టీఆర్ఎస్ నేత బండ ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటు ఎవరికి..? స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తయిన వారిలో ఒకరిని ఢిల్లీకి పంపుతారా..? గులాబీ దళపతి కేసీఆర్ ప్లాన్ ఏంటి? రాజ్యసభకు ఎవరిని ఎంపిక చేస్తారు? అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బండ ప్రకాశ్ ముదిరాజ్ మూడేళ్ల ఎనిమిది నెలలే ఆ పదవిలో కొనసాగారు. ఇప్పుడు కూడా అంతే ఉత్కంఠగా రాజ్యసభ పదవీ వదిలేసి ఎమ్మెల్సీ పదవీకి ఎన్నికయ్యారు.…
ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్నది పార్టీల ఇష్టం. బలం లేనిచోట పోటీకి ఆలోచనలో పడతాయి. ఏకగ్రీవంగా గెలిచే పార్టీలో సంబరాలే సంబరాలు. కానీ.. అధికారపార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆశిస్తున్న సంబరాలు వేరే ఉన్నాయట. ఎవరో ఒకర్ని పోటీకి పెడితే.. తమ పంట పండుతుందని ప్రత్యర్థి పార్టీలను వేడుకుంటున్నారట. ఎందుకో.. ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ కోరుకుంటున్నారా? తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికలు చాలా కాస్ట్లీ. ఏ చిన్నపాటి ఎన్నిక వచ్చినా డబ్బులు…
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌గా ఛాన్స్ ఎవరికి దక్కనుంది..? అధికారపార్టీ పరిశీలనలో ఉన్న పేర్లేంటి? గవర్నర్ కోటాలో ఆయన వస్తే .. అధిష్ఠానం అటు మొగ్గు చూపుతుందా? కేబినెట్లో మార్పులు చేర్పులు ఆధారంగానే ఛైర్మన్ ఎంపిక ఉంటుందా? ముగ్గురు చుట్టూ మండలి ఛైర్మన్ పీఠంపై చర్చ..! ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే తెలంగాణలో కేబినెట్లో మార్పులు చేర్పులు.. శాసనమండలి ఛైర్మన్ ఎవరు అనే దానిపై అధికారపార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరిలు మరోసారి…
బాబాయ్ ఒక పార్టీలో ముఖ్య నేత. అబ్బాయి మరొక పార్టీలో యువనేత. నిన్న మొన్నటి వరకు కలిసిమెలిసి ఉన్న ఆ కుటుంబంలో రాజకీయ క్రీడ మొదలైందా? ఇంతకు ఎవరా అబ్బాయ్.. ఎవరా బాబాయ్? లెట్స్ వాచ్..! భూపేష్రెడ్డే రాజకీయ వారసుడిగా అప్పట్లో ఆదినారాయణరెడ్డి ప్రకటన..! దేవగుడి కుటుంబంలో రాజకీయ చిచ్చు రగులుకునేలా కనిపిస్తోంది. ఎన్నిరకాల ఒడిదుడుకులు ఎదురైనా ఒక్కటిగా ఉన్న ఆ కుటుంబం ఇప్పుడు రెండుగా చీలిపోనుందా? ఏ రాజకీయం అయితే వారిని కలిపిందో.. అదే రాజకీయం…
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు తేలడంతో.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది. ఎమ్మెల్యే కోటాలో ఓసీ సామాజికవర్గానికి ఎక్కువ ఎమ్మెల్సీలు దక్కడంతో.. స్థానిక కోటాలో బీసీ లెక్కలు తెరపైకి వస్తున్నాయి. 12 మంది సిట్టింగ్‌లలో సగానికి సగం మంది అభ్యర్థులను మార్చే ఛాన్స్ కనిపిస్తోంది. రెండేళ్లే పదవిలో ఉన్నవారిలో ముగ్గురికి రెన్యువల్..? తెలంగాణలో పదవీకాలం ముగిసే 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో టీఆర్ఎస్లో రాజకీయ వేడి…
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాశ్‌ను ఎమ్మెల్సీని చేయడంతో కేబినెట్లో మార్పులు చేర్పులపై ఒక్కసారిగా చర్చ మొదలైంది. కేబినెట్లో చోటు కల్పించడానికే ఆయన్ను మండలికి తీసుకొచ్చారని సమాచారం. బండ ప్రకాశ్‌తోపాటు మరికొందరిని కేబినెట్లోకి తీసుకోవడం..ఇంకొందరిని డ్రాప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కేబినెట్లోకి తీసుకొనేందుకే బండ ప్రకాశ్‌కు ఎమ్మెల్సీ? గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్. తొలి కేబినెట్లో ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను బర్తరఫ్ చేసి ఆ స్థానంలో కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎంను…
ఓ కీలకమైన విషయానికి సంబంధించి ప్రభుత్వం ఆ పెద్దాయన్ని సలహాదారుగా నియమించుకుంది. సలహాలతో ప్రభుత్వానికి సరైన గైడెన్స్ ఇవ్వడమో.. లేక సమన్వయమో చేయాలి. ఆ సలహాదారు మాత్రం టచ్ మీ నాట్‌గా ఉండిపోయారు. తాను చెప్పినా ఎవరూ వినరని నిస్తేజమా? నాకెందుకులే అనే భావనా? ఏదీ అర్థం కాకుండా ఉందట. మరి ఆయనకు పదవి ఇచ్చి ఏ లాభం అనే చర్చ అప్పుడే మొదలైపోయిందట. ఇంతకీ ఎవరాయన? ఉద్యమంలో ఉద్యోగులు.. సలహాదారు సన్మానాల్లో..! చంద్రశేఖర్ రెడ్డి. APNGO…
ఆ జిల్లాలో నిర్వహించిన రైతు మహాధర్నాలో టీఆర్ఎస్ నేతలు వర్గపోరుకే ప్రాధాన్యం ఇచ్చారా? పెద్దల హితోక్తులు చెవికి ఎక్కించుకోలేదా? మిగతావాళ్లు కలిసి సాగినా.. అక్కడ వేర్వేరు శిబిరాలు ఎందుకు వెలిశాయి? ఇంతకీ ఏంటా జిల్లా? లెట్స్ వాచ్! కలిసి నిరసనల్లో పాల్గొన్నది కొందరేనా? కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమాలను సక్సెస్ చేయడానికి టీఆర్ఎస్ నేతలు పోటీపడ్డారు. ఇదే సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు నాయకులు తమ మధ్య ఉన్న విభేదాలను…
మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగి నూనె అనే చందంగా మారింది తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి. వేలకోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీలో దుబారా ఖర్చులు తగ్గడం లేదు. సంస్థను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాల్సిన సారథులు, ఉన్నతాధికారులు.. లగ్జరీ కార్ల కోసం ఆర్టీసీపై మరింత భారం వేస్తున్నారు. విమర్శలకు ఆస్కారం కల్పిస్తున్నారు. లక్షలు ఖర్చుపెట్టి సారథుల కోసం కొత్త కార్లు? ఆర్టీసీని ఆదరించండి, ఆర్టీసీ బస్సులు ఎక్కండి.. ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోండి.. ప్రభుత్వం, ప్రజా రోడ్డు రవాణా…
ఇన్నాళ్లూ అతనొస్తే… టైమ్ ఇవ్వలేదు తెలంగాణ కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు. ఇప్పుడు మాత్రం ఆ నేత చుట్టూ ఒక్కటే ప్రదక్షిణలు. ఇంటికి పిలిచి మరీ కుశల ప్రశ్నలు వేస్తున్నారట. ఇంతకీ ఆ నేతకు టైమ్ వచ్చిందని అనుకుంటున్నారా? కానే కాదు.. తమ టైమ్ బాగుండాలని జాగ్రత్త పడుతున్నారట నాయకులు. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఓటమిపై అభ్యర్థి వెంకట్నే నివేదిక కోరిన హైకమాండ్..! 13న ఢిల్లీ AICC ఆఫీసులో ఏర్పాటు చేసిన మీటింగ్‌పైనే ఫోకస్ పెట్టారు తెలంగాణ…