ఇదెక్కడి తలపోటు అని టీడీపీ నేతలు దిగులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టుగా ఆ జిల్లా టీడీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారట. మిగిలిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో.. కొత్త తలపోట్లు మొదలైనట్టు టాక్. ఎన్నికల్లో ఇంఛార్జ్‌గా ఉన్నా.. ఫైనాన్స్ మేటర్స్ డీలింగ్ ఎలా అని ఒకటే మథన పడుతున్నారట.
పెనుకొండ మున్సిపాలిటీపై టీడీపీ ఫోకస్..!
Also Read
- AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
- OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
- Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ఏపీలో ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలు కాస్తభిన్నంగా ఉంటాయి. అధినేత వ్యూహాలను ఊహించడం తెలుగు తమ్ముళ్లకు కూడా సాధ్యం కాదు. ఒక్కోసారి చిన్న ఎన్నికలైనా రాష్ట్రస్థాయి నేతలంతా రంగంలోకి దిగుతారు. సత్తా చూపిద్దామనుకున్న సమయంలో ఎన్నికలకు దూరం అంటారు. ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులనే ఫేస్ చేస్తున్నారట అనంతపురం జిల్లా టీడీపీ నేతలు. వివిధ కారణాలతో వాయిదా పడిన స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో జిల్లాలోని కీలకమైన పెనుకొండ నగరపాలక సంస్థ ఉంది. ఈ ఎన్నికలను ప్రతిష్టగా తీసుకుంది టీడీపీ. పార్టీకి కంచుకోటగా ఉన్న పెనుకొండను 2019లో కోల్పోవడంతో.. ఇక్కడ వైసీపీ నుంచి గెలిచి మంత్రి అయిన శంకరనారాయణ పూర్తిస్థాయిలో పాగా వేయడానికి చూస్తున్నారు. అందుకే పెనుకొండ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి మంత్రికి, వైసీపీ చెక్‌పెట్టాలనే వ్యూహంలో టీడీపీ ఉందట.
20 వార్డుల్లో మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్లు టీడీపీ ఇంఛార్జులు..!
జిల్లాలోని టీడీపీ సీనియర్లను పెనుకొండలో పాగా వేయాలని అధిష్ఠానం నుంచి ఆదేశాలు వెళ్లాయట. ఇక్కడ మొదటి నుంచి పరిటాల ఫ్యామిలీకి పట్టుంది. మాజీ మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు ల్యాండైపోయారు. పెనుకొండ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. అధికారపార్టీని అన్నివిధాలా తట్టుకునేలా రణతంత్రం ఉండాలన్నది తమ్ముళ్ల ఆలోచన. 20 వార్డులకు 20 మంది ఇంఛార్జులను నియమించింది టీడీపీ. ఇంఛార్జులుగా ఉన్నవారంతా మాజీ ఎమ్మెల్యేలు.. పార్టీలో కీలక నేతలు. ఏ వార్డులో ఓడినా మీదే బాధ్యత అన్నట్టు సంకేతాలు పంపుతున్నారట.
వార్డు ఇంఛార్జులే ఎన్నికల ఖర్చు భరించాలట..!
ఆదేశాలు.. దిశా నిర్దేశాలు బాగానే ఉన్నా.. అధికారపార్టీని ఢీకొట్టాలంటే మంది బలంతోపాటు ఆర్థికబలం కూడా ఎంతో ముఖ్యం. ఆ విషయంలో పార్టీ ఇచ్చిన ఆదేశాలే వార్డు ఇంఛార్జులకు మింగుడు పడటం లేదట. వార్డులకు ఇంచార్జులుగా ఉన్న నాయకులే ఖర్చులు కూడా భరించాలన్నది టీడీపీ ఆదేశం. దీంతో ఒక అడుగు ముందు.. నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టు ఉందట నాయకుల పరిస్థితి. ఒకరిద్దరు ఫైనాన్షియల్ మేటర్స్‌కు ఓకే చెప్పినా.. మిగతా వారు మాత్రం ఇదెక్కడి పంచాయితీ అని లోలోపల సణుక్కుంటున్నారట.
డబ్బులు తేవడం ఎలా అని టీడీపీ నేతల మథనం?
అసలే ప్రతిపక్షంలో ఉన్నాం.. సాధారణ ఎన్నికలకు రెండున్నరేళ్ల సమయం ఉంది. ఈ టైమ్‌లో కొత్త తలనొప్పి ఏంటని అనుకుంటున్నారట టీడీపీ నేతలు. తాము ఎంత డబ్బు తీసినా.. మంత్రిగా ఉన్న శంకరనారాయణ ఊరుకుంటారా .. వారిని ఆర్థికంగా ఎదుర్కోవడం ఎలా అని ప్రశ్నించుకుంటున్నారట. దీంతో టీడీపీ నేతలకు ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా తయారైందట పరిస్థితి. అందుకే ఈ అంశం నుంచి ఎలా గట్టెక్కాలా అని ఎదురు చూస్తున్నారట.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?