిటీ ఉందో లేదో కూడా బయటికి తెలియడం లేదు. అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురు నాయకులతో కమిటీ వేసి అభిప్రాయ సేకరణ కూడా చేసింది పార్టీ రాష్ట్ర నాయకత్వం. ఈ క్రమంలో… త్వరలోనే ముగ్గురు పేర్లతో రాష్ర్ట ఎన్నికల కమిటీ కేంద్ర పార్టీకి లిస్ట్ పంపబోతోందట.…
Off The Record: హుజూర్నగర్ బీజేపీలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. నేతల మౌనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట ద్వితీయశ్రేణి నాయకులు. మరీ ముఖ్యంగా నల్లగొండ పార్లమెంట్ అభ్యర్ధిగా బరిలోకి దిగి ఓడిపోయిన… హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి పట్టీ పట్టనట్టుగా ఉండటం చూసి ఏం చేయాలో పాలుపోవడం లేదట కేడర్‌కు. 2019లో హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు సైదిరెడ్డి.. 2023 లోకూడా బీఆర్ఎస్ నుండి హుజూర్ నగర్ అభ్యర్దిగా బరిలోకి…