ఆ ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఒకే ప్రాంతానికి చెందిన వారు. ఒకే సామాజిక వర్గం కూడా. పూర్వాశ్రమంలో ఒకే పార్టీలో ఉన్నా.. ఇప్పుడు వేర్వేరు పార్టీల నుంచి బరిలో దిగారు. మరి.. పాత పార్టీలు వారికి మద్దతుగా నిలుస్తాయా.. లేక ఒకరివైపే మొగ్గు చూపుతాయా? టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు పూర్వం కమ్యూనిస్ట్లే..! ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీల పేరు ప్రముఖంగా వినిపించేది. ఇప్పుడు ఆ పార్టీది టీఆర్ఎస్, కాంగ్రెస్ తర్వాత ప్లేస్. ఉనికి…
ఆ పార్టీకి ఇప్పుడో తలనొప్పి వచ్చిపడింది. అదేదో రాజకీయ సమస్య అయితే ఓకే…! కానీ మహిళలను వేధించారన్న ఆరోపణలు కావడంతో.. ఒక్కరు కూడా పెదవి విప్పడం లేదట. సున్నితమైన సమస్యగా భావించి అంతా పిన్‌డ్రాప్ సైలెన్స్. ఇంతకీ ఏంటా పార్టీ? ఆరోపణలు ఉద్దేశ పూర్వకమా? ఇంకేదైనా రాజకీయం ఉందా? లెట్స్ వాచ్..! పీసీసీలో పెద్దలకు దగ్గరగా ఉండేవారిపై వేధింపుల ఆరోపణలు? తెలంగాణ కాంగ్రెస్‌లో గడిచిన వారం రోజులుగా నాయకులంతా ఒక్కటే చెవులు కొరుకుడు.. గుసగుసలు. హుజురాబాద్ ఉపఎన్నిక…
ఏపీలో జరిగిన రెండో విడత మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ విశ్లేషణ చేస్తోంది. మరి.. కుప్పంలో ఓటమిపై చంద్రబాబు పోస్టుమార్టం చేస్తారా? ఆ దిశగా ఆలోచన ఉందా? పార్టీ ఆఫీస్‌కు వస్తున్న తమ్ముళ్లు వేస్తున్న ప్రశ్నలేంటి? రెండో విడత మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ విశ్లేషణ..!కుప్పం ఓటమిపైనా పోస్టుమార్టం చేస్తున్నారా? మొదటి విడతలో ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించడంతో ఆ ఫలితాలపై విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం లేదని భావించింది టీడీపీ. రెండో విడతలో జరిగిన…
ఆ పార్టీకి ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలు.. నలుగురు ఎంపీల బలం. కానీ.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 70 చోట్ల గెలిచి అధికారం చేపడతామని భారీ ప్రకటనలు చేస్తున్నారు. గెలుచుడు మాట దేవుడెరుగు..? అసలు అంత మంది అభ్యర్థులు వాళ్లకు ఉన్నారా? ఎన్నికల్లో వాళ్లకు అంత సీన్ ఉందా? సొంత పార్టీలోనే వినిపిస్తున్నా ప్రశ్నలివి. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని ప్రకటనలు..! గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది ఒక్కటే. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో…
పీఆర్సీ నివేదిక కోసం కొద్ది రోజులుగా ప్రభుత్వంపై కత్తులు నూరుతున్న ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం జగన్ ఝలక్ ఇచ్చారా? రచ్చ చేస్తున్నవారితో చర్చించకుండానే.. కీలక ప్రకటన చేసేశారా? ఆ ప్రకటన తమవల్లే సాధ్యమైందని ఉద్యోగ సంఘాల నాయకులు కాలర్ ఎగరేసుకోకుండా సీఎం స్ట్రాంగ్ స్ట్రోక్ ఇచ్చారా? పీఆర్సీపై తిరుపతి పర్యటనలో సీఎం జగన్ కీలక ప్రకటన..! తాడో పేడో తేల్చుకుంటాం..! ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు..! పీఆర్సీ నివేదిక ప్రకటిస్తారా లేదా అని రోడ్డెక్కి కార్యాచరణ…
ఒక్కసారి మాట జారితే అవి ఎంత దూరం తీసుకెళ్తాయో.. వాటి పర్యవసానాలను ఊహించడం కష్టం. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. కలకలం రేపిన ఆ మహిళా నేతల పరిస్థితి అలాగే ఉంది. వాళ్లంతా ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. వారి వెనక ఎవరున్నారన్నది ప్రశ్నే. టీడీపీ మహిళా నేతల కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్..! టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా ఎదుట కన్నీటిపర్యంతమైన తర్వాత.. అనంతపురం తమ్ముళ్లు, మహిళా నేతలు ఓ రేంజ్లో అధికారపార్టీపై ఫైర్ అయ్యారు. ఈ…
కాంగ్రెస్‌లో తన్నులాట.. ఫిర్యాదుల పర్వాలు కొత్తేమీ కాదు. అలాంటి పార్టీలో ఆయన్ను ఎవరైనా విమర్శించాలి అంటే వెనకా ముందు ఆలోచిస్తారు. ఆ జిల్లాలో మాత్రం ఏకంగా ఆయన్ని నానా మాటలు అనేశారు. నోటికొచ్చినట్టు మాట్లాడేశారు. ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. పార్టీలో చర్చ మొదలైంది. ఇప్పుడేం జరుగుతుందన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో పెరిగిపోతోంది. వీహెచ్‌ను అడ్డుకున్న ప్రేమ్‌సాగర్‌రావు వర్గం..! వరి రైతుల సమస్యలపై తెలంగాణలో వరసగా ఉద్యమిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇటీవల జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టి.. కలెక్టర్లకు…
రెబల్ అభ్యర్థి బరిలో ఉండటంతో టీఆర్ఎస్కు ఇబ్బందిగా మారిందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరి దృష్టి ఆ జిల్లాపైనే ఉందా? కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటీలో లేకపోయినా.. గులాబీ శిబిరంలో గుబులెందుకు? లెట్స్ వాచ్..! రెబల్ అభ్యర్థిగా రవీందర్‌సింగ్..! తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుచోట్ల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైతే.. మరో ఆరుచోట్ల పోటీ నెలకొంది. ఓటర్లను క్యాంపులకు తరలిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు పక్క రాష్ట్రాల్లోను ఈ శిబిరాలు నడుస్తున్నాయి. ఈ హీట్‌లో ప్రస్తుతం అందరి దృష్టీ ఉమ్మడి…
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తొలిగిపోవడంతో ఓరుగల్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుందా? ఎన్నికల కోడ్‌కి.. ఎమ్మెల్యేలకు లింకేంటి? కోడ్ అమలులో ఉన్నప్పుడు వారికి కలిసొచ్చిందేంటి? ఇప్పుడు వారిని ఇబ్బంది పెడుతున్న అంశం ఏంటి? రైతులకు ఎలా సర్దిచెప్పాలో తెలియక ఎమ్మెల్యేల ఆందోళన..! ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని ఏకగ్రీవంగా గెలిపించుకునేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా వ్యూహాలే రచించారు. చివరకు వారు అనుకున్నదే అయింది. అధిష్ఠానం దగ్గర మార్కులు వేయించుకున్నారు. ఇంత…
టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ ప్రకటన ఎప్పుడు? ఎమ్మెల్సీ ఖాళీల భర్తీ పూర్తికావడంతో ఇకపై సంస్థాగతంగా పార్టీ కూర్పుపై దృష్టి పెడతారా? రాష్ట్ర కమిటీలో చోటు దక్కేదెవరికి? డ్రాప్ అయ్యేది ఎవరు? టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీని ప్రకటిస్తారా? ఆ మధ్య తెలంగాణ భవన్లో వరసగా టీఆర్ఎస్ నేతలతో మీటింగ్స్ జరిగాయి. నియోజకవర్గాల వారీగా సమావేశాల దుమ్ము దులిపేశారు. జిల్లా అధ్యక్షులను ప్రకటిస్తారు.. ఆ తర్వాత టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీపై ప్రకటన ఉంటుందని అనుకున్నారు. సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్…