అసలే గోరుచుట్టు… ఆపై రోకటి పోటు అన్నట్టుగా మారింది అక్కడ అధికార పార్టీ వ్యవహారం. ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో కాంగ్రెస్ పరువు బజారుకెక్కింది.డీసీసీ అధ్యక్ష ఎన్నికలో ఢీ అంటే ఢీ అంటున్నారు. చివరికి సీఎం రేవంత్‌రెడ్డి ఓకే చెప్పిన నాయకుడు కూడా… నాకేది గ్యారంటీ అని ఎందుకు మొత్తుకోవాల్సి వచ్చింది? సమన్వయ పరచాల్సిన మంత్రుల మధ్యనే సమన్వయం లేదా? ఎక్కడుందా పరిస్థితి? కరీంనగర్ జిల్లా కాంగ్రెస్‌లో సంస్థాగత ఎన్నికలు చిచ్చు రేపాయి. జిల్లా అధ్యక్ష పదవికి,…
Off The Record: తెలంగాణ రాజకీయం మొత్తం… ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతోంది. అధికార, ప్రతిపక్షాలకు ఇది చావో రేవో అన్నట్టుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా…సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్, అధికార బలం చూపించాలని కాంగ్రెస్ తహతహలాడుతున్నాయి. బీఆర్ఎస్ అయితే… సిట్టింగ్ సీట్ అనేకాకుండా… ఈ ఉప ఎన్నికలో గెలిస్తే… తిరిగి తమ బలం పెరిగిందన్న సంకేతాలు పంపడంతో పాటు వలసలు, కేడర్‌లో మనోధైర్యం నింపడం లాంటి చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని భావిస్తోందట.…
Off The Record : కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ టీ కప్పులో తుఫాన్‌లా ముగిసిపోయినట్టేనంటున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిలిచి మాట్లాడాక ఎపిసోడ్ మొత్తం సెట్ అయినట్టు చెప్పుకుంటున్నారు. ఆ విషయంలో సురేఖ… మురళి చేసిన లొల్లి కంటే….. వాళ్ళ కూతురు సుస్మిత చేసిన గొడవే పెద్ద రచ్చకు దారి తీసింది. పైగా ఇది బీసీ వర్సెస్ రెడ్లు టర్న్ అవుతోందన్న సంకేతాలు…
Off The Record: 2024 ఎన్నికల్లో తగిలిన ఘోరమైన దెబ్బ నుంచి వైసీపీ దాదాపుగా కోలుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రకరకాల కార్యక్రమాలతో ప్రజల్లో ఉండేందుకు ప్లాన్ చేస్తోంది పార్టీ అధిష్టానం. నియోజకవర్గాల్లో నాయకులు కూడా అందుకు తగ్గట్టే గేరప్ అవుతున్నారు. ఈ క్రమంలోనే… రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదపుర్తి ప్రకాష్‌రెడ్డి కూడా అన్ని కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. రామగిరి ఎంపీపీ ఎన్నిక, హంద్రీనీవా కాల్వకు లైనింగ్ వంటి అంశాలతో జనంలోకి బాగానే వెళ్లారాయన. అలాగే… తన రాజకీయ…
Off The Record: ఉమ్మడి విశాఖ జిల్లాలో అత్యంత ప్రాధాన్యత ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో ఒకటి యలమంచిలి. ఇక్కడ కాపు, బీసీ సామాజిక వర్గాలు ఎక్కువ. గతంలో లేకున్నా… ఓట్ బ్యాంక్ ఆధారంగా ఇక్కడ పోటీ చేసేందుకు కాపు నేతలు ఆరాటపడటం దశాబ్ద కాలంగా కనిపిస్తోంది. జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సహా ఎక్కువ సార్లు గెలిచింది ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. దీంతో ఇక్కడ అన్ని రాజకీయ పార్టీల వ్యూహాలు కాపుల…
Off The Record: పార్టీ ఏదైనా, అధికారం ఎవరిదైనా… ఏపీలో ఇప్పుడు కేసులు, కోర్ట్లు కామన్ అయిపోయాయి. ఈసారి కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చాక కూడా…ఇదే తంతు కొనసాగుతోంది. రకరకాల కేసుల్లో ప్రతిపక్ష నేతలు అరెస్ట్ అవుతున్నారు, వాళ్ళకు బెయిల్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇంకొందరు అరెస్ట్, వాళ్ళకు కూడా బెయిల్స్…. ఇలా అసలు మాట్లాడుకోవాల్సిన విషయాలు మరుగునపడిపోయి.. ఈ కొసరు విషయాల చుట్టూనే జనంలో కూడా చర్చ జరుగుతున్నట్టు కాస్త ఆలస్యంగా గుర్తించిందట టీడీపీ అధిష్టానం. అందుకే…
Off The Record: ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌ను ఓ కుదుపు కుదిపేస్తున్న నకిలీ మద్యం ఎపిసోడ్ ఇప్పుడు కూటమిలో కూడా కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. దాని గురించి ఆ స్థాయి రచ్చ అవుతున్నా… వైసీపీ ఒంటికాలి మీద లేస్తూ టార్గెట్ చేస్తున్నా… జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు తెరవడం లేదన్న డౌట్స్ వస్తున్నాయట కూటమి సర్కిల్స్‌లో. అంటే నకిలీ మద్యం వ్యవహారాన్ని కేవలం టీడీపీ సమస్యగానే డిప్యూటీ సీఎం చూస్తున్నారా?…
Off The Record: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను జీరో చేసేశామని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో నియోజకవర్గంలో రోజూ ఘర్షణ జరుగుతున్న కారణంగానే… అలా చేయాల్సి వచ్చిందని కామెంట్ చేశారు కాకినాడ జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణ. నాలుగు నెలల నుంచి వర్మ ఇస్తున్న స్టేట్మెంట్స్ వల్లే ఆ పరిస్థితి వచ్చిందని, ఇదంతా ఆయన స్వయంకృతమేనని క్లారిటీ ఇచ్చారు మంత్రి. తనని జీరో చేసినట్లు వర్మకు తెలుసునని, ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు పిఠాపురంలోవివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదుకదా…
క్రమశిక్షణకు కేరాఫ్ అని ఢంకా బజాయించే బీజేపీలో ఆ పరిస్థితులు మారిపోతున్నాయా? కీచులాటలకు కేరాఫ్ అవుతోందా? ఎక్కడికక్కడ జిల్లాల్లో లొల్లి పెరిగిపోతోందా? తాజాగా జరుగుతున్న పరిణామాలు ఏం చెబుతున్నాయి? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ బీజేపీలో పరిస్థితులు మారిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు, బలం, జనంలోకి వెళ్లే సంగతులు ఎలాఉన్నా… క్రమశిక్షణ విషయంలో మాత్రం కట్టు తప్పలేదన్న అభిప్రాయం ఉండేది. కానీ… తాజాగా జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆ పరిస్థితుల్ని మార్చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. వికారాబాద్…
తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద సరికొత్త సీన్స్‌ని చూడబోతున్నామా? ఇప్పుడిప్పుడే ఒక డిఫరెంట్, ఇప్పటి వరకు అసలు ఊహకు కూడా అందని వాతావరణం నెలకొంటోందా? ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు నాయకులు ప్రస్తుతం బీజేపీ రాడార్ పరిధిలో ఉన్నారా?