కోవర్టులు.. అంతర్గత కుమ్ములాటలు.. సోషల్ మీడియా వేదికగా విమర్శలు. ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌లో వీటి డోస్ ఎక్కువే. పార్టీ చీలికలు.. పేలికలు అయిపోయింది. హస్తం పార్టీని బలోపేతం చేయాలనే సంగతి పక్కనపెట్టి.. టికెట్ కోసం ఒకరిపై ఒకరు కయ్యానికి కాలు దువ్వుతున్నారు నాయకులు. నేతల్లో సఖ్యత కరువు.. కేడర్ పక్కచూపులుమహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర అసెంబ్లీ సెగ్మెంట్లో హస్తం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. నాయకత్వ లేమి, నేతల వర్గపోరు, కోవర్టు రాజకీయాలు ఎక్కువయ్యాయి. పార్టీని ట్రాక్‌లో పెట్టడం…
అధికారపార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ నియోజకవర్గంలో ఆయన మాట చెల్లడం లేదట. ఒక అధికారి బదిలీ విషయంలో తల పట్టుకున్నట్టు ఒక్కటే గుసగుసలు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నా హ్యాండ్సప్ అనేశారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆయనకొచ్చిన సమస్యేంటి? లెట్స్ వాచ్..! వైరాలో ఎమ్మెల్యే మాట చెల్లుబాటు కావడం లేదా?నియోజకవర్గానికి ఎమ్మెల్యే సుప్రీం. ఇది అధికారపార్టీ టీఆర్ఎస్ మాట. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి.. ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకొన్న ఖమ్మం జిల్లా వైరా…
ఆ మంత్రికి సెబ్ సెగ గట్టిగానే తాకిందా? సెబ్ అధికారులు మంత్రిని పట్టించుకోవడం లేదా? అమాత్యులవారు చెప్పినా వినకుండా.. ఆయన అనుచరుడినే లోపల వేసేశారా? అందుకే ఆయన నిప్పులు చెరిగారా? ఎవరా మంత్రి? ఏమా కథ? సమీక్షా సమావేశంలో ‘సెబ్’ అధికారులపై మంత్రి ఫైర్మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రకాశం జిల్లాల్లో ఆయన చెప్పిందే వేదం.. శాసనం. అలాంటి మంత్రిని కూడా పట్టించుకోవడం లేదట ఓ ప్రభుత్వ విభాగం. అదే.. ఎక్సైజ్ శాఖ పరిధిలో పనిచేసే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్…
కరీంనగర్ జిల్లా బీజేపీలో ఇంకా ముసలం తొలిగిపోలేదా? వేములవాడలో కొత్త ఎత్తుగడలు మొదలయ్యాయా? బీజేపీలో అంతర్గతపోరు తీవ్రస్థాయికి చేరుకుందా? బండి సంజయ్‌ను వదల బొమ్మాళి అని వెంటాడుతోంది ఎవరు? ఉనికి కాపాడుకొనే పనిలో అసమ్మతి వాదులుకరీంనగర్ జిల్లా బీజేపీలో కొంతకాలంగా బండి సంజయ్, పార్టీలో సీనియర్లుగా చెప్పుకొంటున్నవారి మధ్య వార్ కొనసాగుతోంది. సంజయ్‌కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశాలను పార్టీ పెద్దలు సీరియస్‌గా పరిగణిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అసమ్మతి వాదులపై యాక్షన్ వద్దనుకున్నారో ఏమో.. అటు…
ఆ ప్రాంతంలో జిల్లా విభజనపై ఒక రేంజ్లో ఉద్యమం జరుగుతుంటే.. ఒక మంత్రి.. ప్రతిపక్షపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మాత్రం సైలెంట్ అయ్యారు. మొన్నటి వరకు మాకు ఓటేయండి.. మన ఊరిని జిల్లా కేంద్రం చేయిస్తామని హామీలు ఇచ్చిన నేతలు ఇప్పుడు నోరు మెదపడం లేదు. నేతలను కదిపితే నోకామెంట్ అంటున్నారట. ఆ ప్రాంత నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు? మున్సిపల్ ఎన్నికల్లో పెనుకొండే ప్రచార అస్త్రం అనంతలో జిల్లాల విభజనపై జరుగుతున్న రచ్చ అంతా ఇంతా…
నవ్వి పోవుదురుగాక నాకేంటి అనే చందాన ఉంది ఆ ఇద్దరు నేతల తీరు. చీకటి ఒప్పందం చేసుకుని కంకర కోసం కొండలు మాయం చేస్తున్నారట. ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టి సొంత ఖజానా నింపుకొంటున్నారట. వారెవరో.. ఏంటో.. లెట్స్ వాచ్..! ప్రశ్నించేవాళ్లు లేరు.. నేతలదే రాజ్యం కడప జిల్లా జమ్మలమడుగులో అక్రమ మైనింగ్ యధేచ్చగా జరుగుతోంది. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు.. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ఒప్పందం కుదిరిందట. దానిని ప్రశ్నించేవారే లేకపోవడంతో వాళ్లదే రాజ్యం.…
గుంటూరులో టీడీపీకి నాయకుల కొరత ఏర్పడిందా? అధికారంలో ఉన్నప్పుడు తామే మొనగాళ్లం అని చక్రం తిప్పిన నేతలు.. అధికారం పోగానే ముఖం చాటేశారా? నామ్ కే వాస్తేగా ద్వితీయశ్రేణి నాయకులతో టీడీపీ కాలం నెట్టుకొస్తోందా? ఇంఛార్జ్ నియామకంలో పార్టీ వైఫల్యం చెందుతోందా? తమ్ముళ్లకు రిప్లయ్ ఇచ్చేవాళ్లే లేరా? ఎప్పటి నుంచో ఉన్న బలమైన కేడర్ దూరంగుంటూరు జిల్లాలో టీడీపీ స్ట్రాంగ్‌గా ఉండే నియోజకవర్గాల్లో సిటీలోని పశ్చిమ సెగ్మెంట్ ఒకటి. దీంతోపాటు గుంటూరు నగరంలోనే ఉండే మరో నియోజకవర్గం…
ఉప్పు-నిప్పుగా ఉన్న ఆ ఇద్దరు నాయకులు ఆత్మీయంగా పలకరించుకున్నారు. గంటల తరబడి మాట్లాడేసుకున్నారు కూడా. ఇంతకీ వాళ్లేం మాట్లాడుకున్నారు? చర్చకు వచ్చిన అంశాలేంటి? పార్టీలో చాలా ఘర్షణల తర్వాత కలిసిన ఇద్దరు నాయకులు.. మనసులో మాట బయట పెట్టేసుకున్నారా? పార్టీ వ్యవహారాలపై ఏం మాట్లాడుకున్నారు?తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఒక సంచలనం. రెండున్నర గంటలకుపైగా జరిగిన భేటీలో ఇద్దరి మధ్య చర్చకు వచ్చిన అంశాలేంటనే ఆసక్తి పెరుగుతోంది.…
అసలే ఆళ్లగడ్డ. రాజకీయాలు ఓ రేంజ్లో ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్నాళ్లు పొలిటికల్ సందడి తగ్గినా.. ఒక్కసారిగా హైఓల్టేజ్..! పదునైన విమర్శలు.. సవాళ్లు..ఆరోపణలు ఆళ్లగడ్డను అట్టుడికిస్తున్నాయి. ఎందుకిలా? అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? రోడ్ల విస్తరణపై ఆళ్లగడ్డలో రాజకీయ సెగలుకర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ రాజకీయంగా కాక రేపుతోంది. భూమా, గంగుల కుటుంబాల మధ్య ఇప్పటికే రాజకీయంగా విభేదాలు భగ్గుమంటున్నాయి. రోడ్ల విస్తరణలో భాగంగా చేపట్టిన పనులు ఆ విభేదాలకు మరింత ఆజ్యం…