జీహెచ్ఎంసీ మేయర్ మీద అవిశ్వాసం పెట్టాలన్న ఊపులోనే బీఆర్ఎస్ ఉందా? నాలుగేళ్ళ గడువు ముగిసింది గనుక ఇక పావులు కదుపుతుందా? ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే బీఆర్ఎస్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? రాజకీయ ప్రత్యర్థుల సహకారం లేకుండా సాధ్యమవుతుందా? బీఆర్ఎస్కు బీజేపీ మద్దతిస్తుందా? అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నికల్‌గా అవిశ్వాసం సాధ్యమేనా? గ్రేటర్ హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ మీద అవిశ్వాస తీర్మాన చర్చ నెల రోజుల నుంచి జోరుగా జరుగుతోంది. బీఆర్ఎస్ తరపున మేయర్ పదవి…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారా? ఆయన ఏదో చేయబోతే… అది ఇంకేదో అయిపోయి ఇరుకున పడేసిందా? కాంగ్రెస్ పార్టీకి అడ్డంగా బుక్కయిపోయారా? ఆ పార్టీ శ్రేణులు ఇప్పుడాయన్ని సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకుంటున్నాయా? ఇంతకీ… ఏ విషయంలో ఇరుక్కుపోయారు కేటీఆర్? కాంగ్రెస్ పార్టీ ఎలా సోషల్ రివెంజ్ తీసుకుంటోంది? ఈ రైతు ఆవేదన వీడియోని ఎక్స్‌లో పోస్ట్ చేసిన కేటీఆర్… రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడమంటూ జనం మీదికి వదిలారు.…
ఆ ఎమ్మెల్యే ఏ ముహూర్తాన కాంగ్రెస్ పార్టీలో చేరారో గానీ ఎప్పుడూ వివాదాలేనట. పైగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలంటూ ఫిర్యాదులు. వరుస వివాదాలు వెంటాడుతున్నా ఆయన మాత్రం ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారా..? ఏకంగా పార్టీనే ధిక్కరించే స్థాయికి మేటర్ వెళ్తోందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్రెడీ పార్టీ అభ్యర్థి బరిలో ఉండగా… ఎమ్మెల్యే అనుచరుడు బరిలో దిగడాన్ని ఎలా చూడాలి? అతనికి ఎవరి ఆశీస్సులున్నాయి? ఎవరా ఎమ్మెల్యే? ఆయన వ్యూహం ఏంటి? సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే…
ఆ మాజీ మంత్రి తన ప్రాపకం కోసం సొంత పార్టీ టీడీపీని ఇరుకున పెడుతున్నారా? ఉనికి చాటుకునేందుకు ఆయన చేస్తున్న విన్యాసాలతో కేడర్ కంగారు పడుతోందా? పార్టీకంటే సొంత ప్రయోజనాలే ముఖ్యమని ఆ సీనియర్ అనుకుంటున్నారా? ఏదో ఒకటి కెలికేసి… తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో పార్టీని డ్యామేజ్ చేస్తున్నారా? తెర వెనక రాజకీయాలు చేస్తున్నట్టు చెప్పుకుంటున్న ఆ మాజీ మంత్రి ఎవరు? ఏంటాయన మంత్రాగం?.. దేవినేని ఉమా… టీడీపీ సీనియర్ లీడర్. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన…
ఆ ఎమ్మెల్యే పేరుకే తప్ప… పరపతి లేకుండా పోయారా? ఆయన సిఫారసులను కనీసం పట్టించుకునే వాళ్లు లేకుండా పోయారా? నేను లోకల్ అంటున్నా… పోవయ్యా… పోపో… అంటున్నారా? అదే స్థానంలో అంతకు ముందున్న ఎమ్మెల్యే చక్రం తిప్పగా… ఇప్పుడు ఈయనేమో… చక్రం కాదు కదా… కనీసం చెయ్యి కూడా తిప్పలేక గోవిందా… నువ్వే దిక్కు అంటున్నారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటాయన బాధ? ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం విశిష్టత గురించి ప్రత్యేకంగా…
తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల భర్తీ కూడా అదిగో పులి అంటే… ఇదిగో తోక అన్నట్టు ఉందా..? ఎప్పటికప్పుడు అదిగో ఇదిగో అంటున్నారే తప్ప ఎప్పటికప్పుడు ఎందుకు వాయిదా వేస్తున్నారు? కసరత్తు పూర్తయిపోయింది, రెండు రోజుల్లో ఇచ్చేస్తారన్న పదవుల్ని సైతం ఎందుకు పట్టించుకోవడం లేదు? కాంగ్రెస్ పెద్దలకు అడ్డుపడుతున్నదేంటి? స్థానిక ఎన్నికల సందర్భంగా ఇచ్చే పదవులన్నా ఇస్తారా..! లేక వాటిని కూడా వాయిదా వేస్తారా? తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల భర్తీ అంశం ఊగిసలాడుతోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్…
ఆ ఎమ్మెల్యే కుటుంబంలో కుంపట్లు అంటుకున్నాయా? వారసత్వ పోరు అగ్గి రాజేసిందా? ఇన్నాళ్ళు పాలు నీళ్ళలా కలిసిమెలిసిపోయి రాజకీయం చేసిన అన్నదమ్ముల మధ్య వాళ్ళ కొడుకుల రూపంలో వార్ మొదలైందా? మోసే వాళ్ళు ఎప్పుడూ మోతగాళ్ళుగానే మిగిలిపోవాలా? పైకెక్కే ఛాన్స్ ఇవ్వరా? అంటూ శాసనసభ్యుడిని నిలదీస్తున్నదెవరు? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏమా కుటుంబ వారసత్వ కథా చిత్రమ్? వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు.. కాకినాడ సిటీ టిడిపి ఎమ్మెల్యే. ఆరు సార్లు పోటీ చేసి మూడు విడతలు…
జగన్ 2.oలో ఊహించని అంశాలు ఉండబోతున్నాయా? ఓటమి తర్వాత ఆయన బాగా మారిపోయారా? అందుకే ఇప్పుడు గతానికి పూర్తి భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఏంటా నిర్ణయాలు? వాటి ప్రభావం ఎంతవరకు ఉండవచ్చంటున్నారు? వైసీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఓటు బ్యాంక్ దాదాపుగా ఆ పార్టీకి టర్న్ అయ్యింది. 95 శాతం దాకా కాంగ్రెస్ ఓటర్లను తన వైపునకు తిప్పుకోవటంలో సక్సెస్ అయిన జగన్… కొందరు కీలక నేతల విషయంలో మాత్రం లైట్‌గా ఉన్నారట. అప్పట్లోనే…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. మేం పవర్లోకి వచ్చాక సామాన్యులు సైతం నిరభ్యంతరంగా సచివాలయానికి వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారంటూ జబ్బలు చరుచుకుంటున్నారు ప్రభుత్వ పెద్దలు. కానీ... రాష్ట్ర పరిపాలనకు గుండెకాయలాంటి అదే సెక్రటేరియట్‌లోని పలు పేషీల్లో పరిస్థితులు వేరేలా ఉన్నాయట. సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేషీలోనే ఉద్యోగుల ఆగడాలు శృతిమించిపోతున్నాయని సెక్రటేరియెట్ ఉద్యోగులే వాపోతున్న పరిస్థితి.
ఏపీ బీజేపీలో కొత్త ఆశలు రేగుతున్నాయి. త్వరలో ఖాళీ అవబోతున్న ఎమ్మెల్సీ సీట్ల కోసం నాయకులు చాపకింద నీరులా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారట.వచ్చే మార్చిలో ఎమ్మెల్యే కోటాలో నాలుగు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవబోతున్నాయి. అందులో ఒకటి బీజేపీకి ఇచ్చే ఛాన్స్ ఉందన్న అంచనాతో... రాష్ట్ర పార్టీ సీనియర్స్ పావులు కదుపుతున్నట్టు సమాచారం.