తిరుమల వేంకటేశ్వరుని క్షణకాల దర్శనమే అమోఘం.. అద్భుతం. అలాంటిది స్వామి వారికి సేవ చేసుకోవడానికి ఎంపిక అయితే మహాద్భుతమే…! కానీ, TTDలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన 52 మందిని దురదృష్టం వెంటాడుతూనే ఉందా? వారి ఆశలు అడియాశలేనా? హైకోర్టు కామెంట్స్‌తో ఆర్డినెన్స్‌కు బ్రేక్ పడిందా లేక పూర్తిగా ఆగిపోయిందా? అసలేం జరిగింది? లెట్స్ వాచ్..! టీటీడీ బోర్డుపై ధర్మాసనం కీలక కామెంట్స్..! తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం తర్వాత ఎదురైన సమస్యలు ఇప్పట్లో కొలిక్కివచ్చేలా లేవు.…
నాకు పదవి రావాలని కోరుకోవడంలో అస్సలు తప్పులేదు. కానీ.. నాకు రాకుంటే మాత్రం పక్కనేతకు రావొద్దని కోరుకుంటున్నారు ఆ జిల్లా నేతలు. తన సంగతి అటుంచి ప్రత్యర్థికి ప్లస్ అయ్యే అంశాల టార్గెట్‌గా పావులు కదుపుతున్నారట. పైకి ఇకఇకలు.. పకపకలు.. వెనక మాత్రం వెన్నుపోట్లతో గట్టిగానే చెక్ రాజకీయం నడుపుతున్న ఆ నేతలు ఎవరో ఇప్పుడు చూద్దాం. అవంతిని మారిస్తే.. ఆయన స్థానంలో కేబినెట్లో ఎవరికి ఛాన్స్? విశాఖ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలలో అమాత్య పీఠం కోసం…
దమ్ముంటే ఇప్పుడు ఎన్నికలు పెట్టండి.. మీ పెతాపమో.. మా పెతాపమో తేల్చుకుందాం అని సవాళ్లు విసిరిన టీడీపీకి..ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడిందా? స్థానిక సంస్థల ఎన్నికలు ఆ పార్టీకి అగ్నిపరీక్షగా మారబోతున్నాయా? తెలుగు తమ్ముళ్లు ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడ్డారా? మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికల్లో శక్తిని చాటుకోక తప్పదా? ఏపీలో వివిధ కారణాలతో మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడత ఎలక్షన్స్ జరిగినప్పుడు నామినేషన్ల దాఖలు, ఏకగ్రీవాల విషయంలో అధికారపార్టీ…
హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు చేరికలు టిఆర్ఎస్ కు ఎంత వరకు కలసి వచ్చాయి ? ఆ నలుగురు నేతల చేరికతో ప్లస్ అవుతుంది అనుకుంటే…అలాంటిదేమీ జరగలేదా? గులాబి పార్టీలో హుజూరాబాద్ ఫలితం తర్వాత జరుగుతున్న చర్చలేంటి? హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసింది.టిఆర్ఎస్ పార్టీ ఆశించిన ఫలితం రాబట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.దీంతో హుజురాబాద్ ఫలితంపై టిఆర్ఎస్ లో అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. ఓటమికి కారణాలపై ఎవరికి వారు విశ్లేషణలు చేస్తున్నారు. ఉపఎన్నికలో గెలుపు కోసం…
పిసిసి చీఫ్ కి, ఇంచార్జ్ కి అయన కంట్లో నలుసులా మారిపోయారా? టీ కాంగ్రెస్‌ని ఆ నేత ఇరకాటంలో పెడుతున్నారా? ఇప్పటికే కొనసాగుతున్న ఫిర్యాదులు హుజూరాబాద్ ఫలితం తర్వాత మరింత పెరిగాయా? కాంగ్రెస్ రాజకీయాల దారే వేరు.మిగతా పార్టీలకి కాంగ్రెస్ కి చాలా తేడా ఉంటుంది.అందులో ఉంటూనే… వ్యతిరేతకతలను, అసంతృప్తిని బాహాటంగా చెప్పొచ్చు. ఇదే ఆ పార్టీకి కొన్ని సార్లు బలంగా కనిపిస్తే, మరికొన్ని సార్లు ఇది బలహీనతగా కూడా మారుతోంది. ఇప్పుడు టీ తెలంగాణ కాంగ్రెస్…
ఆ జిల్లాలో ఉన్నది మూడే నియోజకవర్గాలు. మూడింటికి మూడు కీలక సెగ్మెంట్లే. ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉన్నా.. ప్రధానపార్టీలు గేర్ మార్చడంతో రాజకీయ వేడి రాజుకుంది. జిల్లా నాదా.. నీదా అన్నట్టు కార్యక్రమాలు జోరు పెంచారు నాయకులు. ఇంతకీ ఏంటా జిల్లా? అక్కడ రాజకీయ ప్రత్యేకత ఏంటి? ఓటర్లు ఎప్పుడెలా స్పందిస్తారో అంతుబట్టదు..! నారాయణపేట జిల్లా. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పునర్విభజన తర్వాత మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ కొత్త జిల్లా పరిధిలోకి వచ్చాయి. అవే…
వరసగా ఏసీబీ దాడులు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ అన్నట్టుగా విమర్శలు. వీటికి చెక్ పెట్టే పనిలో పడింది తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. ఏకంగా సబ్ రిజిస్ట్రార్లకే కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో ఉన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా ప్రత్యేకంగా నిఘా పెట్టారని ప్రచారం జరుగుతోంది. అందుకే నీడ కనిపించినా ఉలిక్కి పడుతున్నారట అధికారులు, సిబ్బంది. నెల రోజుల వ్యవధిలోనే ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు..! మామూళ్లు ఇస్తే కానీ.. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో పనులు జరగవనే…
చిత్తూరు జిల్లాలో ఆ ఇద్దరు నాయకుల మధ్య వైరం పీక్స్‌కు చేరింది. ఓపెన్‌గానే సవాళ్లు విసురుకుంటున్నారు. మాటలతో ఒకరు.. కవ్వింపులతో ఇంకొకరు రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. దీంతో పుంగనూరు గిత్తకు పొగరెంత అని లెక్కలేసుకుంటున్నాయి శ్రేణులు. వారెవరో.. ఏంటో లెట్స్ వాచ్..! చంద్రబాబు కుప్పంలో గెలవలేరని మంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్..! చిత్తూరు జిల్లా రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. టీడీపీ అధినేత చంద్రబాబు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ పొలిటికల్ హీట్ నడుస్తోంది. ఇద్దరూ ఎస్వీ యూనివర్సిటీలో చదువుకొనే…
ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టుగా ఆ జిల్లా టీడీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారట. మిగిలిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో.. కొత్త తలపోట్లు మొదలైనట్టు టాక్. ఎన్నికల్లో ఇంఛార్జ్‌గా ఉన్నా.. ఫైనాన్స్ మేటర్స్ డీలింగ్ ఎలా అని ఒకటే మథన పడుతున్నారట. పెనుకొండ మున్సిపాలిటీపై టీడీపీ ఫోకస్..! ఏపీలో ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలు కాస్తభిన్నంగా ఉంటాయి. అధినేత వ్యూహాలను ఊహించడం తెలుగు తమ్ముళ్లకు కూడా సాధ్యం కాదు. ఒక్కోసారి చిన్న ఎన్నికలైనా…
ఆ ఆరుగురు ఎవరు? ఎవరికి అధికారపార్టీ పట్టం కడుతుంది? పదవీకాలం ముగిసిన వారిలో రెన్యువల్ అయ్యేది ఎందరు? ఎమ్మెల్యే పదవులపై ప్రస్తుతం ఇదేచర్చ. రకరకాల పేర్లు.. సమీకరణాలు.. చర్చలు గులాబీ శిబిరంలో వేడి పుట్టిస్తున్నాయి. టీఆర్ఎస్లో ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కేదెవరికి? తెలంగాణ శాసనమండలిలోని ఆరుఎమ్మెల్సీ ఖాళీల భర్తీకి షెడ్యూల్ రావడంతోనే.. గులాబీ శిబిరంలో అలజడి మొదలైంది. అన్నీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు కావడంతో.. ఆరుకు ఆరు టీఆర్ఎస్కే దక్కుతాయి. అధికారపార్టీ పెద్దల ఆశీసులు ఉంటే చాలు……