ఏపీ టీడీపీ లో ప్రకంపనలు పుట్టిస్తున్న డ్రోన్ కెమెరాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రోన్ కెమెరాలు.. డ్రోన్ షాట్స్..! ఏపీ టీడీపీలో ప్రస్తుతం ఇదే పెద్ద చర్చ. రాజకీయాలపై సీరియస్‌గా మాట్లాడుకోవాల్సిన సమయంలో ఈ అంశాలపై తమ్ముళ్ల లబలబలేంటి? మథన పడుతున్నారా.. తమకా ఆలోచన రాలేదని బాధపడుతున్నారా? ఇంతకీ ఏంటా సంగతి? లెట్స్ వాచ్!
ఏపీ టీడీపీలో డ్రోన్ కెమెరా విజువల్స్‌పై చర్చ..!
Also Read
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
ప్రత్యర్థి పార్టీలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వ పనితీరేంటి? క్షేత్రస్థాయిలోని పరిస్థితులపై సహజంగానే అన్ని పార్టీల్లోనూ చర్చ కామన్. విపక్షంలో ఉంటే ఎలాంటి ఆందోళనలు చేపట్టాలి? నిరసన కార్యక్రమాలేంటో ప్రణాళికలు వేసుకుంటారు. కానీ.. టీడీపీలో విచిత్రమైన చర్చ జరుగుతోందట. ఆ చర్చ కూడా డ్రోన్ కెమెరాలు.. డ్రోన్ విజువల్స్ గురించే. ఇటీవల వైసీపీ సర్కార్ చెత్త సేకరణ వాహనాలను ఒకేసారి జిల్లాకు పంపింది. అలా పంపుతున్న క్రమంలో విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర 4 వేల వాహనాలను చేర్చి.. ఒకేసారి లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా డ్రోన్ కెమెరాతో షూట్ చేసి మీడియాకు రిలీజ్ చేశారు. ఆ డ్రోన్ విజువల్స్ జనాల అటెన్షన్ తీసుకొచ్చాయి. ఆ విజువల్ ఇంపాక్ట్ పైనే టీడీపీలో చర్చ జరుగుతోందట.
డ్రోన్ కెమెరా దృశ్యాలను చూసి టీడీపీ కళ్లు కుట్టుకునే పరిస్థితి?
చెత్త వాహనాలకు ముందు.. అదే బెంజ్ సర్కిల్ నుంచి 108, 104 అంబులెన్స్‌లను, రేషన్‌షాప్ సరుకులు తీసుకెళ్లే వాహనాలను ఇదే విధంగా జిల్లాకు పంపారు. అప్పుడు కూడా డ్రోన్ విజువల్స్‌ను రికార్డ్ చేసి మీడియాకు రిలీజ్ చేసింది వైసీపీ సర్కార్. ఇదే కాదు.. గతంలో సీఎం జగన్ పాదయాత్ర, బహిరంగ సభల దృశ్యాలను కూడా డ్రోన్ ద్వారానే రికార్డ్ చేసి రిలీజ్ చేసేవారు. ఆ విజువల్స్ జనాలకు కనువిందు చేసేవి. ఇప్పుడు అవే దృశ్యాలను చూసి టీడీపీ కళ్లు కుట్టుకునే పరిస్థితి ఉందట.
అప్పట్లో ఈ ఐడియా తమకెందుకు రాలేదని టీడీపీ ఆవేదన..!
తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఐడియాలు ఎందుకు రాలేదు? అని టీడీపీ సమావేశాల్లో మాజీ మంత్రులు ప్రస్తావిస్తున్నారట. టీడీపీ పవర్‌లో ఉండగా.. రైతురథం పేరుతో 13 జిల్లాలకు సుమారు 20 వేల ట్రాక్టర్లు ఇచ్చి ఉంటామని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గుర్తు చేస్తున్నారట. అప్పుడు ఇదే విధంగా ట్రాక్టర్లను ఒకచోట పెట్టి లాంఛ్ చేసి ఉంటే బాగుండేదని తమ్ముళ్లు బాధపడుతున్నట్టు సమాచారం. ఈ విషయం తెలిసినప్పటి నుంచి పార్టీ శ్రేణుల్లో మరో చర్చ జరుగుతోంది. టెక్నాలజీని ప్రవేశపెట్టడం తమతోనే సాధ్యమని జబ్బలు చర్చుకునే తమ నేతలకు డ్రోన్ కెమెరాలే గుర్తుకు రాలేదా అని సెటైర్లు వేస్తున్నారట. టెక్నాలజీని ప్రవేశపెట్టడమే కాదు… వాడుకోవడమూ తెలియాలని సన్నాయి నొక్కులు నొక్కేవారూ ఉన్నారట. మొత్తానికి డ్రోన్ కెమెరా విజువల్స్ ప్రభావం ఎలా ఉన్నా.. ఆ దృశ్యాలు మాత్రం టీడీపీని బాగానే కలవర పెడుతున్నాయని చెవులు కొరుక్కుంటున్నారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!