కంచుకోటలాంటి నియోజకవర్గం.. గత ఎన్నికల్లో మెజార్టీ తగ్గింది. స్థానిక సంస్థల్లోనూ ఎదురు దెబ్బ తగిలింది. క్యాడర్లో ధైర్యం సన్నగిల్లుతోంది. వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామంటున్నారు ప్రత్యర్థులు. ఇలాంటి పరిస్థితుల్లో అధినేత రెండు రోజుల టూర్ చేశారు. ఇప్పుడు పరిస్థితి మారుతుందా?. చంద్రబాబు కుప్పం టూర్‌పై తెలుగు తమ్ముళ్లు హ్యాపీయేనా?. సొంత నియోజకవర్గం నుంచే మొదలుఇటీవలి వరస సంఘటనల తర్వాత పార్టీలో కదలిక వచ్చింది. దాన్ని అలాగే ఉంచాలంటే ఎక్కడ నుంచైనా మొదలు పెట్టాలి. ఎక్కడ నుంచో ఎందుకు?. సొంత…
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు… శాశ్వత మిత్రులు లేరు. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఏం జరిగినా అదంతా పాలిటిక్స్‌లో బాగమే. కానీ నిరంతరం పోరాడుతూ ఉండాలి. ప్రజల్లో ఉండాలి. విశాఖ ఉక్కు ఉద్యమం ప్రారంభమై చాలా రోజులైనా.. తాజాగా కొత్త డిమాండ్ పెట్టారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అఖిల పక్షం ఏర్పాటు చేసి.. ఢిల్లీ వెళ్లాలన్నది ఆయన సూచన. ఇందులో ఏదైనా వ్యూహం ఉందా?. విశాఖ ఉక్కు ఉద్యమంలోకి పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు ఉద్యమంలో లేటెస్ట్…
టీ కొట్లు.. రచ్చబండల మీద జరిగే చర్చలు యమ రంజుగా ఉంటాయి. రాజకీయాలపై చాలా ఆసక్తిగా చర్చలు అక్కడ జరుగుతుంటాయి. ఒక మాజీ మంత్రిపై ఆ నియోజకవర్గంలో అలాంటి చర్చే నడుస్తోందట. చర్చకు కారణం ఆయనపై వచ్చిన ఒక కరపత్రం. ఆ కరపత్రాల టాక్స్ టీకొట్ల వరకు ఆగితే ఓకే.. పార్టీ అధినేత వరకు వెళ్తే ఏంటన్నదే ప్రశ్నగా మారింది. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..! కాల్వ చుట్టూ టీడీపీలో విమర్శలు..! గతంలో అనంతపురం జిల్లా టీడీపీలో…
బెజవాడ టీడీపీ అంతర్గత రాజకీయాల్లో పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. పార్టీకి దూరమైపోతారని భావించిన కేశినేని నాని రీయాక్టీవ్ అయ్యారు. అప్పటి వరకు యాక్టీవ్‌గా ఉన్న బుద్దా వెంకన్న, బొండా ఉమాలు డీలా పడ్డారు. ఇంతకీ ఏం జరిగింది? ఇకపై ఏం జరగబోతోంది? చంద్రబాబు దీక్షతో మారిన బెజవాడ టీడీపీ సీన్..! మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బెజవాడ టీడీపీ టీమ్ బాగా డిస్ట్రబ్ అయింది. నగరంలో ‘టీమ్ టీడీపీకి’ కీలకంగా ఉన్న ఎంపీ…
హుజురాబాద్ ఉపఎన్నిక ప్రక్రియ ముగిశాక.. పాడి కౌశిక్‌రెడ్డికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ క్లియర్ అవుతుందా? టీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి వెయిట్ చేస్తున్న ఆయన.. ఇంకా ఎదురు చూడాలా? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది.. తేలని కౌశిక్‌రెడ్డి పదవి..! పాడి కౌశిక్‌రెడ్డి. 2018లో హుజురాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి. ప్రస్తుత ఉపఎన్నిక బ్యాక్‌డ్రాప్‌లో అనూహ్యంగా టీఆర్ఎస్లో చేరారు. గులాబీ కండువా కప్పుకొన్న రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్సీని చేస్తున్నట్టు అధికారపార్టీ తీపి కబురు అందించింది. గవర్నర్…
ఆ రెబల్ ఎమ్మెల్యే ఊహించింది ఒకటైతే.. జరుగుతున్నది మరొకటా? పార్టీలో అసమ్మతి కుంపట్లు చెమటలు పట్టిస్తున్నాయా? చాపకింద నీరులా విస్తరిస్తున్న వ్యతిరేకత టెన్షన్ పుట్టిస్తోందా? అధిష్ఠానానికి తలనొప్పిగా మారిన ఆ నియోజకవర్గం ఎక్కడిది? అక్కడ కుమ్ములాటల కథేంటి? బలమైన శక్తిగా ఎదగాలన్నది వాసుపల్లి ఆలోచన? విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీలో మూడు ముక్కలాట ముదురుతోంది. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు వ్యతిరేకంగా కొత్త కుంపట్లు రాజుకుంటున్నాయి. ఇటీవల అధికారపార్టీ నిర్వహించిన జనాగ్రహదీక్ష సాక్షిగా మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి.…
ఆయనో డిప్యూటీ సీఎం. రోజూ జనంతో సంబంధం ఉండే శాఖ ఆయనే చూస్తున్నారు. సీఎం రివ్యూలకూ టంచన్‌గా హాజరయ్యే ఆ మంత్రిగారు సొంత నియోజకవర్గ ప్రజలకు మాత్రం కనిపించడం లేదట. మంత్రి ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారు? ఆళ్ల నాని. ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచి ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. వైద్య ఆరోగ్యశాఖ అంతా ఆయనే చూస్తున్నారు. కొన్ని రోజులుగా ఆయన నియోజకవర్గ ప్రజలకు కనిపించడం లేదట. మంత్రి కోసం ఆయన ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గర ఎదురు…
చాలారోజుల తర్వాత తెలంగాణలో ఆర్టీసీకి రవాణా మంత్రి.. సంస్థకు ఛైర్మన్, పూర్తిస్థాయి ఎండీ వచ్చారు. ఈ మార్పు రుచించలేదో ఏమో.. ఆర్టీసీవైపు కన్నెత్తి చూడటం లేదు మంత్రి. సంస్థ ఛైర్మన్‌ను కలిస్తే ఒట్టు. కలిసి సమీక్షల్లేవ్. ఎందుకిలా? మంత్రికి ఉన్న అభ్యంతరాలేంటి? ఆర్టీసీ వ్యవహారాలపై మంత్రి టచ్ మీ నాట్..! పువ్వాడ అజేయ్ కుమార్… తెలంగాణ రవాణా మంత్రి. బాజిరెడ్డి గోవర్దన్… తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆర్టీసీలో వ్యవహారాలను అన్నీ తానై చూసిన…
టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగితే స్పందించ లేదు. చంద్రబాబు దీక్ష చేస్తే రాలేదు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లినా వెంట లేరు. ఆయనే టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్..! ఇంతకీ జయదేవ్‌కు ఏమైంది? పార్టీతో గ్యాప్ వచ్చిందా లేక.. రాజకీయాలకు గుడ్‌బై చెప్పారా? టీడీపీలో నల్లపూసైన ఎంపీ గల్లా జయదేవ్..! ఏపీలో టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలలో గల్లా జయదేవ్ ఒకరు. వైసీపీ స్వింగ్‌లోనూ.. వరసగా రెండోసారి గుంటూరు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. విభజన హామీలపై లోక్‌సభలో…
టీఆర్ఎస్ ప్లీనరీ కేడర్‌లో జోష్ తీసుకొస్తే.. కొన్ని జిల్లాల్లో అసంతృప్త జ్వాలలను రాజేసింది. ఆహ్వానాల విషయంలో వివక్ష చూపించారని మంత్రిపై చింతనిప్పులు తొక్కుతున్నారు నేతలు. ఎవరా మంత్రి? ఏంటా జిల్లా? ప్లీనరీ పాస్‌లపై మేడ్చల్ టీఆర్ఎస్లో రగడ..! టీఆర్ఎస్ ప్లీనరీకి మేడ్చల్ జిల్లా నుంచి 200 మంది ముఖ్యనేతలకు పాసులు జారీ చేశారు తెలంగాణ భవన్ సిబ్బంది. జిల్లాలో పీర్జాదిగుడా, బోడుప్పల్, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ప్లీనరీకి వార్డు కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు కూడా పాసులు…