Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Off The Record Internal Survey Tension In Visakhapatnam Ycp

విశాఖ వైసీపీలో అంతర్గత సర్వే టెన్షన్‌..!

Published Date :October 7, 2021 , 5:39 pm
By Lakshmi Narayana
విశాఖ వైసీపీలో అంతర్గత సర్వే టెన్షన్‌..!
  • Follow Us :

విశాఖ వైసీపీలో అంతర్గత సర్వే టెన్షన్ పుట్టిస్తోందా? ఎమ్మెల్యేల పనితీరుకు హైకమాండ్ గీటురాయి పెట్టిందా? ఈ నివేదికలు కొందరు శాసనసభ్యుల భవిష్యత్‌ను నిర్దేశిస్తాయా? నెగెటివ్ స్కోర్ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు? పార్టీ నేతలు ఆరా తీస్తున్నారా?

వైసీపీ నేతల్లో అంతర్గత సర్వేపై టెన్షన్‌..!

2019 ఎన్నికల్లో తెలుగుదేశం కంచుకోటలను బద్ధలు కొట్టింది వైసీపీ. ఉత్తరాంధ్ర రాజకీయాలకు గేట్ వేగా పిలుచుకునే విశాఖజిల్లాలో 11 అసెంబ్లీ సీట్లు.. మూడు ఎంపీ స్ధానాలను కైవశం చేసుకుంది. అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్ల కాలంలో నియోజకవర్గాల్లో పరిస్ధితులను ఎప్పటికప్పుడు గమనించేందుకు ప్రత్యేక వ్యవస్థ నడుస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరు.. ప్రభుత్వ విధానాలపై ప్రజాభిప్రాయాన్ని వివిధ మార్గాల ద్వారా సేకరిస్తోంది. ఐతే, ఇప్పుడు నిర్వహిస్తున్న అంతర్గత సర్వే పూర్తిగా భిన్నమైందనే చర్చ అధికారపార్టీలో ఆసక్తికరంగా మారింది.

పాదయాత్ర కంటే ముందు నుంచీ పార్టీలో ఉన్నవారి ఫీడ్‌ బ్యాక్‌ సేకరణ?

రెండున్నరేళ్ల తర్వాత వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీని, నాయకత్వాన్ని సిద్ధం చేస్తోంది వైసీపీ హైకమాండ్‌. ఇటీవల కొన్ని సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించాయట. లేటెస్ట్‌గా ప్రశాంత్‌ కిశోర్‌ టీమ్‌ విశాఖలో సర్వే ప్రారంభించినట్టు ప్రచారం జరుగుతోంది. పీకే బృందం సేకరిస్తున్న అంశాలేంటనేది పార్టీలో చర్చగా మారింది. జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేల పనితీరు, స్థానిక పరిస్థితులకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారట. పార్టీ తరఫున నిర్వహిస్తున్న సర్వేలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారట. పాదయాత్ర కంటే ముందు నుంచి పార్టీలో సభ్యత్వం కలిగిన కేడర్, లీడర్ల నుంచి మాత్రమే ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వారిచ్చే సమాచారమే పక్కా అనే అభిప్రాయం ఉందట.

చిన్నపాటి పనులు చేయించుకోలేకపోతున్నామని ఎమ్మెల్యేల అసంతృప్తి..!

ఇటీవల కొందరు వైసీపీ నేతలు తమ అభిప్రాయాలను బాహాటంగానే వెల్లడిస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేస్తున్నవారికి నామినేటెడ్‌ పదవుల భర్తీలో అన్యాయం జరిగిందనే చర్చ ఉంది. ఇక యంత్రంగం తమ మాటకు విలువివ్వడం లేదని కొందరు ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉంది. చిన్నపాటి పనులు కూడా చేయించుకోలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారట. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది.

నెగెటివ్‌ స్కోర్‌ వచ్చిన ఎమ్మెల్యేలు ఆరుగురు?
రెఫరెండంగా స్థానిక ఎన్నికల ఫలితాలు?

ఎమ్మెల్యేల పనితీరు.. నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టత.. అంతర్గత వ్యవహారాల ఆధారంగా సర్వే నిర్వహిస్తున్నారట. దీంతో నెగెటివ్ స్కోర్ వచ్చే ఎమ్మెల్యేలు ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఆ జాబితాలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ ఆరుగురిలో ఒకరు సీనియర్‌ ఎమ్మెల్యే కాగా.. మిగలిన వారు ఫస్ట్‌ టైమ్‌ శాసన సభ్యులుగా చెబుతున్నారు. గ్రేటర్‌ విశాఖ పరిధిలో రెండు, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో నాలుగుచోట్ల ప్రతికూల వాతావరణం ఉందని చర్చ నడుస్తోంది. ఎన్నికల ఫలితాలు, అంతర్గత విభేదాలు కొందరు ఎమ్మెల్యేలకు నెగెటివ్ స్కోర్ మూటగట్టాయనేది ఓ వాదన. అధికారికంగా చెప్పకపోయినా స్ధానిక సంస్ధల ఎన్నికలను ప్రభుత్వం రెఫరెండంగానే భావించిందట. జిల్లాలోని మెజార్టీ ఎమ్మెల్యేలు ఈ పరీక్షలో నెగ్గినప్పటికీ.. కొందరికి ఇబ్బందికర పరిస్థితులు ఎదరయ్యాయి. సీట్లు పెరగకపోయినా ప్రతిపక్షానికి ఓట్లు పెరగడం వైసీపీని ఆలోచనలోపడేసిందట. అందుకే దిద్దుబాటు చర్యల కోసం సర్వే చేయిస్తున్నట్టు సమాచారం. మరి.. ఈ సర్వే ఆధారంగా పార్టీ చర్యలు చేపడుతుందో లేదో చూడాలి.

  • Tags
  • off the record
  • Visakhapatnam YCP‌
  • ycp

WEB STORIES

పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు.. ఆ ప్రయోజనాలేంటో తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..

"పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు.. ఆ ప్రయోజనాలేంటో తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు.."

Sitara Ghattamaneni: సీతమ్మ వాకిట్లో 'సితార'.. నాన్న పాటతో ఉగాది శుభాకాంక్షలు

"Sitara Ghattamaneni: సీతమ్మ వాకిట్లో 'సితార'.. నాన్న పాటతో ఉగాది శుభాకాంక్షలు"

ఇండియాలో బిజీయెస్ట్ ఎయిర్‌పోర్టులు ఇవే..

"ఇండియాలో బిజీయెస్ట్ ఎయిర్‌పోర్టులు ఇవే.."

Pumpkin Juice: గుమ్మడికాయ రసంతో.. ఆ సమస్యలన్నీ మటాష్

"Pumpkin Juice: గుమ్మడికాయ రసంతో.. ఆ సమస్యలన్నీ మటాష్"

Health Tips: నిత్యం ఆ పని చేస్తే ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారు..

"Health Tips: నిత్యం ఆ పని చేస్తే ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారు.."

నిద్రలేవగానే జుట్టు విరబోసుకున్న భార్యను చూస్తే..

"నిద్రలేవగానే జుట్టు విరబోసుకున్న భార్యను చూస్తే.."

Onscreen Moms: రీల్ అమ్మలు.. రియల్ పేర్లు

"Onscreen Moms: రీల్ అమ్మలు.. రియల్ పేర్లు"

ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే మీరు మానసిక ఒత్తడికి గురవుతున్నట్లే..

"ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే మీరు మానసిక ఒత్తడికి గురవుతున్నట్లే.."

Buttermilk Benefits: మజ్జిగ తాగండి.. ఈ లాభాలు పొందండి

"Buttermilk Benefits: మజ్జిగ తాగండి.. ఈ లాభాలు పొందండి"

Historical Forts: భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 10 చారిత్రక కోటలు

"Historical Forts: భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 10 చారిత్రక కోటలు"

RELATED ARTICLES

Off The Record: అక్కడ అదే జరిగిందా?

Off The Record: ఆ అదాలత్ తో కొత్త చిక్కులు

Off The Record: గంటా ట్రెండ్ మారిపోయిందా?

Off The Record: ఆ సంఘం ఏమైంది?

Off The Record: వంశీ, నానిలను ఢీకొట్టేది ఎవరు?

తాజావార్తలు

  • Rishvi Thimmaraju: పల్లెటూరి ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’!

  • Viral News : సింహాన్నే పరిగెత్తించిన వీధి కుక్కలు.. తోక ముడిచిన మృగరాజు

  • AI bot as CEO: మానవ చరిత్రలోనూ మొదటిసారి కావటం విశేషం

  • Covid-19: 140 రోజుల తర్వాత అత్యధిక కరోనా కేసులు నమోదు..

  • Gutha Sukender Reddy: చైర్మన్ జనార్దన్ రెడ్డి హానెస్ట్ పర్సన్

ట్రెండింగ్‌

  • Spicy Chilli Chai : పెళ్లి గురించి అడిగే.. చిల్లీ చాయ్ రెసిపీ.. ఇది చాలా స్పైసీ గురూ!

  • Most Valuable Celebrity: బ్రాండ్ వాల్యూ సెలబ్రెటీ.. కోహ్లీని దాటేసిన బాలీవుడ్ స్టార్

  • Rohit Sharma : బామ్మర్ది పెళ్లిలో రోహిత్ శర్మ రచ్చ

  • Naatu Naatu Song: పెళ్లిలో షారూఖ్ దంపతులు ఏం చేశారంటే..

  • Razor Blades In Stomach: వ్యక్తి కడుపులో 56 రేజర్ బ్లేడ్‌లు!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions