ఆయనేమో మంత్రి.. ఇంకొకరు మాజీ మేయర్. రాజకీయంగా ఇద్దరి మధ్య పాత పగలు ఉన్నాయట. అవి కొత్తగా సెగలు పుట్టిస్తాయేమోనని డౌట్. అందుకే అందరి దృష్టీ ఆ ఇద్దరిపైనే ఉంది. ఎవరా నాయకులు? ఏంటా వివాదం? రవీందర్ సింగ్ రీఎంట్రీ.. వాడీవేడీ చర్చ..!కరీంనగర్ టీఆర్ఎస్ రాజకీయాల్లో సెగలు రాజుకుంటున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉందన్నది అధికారపార్టీ వర్గాల మాట. ఇందుకు మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్ మధ్య నెలకొన్న…
ఆ నియోజకవర్గంలో ప్రభుత్వ పథకం అధికారపార్టీలో చీలిక తెచ్చిందా? వర్గపోరు బయటపడిందా? ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ విభేదాలను మరో అంకానికి తీసుకెళ్లాయా? ఏంటా నియోజకవర్గం? ఎవరా ఎమ్మెల్యే? బీసీ, కాపు సామాజికవర్గాల మధ్య ఆధిపత్యపోరు..!సైలెంట్ రాజకీయాలకు పెట్టింది పేరైన తణుకులో ప్రస్తుతం రాజకీయం వాడీవేడిగా ఉంది. అదీ అధికార వైసీపీలో కావడంతో మరింత అటెన్షన్ వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు. ఈ నియోజకవర్గంలో బీసీ, కాపు సామాజికవర్గాల మధ్య ఆధిపత్యపోరు ఉంది. ఆ సమస్య పెద్దగా…
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరన్న నానుడి మరోసారి రుజువైందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెబల్‌గా బరిలో దిగిన మాజీ మేయర్ ఘర్‌వాపసీ అవుతున్నారా? రవీందర్ సింగ్ మనసు మార్చుకున్నారా? తెరవెనక ఏం జరిగింది? టీఆర్ఎస్లోకి రవీందర్‌సింగ్ ఘర్‌వాపసీ..!రవీంద్ సింగ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ రెబల్‌గా బరిలో నిల్చొని ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో ఓడినా.. గణనీయంగానే ఓట్లు సాధించారు. ఉద్యమకాలం నుంచి టీఆర్ఎస్ను అంటిపెట్టుకుని ఉన్న ఈ మాజీ…
గ్రేటర్ వరంగల్ టీఆర్ఎస్లో కొత్త కుంపటి రాజుకుందా? ఇప్పటికే మేయర్, ఎమ్మెల్యేల మధ్య దూరం పెరగ్గా.. ఇప్పుడు కార్పొరేటర్లతోనూ మేయర్‌కు పడటం లేదా? నగరబాట నగుబాటగా మారుతోందని సొంత పార్టీ నేతలే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారా? గుండు సుధారాణి. ఈ మాజీ ఎంపీ.. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ మేయర్. ఈ మధ్య నగరబాట కార్యక్రమాన్ని చేపట్టారు మేయర్. వెంటనే టీఆర్ఎస్కే చెందిన కార్పొరేటర్లు కయ్యిమన్నారు. మేయర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు నాయకులు. వరంగల్ అభివృద్ధిలో ఇప్పటికే…
ఓ పెద్ద నాయకుడికి ఆయన వారసుడు. మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం విపక్షపార్టీలో ఉన్నా పెద్దగా చప్పుడు లేదు. కానీ.. తండ్రి వర్ధంతి రోజున సంచలన వ్యాఖ్యలు చేసి.. ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు. ఇంతకీ అది వ్యూహమా? నిజంగా ఆయన చెప్పినట్టు జరిగిందా? తన హత్యకు రెక్కీ నిర్వహించారంటూ వంగవీటి రాధాకృష్ణ చేసిన ఆరోపణపై బెజవాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తన పని తాను చేసుకుపోయే రాధాను హతమార్చేంత అవసరం ఎవరికి ఉంటుందనేది ఓ ప్రశ్న.…
పార్టీకి ఛార్జింగ్ ఎక్కించేందుకు అక్కడ టీడీపీ ప్రయోగాలు చేస్తోందా? ఈక్వేషన్లు తేడా కొడుతున్నాయా? బలమైన నాయకత్వం ఉన్నా.. క్షేత్రస్థాయిలో పార్టీ బలహీనంగా ఉందా? తాజా ప్రయోగమైనా ఫలితాన్నిస్తుందా? ఏంటా నియోజకవర్గం? ఇంఛార్జ్ మార్పు టీడీపీకి కలిసి వస్తుందా? కర్నూలు జిల్లా నందికొట్కూరు. ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు బలంగా ఉన్న టీడీపీ ఇపుడు జీరో అనే చెప్పాలి. ఈ పరిస్థితికి టీడీపీ అధిష్ఠానం బాధ్యతారహిత్యం కూడా కారణమని చెబుతారు. పచ్చ జెండాపై ప్రేమ, టీడీపీపై అభిమానం ఉన్న కేడర్‌లో…
మిషన్ 70. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ముందున్న టార్గెట్. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు కమలనాథులు. కొన్నిచోట్ల ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారట. ఇంఛార్జుల వేటలో పడినట్టు చెబుతున్నారు. బీజేపీ నేతలు నేల విడిచి సాము చేస్తున్నారా? తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే.. బీజేపీ బలం ముచ్చటగా ముగ్గురు ఎమ్మెల్యేలు. అందులో రెండు ఉపఎన్నికల్లో గెలిచినవే. 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయిన స్థానాలు ఎక్కువే. అయితే ఉప ఎన్నికల్లో గెలిచామన్న ధీమానో…
టీడీపీ చేసిన తప్పే తిరిగి చేస్తోందా? సామాజిక సమీకరణాలపై మళ్లీ పప్పులో కాలేస్తోందా? తాజా పరిణామాలపై తమ్ముళ్లలో జరుగుతున్న చర్చ ఏంటి? గతంలో చేసిన పొరపాట్ల నుంచి పార్టీ గుణపాఠాలు నేర్చుకోలేదా? సామాజిక సమీకరణాల్లో పాత పద్ధతే అనుసరిస్తున్నారా? గతంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ సామాజిక సమీకరణాల పరంగా కొన్ని తప్పిదాలకు పాల్పడిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలను కాదని.. కాపు సామాజికవర్గం వైపు మొగ్గు…
ఆ జిల్లాలోని ముఖ్య నేతలంతా కేరాఫ్ హైదరాబాద్. అధికార, ప్రతిపక్ష పార్టీలనే తేడా లేదు. అందరు నాయకులదీ అదే తీరు. ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన నేతలు.. స్థానిక ప్రజలకు దూరంగా ఉంటున్నారట. దీంతో ప్రజలకు.. వాళ్లు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు మధ్య గ్యాప్ వస్తుందని టాక్. ఇంతకీ ఏంటా జిల్లా? నాయకులు ఎందుకు జిల్లాలో ఉండటం లేదు? రెండేళ్లుగా ప్రజలకు దూరంగా ప్రజాప్రతినిధులు..! ఉమ్మడి కరీంనగర్ జిల్లా. రాజకీయ చైతన్యం ఎక్కువే. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి కాకలు తీరిన…
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై ఆ ఎమ్మెల్యేలకు పట్టు సడలిందా? ఎమ్మెల్యేల మాటలను వినే పరిస్థితి లేదా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ద్వారా.. ఆ నియోజకవర్గాల్లోని డొల్లతనం బయటపడిందా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యేలు? ఎమ్మెల్యేలకు లోకల్ లీడర్లపై పట్టు సడలిందా? ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ప్రకంపనలు టీఆర్ఎస్ వర్గాల్లో కొనసాగుతున్నాయి. ఎవరికి వారుగా పోస్టుమార్టం చేస్తున్నారు. అందరి ఫోకస్ కొత్తగూడెం, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాలపై ఉంది. ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల…