టీఆర్ఎస్లో ఎమ్మెల్సీ ఛాన్స్ ఎవరికి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ ఆరుగురు ఎవరు? ఎవరికి అధికారపార్టీ పట్టం కడుతుంది? పదవీకాలం ముగిసిన వారిలో రెన్యువల్ అయ్యేది ఎందరు? ఎమ్మెల్యే పదవులపై ప్రస్తుతం ఇదేచర్చ. రకరకాల పేర్లు.. సమీకరణాలు.. చర్చలు గులాబీ శిబిరంలో వేడి పుట్టిస్తున్నాయి.
టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కేదెవరికి?
Also Read
తెలంగాణ శాసనమండలిలోని ఆరుఎమ్మెల్సీ ఖాళీల భర్తీకి షెడ్యూల్ రావడంతోనే.. గులాబీ శిబిరంలో అలజడి మొదలైంది. అన్నీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు కావడంతో.. ఆరుకు ఆరు టీఆర్‌ఎస్‌కే దక్కుతాయి. అధికారపార్టీ పెద్దల ఆశీసులు ఉంటే చాలు… చట్టసభలో ఆరేళ్లపాటు ఎమ్మెల్సీగా ఉండొచ్చు. అయితే పదవీయోగం కలిగిన ఆ ఆరుగురు టీఆర్‌ఎస్‌లో ఎవరన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
గుత్తాకు రెన్యువల్ ఉండొచ్చని పార్టీ వర్గాల టాక్..!
ఎమ్మెల్సీలుగా పదవీకాలం ముగిసి..తాజా మాజీలుగా మారిన వారిలో మండలి ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లుగా పనిచేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యసాగర్‌రావులు ఉన్నారు. పార్టీ నేతలు బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలితలు సైతం మాజీలయ్యారు. ఈ ఆరుగురిలో రెన్యువల్ ఎంతమందికి అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఒకరిఇద్దరికి మరోసారి ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతున్నా.. పేర్లు బయటకు రావడం లేదు. ఆ ఇద్దరి పేర్లు చర్చల్లో బలంగా వినిపిస్తున్నా.. చివరి వరకు సస్పెన్సే. గుత్తా పేరు మాత్రం రేస్‌లో ముందుంది.
పార్టీ అవసరాల మేరకు పేర్లు వడపోతలు..!
ఎమ్మెల్యే కోటాలోని ఈ ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎప్పుడో నోటిఫికేషన్ రావాలి. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఈసీ ఎట్టకేలకు షెడ్యూల్ రిలీజ్ చేయడంతో.. గులాబీ దళపతి నుంచి ఎమ్మెల్సీ హామీ పొందిన వారు ఆశగా ప్రగతిభవన్ వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో ఆశావహుల సంఖ్య కూడా పార్టీలో ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం పదవీకాలం ముగిసిన వారిలో పనితీరు.. సామాజిక సమీకరణాలు.. జిల్లాలను దృష్టిలో పెట్టుకుని పిలుస్తారని అనుకుంటున్నారు. పార్టీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వడపోతలు ఉంటాయని సమాచారం.
పెద్దలకు సన్నిహితంగా ఉండేవారి దగ్గర నేతల ఆరా..!
టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. చాలా మందికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. వారంతా ఇదిగో అదిగో అన్నట్టు ఎదురు చూస్తున్నారు. ఖాళీ సీట్లు ఆరు ఉంటే.. అంతకు మూడు నాలుగింతలు మంది క్యూలో ఉన్నారు. ఈ దఫా తప్పక ఎమ్మెల్సీని చేస్తారని పార్టీ నేతలు ధైర్యంగా చెప్పుకొనే పరిస్థితి లేదు. పిలుపు వచ్చే వరకు ఉత్కంఠే. అందుకే పార్టీలో పెద్దలకు సన్నిహితంగా ఉండే నాయకుల దగ్గర ఆరా తీస్తున్నారట ఆశావహులు. మరి.. ఎవరికి ఛాన్స్ ఇస్తారో… ఎవరికి రెన్యువల్ ఉంటుందో నామినేషన్ల దాఖలు వరకు ఆగాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
-
Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
-
Congo Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి
-
CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
ట్రెండింగ్
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!