మంత్రి అవునంటే.. కార్పొరేషన్ ఛైర్మన్ కాదంటారు. ఛైర్మన్ ఓకే చెబితే.. మంత్రి నో అంటారు. ఇద్దరి మధ్య నెలకొన్న పవర్ ఫైట్ వల్ల కొన్నాళ్లుగా కీలక నిర్ణయాల్లేవ్. అన్నీ సమస్యలే. ఇంతకీ ఎవరువారు? ఏంటా విభాగం? లెట్స్ వాచ్..! కలిసి సమీక్షల్లేవ్.. కీలక నిర్ణయాలు లేవు..! గంగుల కమలాకర్. తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి. మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్. ఇద్దరి మధ్య మొదటి నుంచి సత్సంబంధాలు లేవు. ఒకరు ఎడ్డెమంటే.. ఇంకొకరు…
సాధారణ ఎన్నికలైనా.. ఉపఎన్నికైనా రోడ్‌షోలు.. బహిరంగ సభలు కామన్. ఈ రెండు లేకుండా సాగుతోంది హుజురాబాద్ బైఎలక్షన్. నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోనూ సభలకు EC నో చెప్పడంతో ప్రత్యామ్నాయాలపై పడ్డాయి పార్టీలు. ఇంతకీ ఎన్నికల సంఘం విధించిన ఆంక్షలపై పార్టీలు హ్యాపీగా ఉన్నాయా.. బాధపడుతున్నాయా? ఆంతరంగిక చర్చల్లో జరుగుతున్న సంభాషణలేంటి? ఈసీ ఆంక్షలపై హుజురాబాద్‌లో చర్చ..! హుజురాబాద్‌లో ఈ నెల 30న పోలింగ్.. 27తో ప్రచారం ముగింపు. ప్రచారానికి మిగిలి ఉన్న ఈ కొద్దిరోజులనే కీలకంగా…
గెలుపు పక్కా అనుకుంటున్న టీఆర్ఎస్ శ్రేణులు.. హుజురాబాద్‌లో ఏ విషయంలో ఆశగా ఎదురు చూస్తున్నాయి? గులాబీ దళపతి లాస్ట్ పంచ్‌పై వేసుకుంటున్న లెక్కలేంటి? కేడర్‌లో ఉత్సాహం తీసుకొచ్చిన ప్రకటన ఏంటి? ఉపఎన్నికపై ప్రభావం చూపేలా కేసీఆర్ బహిరంగ సభ..! గతంలో జరిగిన ఉపఎన్నికలకు భిన్నంగా హుజురాబాద్‌లో ప్రచారం నిర్వహిస్తోంది టీఆర్ఎస్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్ నాయకులు విస్తృతంగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. బైఎలక్షన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు అధికారపార్టీ.…
వారం రోజులుగా టీడీపీలో బాలయ్య హాట్ టాపిక్. ఆయన తీరు లాభమో.. నష్టమో.. తేల్చుకోలేకపోతున్నారట తమ్ముళ్లు. సున్నితమైన విషయాల్లో బాలయ్య టచ్ మీ నాట్‌గా ఉండాలని అనుకుంటున్నారా? ఇంతకీ ఏ విషయంలో పార్టీ ఆందోళన చెందుతోంది? లెట్స్ వాచ్..! బాలయ్య వల్ల ఎదురయ్యే కష్టాలపై టీడీపీలో ఆరా? మా ఎన్నికలకు ముందు.. ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటనలు సినీ ఇండస్ట్రీలో ఎంత చర్చకు దారి తీశాయో.. దాదాపు అంతే చర్చ ఇప్పుడు టీడీపీలో జరుగుతోంది. మా ఎన్నికల్లో…
తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ జిల్లాల నాయకుల తీరే వేరా? పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాల్లో నేతలు ఎందుకు స్తబ్దుగా ఉన్నారు? పార్టీ కార్యక్రమాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారా? గ్రేటర్‌కు ఆనుకుని ఉన్న జిల్లాలోనూ అదే పరిస్థితి ఉందా? ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పీసీసీ కార్యక్రమాలకు నో ఎంట్రీ..! పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉండిపోయారు. ఈ రెండు జిల్లాల్లో పార్టీకి బలమైన నాయకత్వమే…
పోటీ చేయడానికి అభ్యర్థిని నిలబెట్టడం వరకు ఓకే..! కానీ.. ఓట్లేయించుకోవడం ఎలా? బద్వేల్లో బీజేపీ ముందు ఉన్న అతిపెద్ద సవాల్ ఇదేనట..! తాపీగా కూర్చుని డిపాజిట్ లెక్కలు వేసుకుంటున్నారట నాయకులు. ఎలాగో ఏంటో.. ఈ స్టోరీలో చూద్దాం. 2019లో బీజేపీకి వచ్చింది 735 ఓట్లే..!డిపాజిట్ దక్కేంత ఓట్లు వస్తాయా.. లేదా? బద్వేలు ఉపఎన్నికలో ప్రతిపక్షపాత్ర పోషించేందుకు బీజేపీకి అరుదైన అవకాశం దక్కింది. చనిపోయిన సిట్టింగ్ మెంబర్ కుటుంబానికే టిక్కెట్ కేటాయించడంతో టీడీపీ, జనసేనలు బరిలో నుంచి తప్పుకొన్నాయి.…
హుజురాబాద్‌లో అట్టహాస ప్రచారానికి EC ఆంక్షలు అడ్డంకిగా మారాయి. దీంతో పార్టీలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. హుజురాబాద్‌లో కాలు పెట్టకుండానే ఆ ప్రభావం ఉపఎన్నికపై పడేలా వ్యూహ రచనలో పడ్డాయట. వరస మీటింగ్‌లతో బైఎలక్షన్లో ఊపు తీసుకొచ్చే పనిలో ఉన్నాయట. ఈ విషయంలో అధికారపార్టీ ఆలోచన ఏంటి? హుజురాబాద్‌లో ప్రచార ఊపు తీసుకొచ్చేలా టీఆర్ఎస్ ప్లీనరీ? తెలంగాణలో గతంలో జరిగిన ఉపఎన్నికల ప్రచారానికి భిన్నంగా సాగుతోంది హుజురాబాద్ బైఎలక్షన్. ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాయి కానీ.. భారీ…
ఆ ముగ్గురు పార్టీని వాడేసుకున్నారని అనుమానం వచ్చిందా? వస్తాం అనగానే వచ్చేయ్యండని కండువాలు కప్పేసిన ఆ పెద్ద పార్టీ ఇప్పుడు వారిని దూరంగా పెడుతోందా? ఇంట్లోనే కట్టేసుకోవాలని చూస్తోందా? బీజేపీతో ముగ్గురు ఎంపీలు అంటీముట్టనట్టు ఉంటున్నారా? సాధారణ ఎన్నికలు అయ్యి అవగానే టీడీపీలో ఓ వెలుగు వెలిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్, టి.జి. వెంకటేష్ బీజేపీలో చేరిపోయారు. బీజేపీ వాళ్లతో ఏం ఒప్పందం చేసుకుందో… లేక వాళ్లే బీజేపీతో ఒప్పందం చేసుకున్నారో కానీ……
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయం అంతా దర్బార్ చుట్టే తిరుగుతుందా? హైకమాండ్‌కు ఫిర్యాదులు చేసే వరకు సమస్య వెళ్లిందా? కంప్లయింట్స్ వెనక ఉన్నది ఎవరు? ఇంతకీ దర్బార్ ఏంటి..? రేవంత్ పేరుతో ఉన్న సోషల్ మీడియా గ్రూపులపై హైకమాండ్‌కు ఫిర్యాదు..! తెలంగాణ కాంగ్రెస్‌లో ఫిర్యాదుల పరంపర కొనసాగుతుంది. చీమ చిటుక్కుమన్నా.. పార్టీ హైకమాండ్‌కు కంప్లయింట్స్ వెళ్తున్నాయి. ఇన్నాళ్లూ మీడియా ముందు బయటపడితే.. ఇప్పుడు అంతా ఈమెయిళ్లపై కథ నడిపించేస్తున్నారట. పార్టీ కార్యక్రమాలు లేవని.. ఉద్యమాలు చేయడం లేదని ఇప్పటి…
సీఎం కేసీఆర్ వదిలిన బీసీ బాణం.. బీజేపీని ఇరుకున పడేసిందా? బీసీ కుల గణనకు అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచారా? ఈ అంశం హుజురాబాద్‌లో అధికారపార్టీకి కలిసి వస్తుందా? రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? దేశ రాజకీయాలలో బీసీ కుల గణనకు డిమాండ్స్..! బీసీ కుల గణన ఇప్పుడు దేశమంతా ఇదే హాట్ టాపిక్. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్ కూడా ఇదే. వెనకబడిన వర్గాలకు చెందిన పలు సంఘాలు కూడా ఇదే శ్రుతి…