Wyra Mla Troubles: ఎమ్మెల్యే మాట చెల్లుబాటు కావడంలేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారపార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ నియోజకవర్గంలో ఆయన మాట చెల్లడం లేదట. ఒక అధికారి బదిలీ విషయంలో తల పట్టుకున్నట్టు ఒక్కటే గుసగుసలు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నా హ్యాండ్సప్ అనేశారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆయనకొచ్చిన సమస్యేంటి? లెట్స్ వాచ్..!
వైరాలో ఎమ్మెల్యే మాట చెల్లుబాటు కావడం లేదా?
నియోజకవర్గానికి ఎమ్మెల్యే సుప్రీం. ఇది అధికారపార్టీ టీఆర్ఎస్ మాట. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి.. ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకొన్న ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఆ రూల్ పరిధిలో లేరో ఏమో.. స్థానికంగా ఆయన మాట చెల్లుబాటు కావడం లేదట. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై జరుగుతున్న వాడీవేడీ చర్చ ఇదే. ఇందుకు వైరా మున్సిపాలిటీలో జరుగుతున్న పరిణామాలే కారణం. వైరా మున్సిపల్ కమిషనర్ కేంద్రంగా రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి.
Also Read
వైరా మున్సిపల్ కమిషనర్‌పై కౌన్సిలర్ల గుర్రు
వైరా మున్సిపల్ కమిషనర్‌గా వెంకటస్వామి పనిచేస్తున్నారు. ఆయన గతేడాది మణుగూరు నుంచి వచ్చారు. వెంకటస్వామి గురించి మున్సిపల్ సిబ్బంది.. అధికారపార్టీ నేతలు రకరకాలుగా చెప్పుకొంటారు. కమిషనర్‌గా పనులు చక్కబెట్టడంలో ఆయన సిద్ధహస్తుడేనని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తారు లోకల్ లీడర్స్. అయ్యవారు మణుగూర్‌లో కమిషనర్‌గా ఉన్నప్పుడు అక్కడ మున్సిపల్ కౌన్సిల్ లేదు. ఆయనే సోల్ ఆఫీసర్. ఆయన చెప్పిందే అక్కడ శాసనంగా ఉండేదట. వైరాలో మాత్రం మున్సిపల్ కౌన్సిల్ ఉంది. మణుగురులో మాదిరి ఇక్కడా చేయాలని అనుకున్నారో ఏమో కౌన్సిలర్లను లెక్క చేయడం లేదన్నది కమిషనర్ వెంకటస్వామిపై ఉన్న ఆరోపణ. మున్సిపల్ ఛైర్మన్ జైపాల్, వైస్ ఛైర్మన్ సీతారాములను గుప్పిట్లో పెట్టుకున్నారని చెబుతారు.
కమిషనర్‌ను బదిలీ చేయించిన ఎమ్మెల్యే..!
మున్సిపాలిటీలో మాట చెల్లుబాటు కాకపోవడంతో టీఆర్ఎస్ కౌన్సిలర్లు.. కమిషనర్‌ను బదిలీ చేయాలని పదిరోజుల క్రితం తీర్మానం చేశారు. కౌన్సిల్ సమావేశం పెట్టకుండానే మీటింగ్ జరిగినట్టుగా తమ దగ్గర కమిషనర్ సంతకాలు తీసుకున్నారన్నది కౌన్సిలర్ల ఆరోపణ. ఇప్పుడు మిగతా పార్టీల కౌన్సిలర్లు కూడా ఈ విషయంలో టీఆర్ఎస్ సభ్యులతో కలిసిపోయారట. దీంతో సమస్య ఎమ్మెల్యే రాములు నాయక్ దగ్గరకు వెళ్లడం.. ఆయన కమిషనర్ వెంకటస్వామిని బదిలీ చేయించడం చకచకా జరిగిపోయింది. అయితే బదిలీపై వెళ్లిన వెంకటస్వామి గోడకు కొట్టిన బంతిలా మళ్లీ వైరా మున్సిపల్ కమిషనర్‌గా వచ్చేశారు. వెంకటస్వామి రీ ఎంట్రీతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట కౌన్సిలర్లు.
రాములు నాయక్ చేతులు ఎత్తేశారట?
కౌన్సిలర్లు అంతా కలిసి మరోసారి ఎమ్మెల్యే రాములు నాయక్ దగ్గరకు వెళ్లారట. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వెంకటస్వామిని బదిలీ చేసినా సీన్ రివర్స్ కావడంతో ఎమ్మెల్యేకూ ఏం అర్థం కావడం లేదట. తానేం చేయలేనని రాములు నాయక్ చేతులు ఎత్తేసినట్టు ప్రచారం జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు కమిషనర్ గుప్పిట్లో ఉన్న ఛైర్మన్ జైపాల్, వైస్ ఛైర్మన్ సీతారాములు సైతం ఆ మాయ నుంచి బయటకొచ్చి అసంతృప్తులతో కలిశారట. అంతా కలిసి ఎప్పటికప్పుడు ఒత్తిడి చేస్తున్నా ఎమ్మెల్యే రాములు నాయక్ తన మాట చెల్లడం లేదని వాపోతున్నారట. తన దగ్గరకు వచ్చేవాళ్లకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదట. దీంతో ఎమ్మెల్యే పవర్ ఏమైంది? ఒక అధికారిని కూడా బదిలీ చేయించుకోలేకపోతున్నారా అని అధికారపార్టీ వర్గాలు ఒక్కటే చెవులు కొరుక్కుంటున్నాయట. ఆ విషయం తెలిసి రాములు నాయక్ తల పట్టుకున్నట్టు సమచారం.
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!