మంత్రి అంటే అభిమానులు.. అనుచరులు కామన్. కొందరు మంత్రి చెప్పిన పనిచేస్తే.. ఇంకొందరు తమ అభిమాన నేతపై ఈగ వాలితే సహించలేరు. ప్రస్తుతం ఆ మినిస్టర్ విషయంలో అదే జరుగుతోందట. అభిమానం తలనొప్పులు తెచ్చిపెడుతోందని టాక్. తాజా ఎపిసోడ్లో విపక్షాలకు టార్గెట్‌గా మారి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఆ అమాత్యులవారు. సుబ్బారావు గుప్తాపై దాడి ఘటనతో రచ్చ రచ్చ..! బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. ఏపీ మంత్రి. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆయన చుట్టూనే విమర్శలు.. ప్రతివిమర్శలు నడుస్తున్నాయి. గతంలోనూ ఆయన…
అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు టైమ్ చూసి ఝలక్ ఇస్తున్నారట పార్టీ నేతలు. నిరసనలు చేపడితే ఒక్కరు కనిపించడం లేదు. ముందురోజు వస్తామని చెప్పినవాళ్లే తర్వాతిరోజు పత్తా లేకుండా పోతున్నారట. ప్రస్తుతం ఆ జిల్లాలో ఆ ఎమ్మెల్యే.. అక్కడి కార్యకర్తల తీరుపైనే గులాబీ శిబిరంలో ఓ రేంజ్లో చర్చ జరుగుతోంది. పార్టీ శ్రేణుల తీరు ఎమ్మెల్యేకు అంతుచిక్కడం లేదా? బిగాల గణేష్ గుప్త. నిజమాబాద్ అర్బన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే. పార్టీకి బలం.. బలగం భారీగానే ఉన్న ఈ నియోజకవర్గంలో…
ఒకప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలు చేశారు. సీఎం రేస్ వరకు వెళ్లారు కూడా. సడెన్‌గా పాలిటిక్స్‌కు దూరం. ఆథ్యాత్మిక.. సేవా కార్యక్రమాలకే పరిమితమై.. వాటిని కంప్లీట్ చేసేశారు. ఇప్పుడు పొలిటికల్‌గా యాక్టివ్ అవుతారా? పార్టీ మారబోతున్నారా? ఎవరా నాయకుడు? 2019 తర్వాత రాజకీయాలకు దూరం..! రఘువీరారెడ్డి. రాజకీయాల గురించి కాస్త అవగాహన ఉన్న వారికి ఈ పేరు.. సుపరిచితమే. అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతానికి చెందిన ఆయన.. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో…
ఆ పదవుల భర్తీపై టీఆర్ఎస్ తేల్చుకోలేకపోతుందా..? ఒకసారి జిల్లా అధ్యక్షుల నియామకం చేయాలని.. మరోసారి జిల్లాకు కోఆర్డినేటర్ల నియామకం సరిపోతుందని ఎందుకు భావిస్తోంది? జిల్లాస్థాయిలో గులాబీపార్టీ ఎందుకు ఆచితూచి అడుగులు వేస్తోంది? అప్పట్లో జిల్లా అధ్యక్షుల నియామకంపై టీఆర్ఎస్లో చర్చ..! జెండా పండుగతోపాటు పార్టీ సంస్థగత నిర్మాణాన్ని మొదలు పెట్టింది టీఆర్ఎస్. గ్రామ, మండల, మున్సిపాలిటీలలో పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తయింది. పార్టీ నిర్మాణంలో భాగంగా జిల్లా అధ్యక్షులను నియమించాలని గులాబీ పెద్దలు అభిప్రాయపడ్డారు. గతంలోనే జిల్లాస్థాయిలో…
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉన్నా.. ఆ నియోజకవర్గంలో సీట్ ఫైట్ ఓ రేంజ్లో సాగుతోంది. అది కూడా ప్రతిపక్ష పార్టీలో…! ప్రత్యేకించి ఆ యువనేత వేస్తున్న పంచ్‌లు.. చేస్తున్న సవాళ్లు పొలిటికల్ హీట్ రాజుస్తున్నాయట. నియోజకవర్గం తన అడ్డా అని ఆ నాయకుడు చెప్పడం వెనక కారణం ఏంటి? కేడర్ ఒత్తిడితో ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్‌గా పరిటాల శ్రీరామ్ పేరు ప్రకటన..! ధర్మవరం. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో మార్మోగుతున్న పేరు. పొలిటికల్ కాంట్రవర్సీకి కేరాఫ్…
పార్టీ మారినప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు ఇక్కట్లు తప్పడం లేదా? లోకల్ లీడర్లతో పొసగడం లేదా? స్వపక్షంలోని విపక్షీయుల స్వరం పెరుగుతోందా? ఎవరా ఎమ్మెల్యే? ఏమా కథా? వాసుపల్లి వచ్చాక విశాఖ సౌత్ వైసీపీలో గ్రూపులు పెరిగాయా? వాసుపల్లి గణేష్‌కుమార్. వైసీపీ గాలిలోనూ విశాఖలో గెలిచిన నలుగురు టీడీపీలో ఎమ్మెల్యేలలో ఒకరు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో టీడీపీని వీడి వైసీపీకి జైకొట్టారు వాసుపల్లి. అయితే అప్పటి వరకు వైసీపీని నమ్ముకుని పనిచేస్తున్నవాళ్లకు ఎమ్మెల్యే ఎంట్రీ…
తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల సభకు కొందరు తమ్ముళ్లు సరిగా పనిచేయలేదా? అలాంటి నాయకులపై చంద్రబాబుకు నివేదిక చేరిందా? ఎవరి పనితీరుపై కేడర్ అసంతృప్తి వ్యక్తం చేసింది? పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కార్యక్రమానికి నాయకులు ఎందుకు టచ్ మీ నాట్‌గా ఉండిపోయారు? రైతుల సభను పట్టించుకోని టీడీపీ నేతలపై కేడర్ గుర్రు..! తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల సభను చాలా గ్రాండ్‌గా నిర్వహించాలని చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు చేసిన కసరత్తు అంతా ఇంతాకాదు. ఇటీవల…
కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు.. ఉద్యోగుల బదిలీలు ఉన్నాయా? తెలంగాణ సాధించుకున్నామన్న సంతోషం ఆవిరై.. కొత్త సమస్యను తలెకెక్కించుకున్నామనే భావనలో ఉద్యోగులు ఉన్నారా? ఇంతకీ కొత్త జోనల్ విధానం ఉద్యోగులకు వరమా.. శాపమా..? ఉద్యోగులకు అన్యాయం జరగకూడదన్న ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోవడం లేదా? తెలంగాణలో కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టుల విభజన కొందరికీ వరంగా, మరికొందరికి శాపంగా మారింది. ఇదే అదునుగా కొందరు అధికారులు పారదర్శకతకు పాతరేస్తూ అయిన వారిని అందలం ఎక్కిస్తున్నారనే ఆరోపణలు…
30 లక్షలు టార్గెట్. ఆ అంకె వినగానే గుండె గుభేల్ మన్నా.. సవాల్‌గా తీసుకుని టార్గెట్ చేరుకోవాలని అనుకున్నారు నాయకులు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి రివర్స్. చీమ కుట్టినట్టు అయినా లేదట. పార్టీ చేపట్టిన కార్యక్రమానికి ఊ అంటారో.. ఊహూ అంటారో కూడా తెలియని పరిస్థితి ఉందట. సభ్యత్వం నమోదు కోసమే 30 మందికి శిక్షణ..! కొత్త నాయకత్వం రాగానే సభలు.. సమావేశాలు అని ఊదరగొట్టిన తెలంగాణ పీసీసీకి 30 లక్షల సభ్యత్వం నమోదును లక్ష్యంగా పెట్టింది…
ఆ జిల్లాలో ఆయన కాకలు తీరిన రాజకీయ నేత. కానీ.. సార్‌కు మైనస్ మేడమే అని చర్చ ఉంది. తూకానికి సరితూగే వాళ్లకు మేడమ్ టిక్ పెడితే.. సార్ ఓకే చెప్పాలట. కుమారుడి తీరు కూడా ఆయనకు సన్‌స్ట్రోక్‌గా మారిందట. గతంలోనూ ఇలాంటి అనుభవాలతో పొలిటికల్‌గా దెబ్బతిన్నా.. ఆయన వైఖరిలో ఎందుకు మార్పు రాలేదు? ఎవరా నాయకుడు ? ఇంట్లో భార్యాబిడ్డల మాట కాదనలేకపోతున్న ప్రజాప్రతినిధి..! అద్భుతమైన వాక్ చాతుర్యం.. ఎవరినైనా కలుపుకొని వెళ్లే మనస్తత్వం సిక్కోలు…