దశాబ్దాల తరబడి నెత్తిన పెట్టుకుని మోసినా, ఇప్పుడు ఫుల్ ఫ్యామిలీ ప్యాకేజ్ ఇచ్చినా… ఆ టీడీపీ సీనియర్ నేత సంతృప్తిగా లేరు ఎందుకు? జీవిత కాలం పదవులు అనుభవించినా… ఆయనకు ఆ ఒక్క కోరిక మాత్రం మిగిలిపోయే ఉందా? అది తీరితే తప్ప ఆయనకు మనశ్శాంతి ఉండదా? ఎవరా సీనియర్ లీడర్? ఏంటాయన కోరిక? దాన్ని తీర్చాలన్న ఉద్దేశ్యం అస్సలు టీడీపీ అధిష్టానానికి ఉందా?. టీడీపీ ఆవిర్భావం నుంచి మెడలో పసుపు కండువా తప్ప మరోటి తెలియని…
Off The Record: తర్క వితర్కాలు, పెద్ద పెద్ద చర్చోపచర్చలతో నిమిత్తం లేకుండానే…. ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో పాటు వివిధ వర్గాల్లో ఒక స్థిరమైన అభిప్రాయమైతే ఉంది. అదే… వైసీపీలో కమ్మ కులానికి అంత ప్రాధాన్యం ఉండదని. అలాగే ఆ సామాజికవర్గంలో ఎక్కువ మంది అదే విషయాన్ని నమ్ముతారు కూడా. వాళ్ళతో మాకెలాంటి విభేదాలు లేవని వైసీపీ అధిష్టానం ఒకటికి పదిసార్లు చెప్పినా… అనుమానాలు మాత్రం తొలిగిపోలేదన్నది నిష్టుర సత్యం. అలా ఖచ్చితంగా ఆ సామాజికవర్గానికి, పార్టీకి…
Off The Record: వైసీపీలో గ్రూప్ పాలిటిక్స్‌కు అడ్డాగా మారిపోయింది జీడీనెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెత… మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి రివర్స్‌లో ఉంటోందట. గడిచిన ఐదేళ్ళ నుంచి ఆయనకు మొత్తం అపసవ్య దిశలోనే తిరుగుతోందంటున్నారు. ఎమ్మెల్యేగా మూడు సార్లు పనిచేసినప్పుడు ఎటువంటి తలనొప్పులు పడని నారాయణ స్వామి….తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి… ఇంకా చెప్పాలాంటే డిప్యూటీ సిఎం అయినప్పటి నుంచి రాష్ట్రం సంగతి తర్వాత…. సొంత నియోజకవర్గంలోనే ఐ…
Off The Record: రాజకీయాల్లో ఢీ అంటే ఢీ అని తలపడటం ఒక ఎత్తయితే…. ఎక్కువ మంది మాత్రం వ్యూహాత్మక ఎత్తుగడల్ని ఫాలో అవుతుంటారు. అందులో కూడా కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే సెక్షన్ కూడా ఒకటుంటుంది. వాళ్ళు మనవాళ్ళో పగవాళ్ళో తెలిసే లోపే… జరక్కూడని నష్టం జరిగిపోతుంది. కుదిరితే కుట్రలతో ప్రజాక్షేత్రంలో ఓడిస్తారు లేదంటే వెన్నుపోటు పొడిచి దెబ్బ తీస్తారు. ప్రస్తుతం ఇలాంటి రాజకీయాలకు కేరాఫ్‌గా మారుతోంది అనంతపురం జిల్లా. మరీ ముఖ్యంగా వైసీపీలో ఈ…
మేకప్‌కు ప్యాకప్ చెప్పి….ప్రజాసేవకే క్లాప్ కొడతానన్న ఆర్కే రోజా….మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. మొన్నటి వరకు బుల్లితెరకే రీఎంట్రీ ఇచ్చిన రోజా…ఇప్పుడు ఏకంగా వెండితెరపై మళ్లీ మెరుస్తున్నారు. 12 ఏళ్ల గ్యాప్ తర్వాత రోజా సినిమా సీక్వెల్ దేనికి సంకేతం? ఇక పాలిటిక్స్ కన్నా మూవీలే బెటరని ఆమె అనుకుంటున్నారా? క్యాడర్లో కన్ప్యూజన్ క్రియేట్ చేస్తున్నారా? తెలుగు రాజకీయాల్లో ఆర్కో రోజా అంటే ఫైర్..ఫైర్ అంటే రోజా. ప్రత్యర్థులపై ఆమె చేసే విమర్శలు అంత ఘాటుగా ఉంటాయి. ఏ…
బతికున్నప్పుడు వేధింపులు…మరణం తర్వాతా సాధింపులా? ఓ టీడీపీ ఎమ్మెల్యే తీరుపై ఆ నియోజకవర్గంలో ఇలాంటి చర్చే జరుగుతోంది. అసలు ఆయన మరణానికీ ఎమ్మెల్యే మెంటల్ టార్చరే కారణమన్న కోపాలు కట్టలు తెంచుకుంటున్నాయి. ఏకంగా మంత్రి లోకేష్ రంగంలోకి దిగినా….సయోధ్య కుదరలేదు. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎందుకంత ఆగ్రహం….అసహనం? నెల్లూరు రాజకీయాల కథే వేరు. చలికాలంలోనూ చెమటలు పట్టించేలా ఉంటాయి. ఇక్కడి నేతలు ప్రతిపక్ష నేతలతో పాటు.. సొంత పార్టీలో ఉండే నేతల ఎత్తులకు కూడా పైఎత్తులు వేస్తూ…
Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో ఏ నియోజకవర్గమైనా సరే కనీసం వారంరోజులైనా ప్రశాంతంగా ఉంటుందేమో కానీ..తాడిపత్రి నియోజకవర్గంలో మాత్రం అలాంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదు. దీనికి కారణం ఇక్కడ నేతల మధ్య జరుగుతున్న అధిపత్య పోరు. ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా.. వారు మాత్రం నిత్యం ఏదో ఒక ఇష్యూ రగిలిస్తూనే వుంటారు. 2019 ఎన్నికల ఎన్నికల్లో పెద్దారెడ్డి గెలిచిన తర్వాత జేసీ కుటుంబం చాలా ఇబ్బందులు పడింది. జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది.…
Off The Record: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో కూటమి పార్టీల కుమ్ములాటలు పతాకస్థాయికి చేరాయి. పొత్తు కింద నెల్లిమర్ల నియోజకవర్గం జనసేనకు కేటాయించినప్పటి నుంచి టీడీపీ స్థానిక నాయకుల్లో అసంతృప్తి అంతకంతకూ కొనసాగుతోందన్నది బహిరంగ రహస్యం. తొలి నుంచి ఈ నియోజకవర్గం టీడీపీ కంచుకోట. కానీ పట్టు లేని జనసేనకు కేటాయించడంపై నువ్వా నేనా అన్న తరహాలో వార్ సాగుతోంది. అధిష్టానం నుంచి అక్షింతలు పడుతున్నా వీరి తీరు మారలేదు. మళ్లీ వరద బాధితులకు నిత్యావసర…
Off The Record: ఈయన మేకపాటి రాజమోహన్ రెడ్డి. వైసీపీ మాజీ ఎంపీ. సీనియర్ మోస్ట్ నాయకుడు. మాజీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తండ్రి. కొడుకు జయంతి సభలో రాజమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జగన్ సీఎంగా ఉండగా వైసీపీలో ఓ బ్యాచ్ ఎప్పుడూ ఆయన్ను విపరీతంగా పొగిడేస్తూ ఉండే వారు. జగన్ ఎవర్నైతే ప్రత్యర్ధి అనుకుంటారో ఈ బ్యాచ్ నేతలు టార్గెట్ చేసుకుని నోటికొచ్చింది మాట్లాడేవారు. ఈ బ్యాచ్ లో మంత్రులు, ఎమ్మెల్యేలూ,…