Off The Record: మిర్యాలగూడ కాంగ్రెస్‌లో చాలాకాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి వర్గీయులు పార్టీ కార్యాలయంలోనే ఘర్షణ పడ్డారు. పరస్పరం పోలీస్‌లకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇది అప్పటికప్పుడు క్షణికావేశంలో జరిగిన గొడవగా కార్యకర్తలు భావించడం లేదట. కొంత కాలంగా లక్ష్మారెడ్డి మిర్యాలగూడ టికెట్ లక్ష్యంగా పనిచేస్తున్నారు. తన సొంత ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ…
Off The Record: తెలంగాణలోని మెజార్టీ జిల్లాలకు ఈ మధ్యే కొత్త కలెక్టర్లను నియమించారు. కానీ హైదరాబాద్‌కు పూర్తిస్థాయి కలెక్టర్ రాలేదు. ఇప్పుడూ కలెక్టర్‌గా ఇంఛార్జ్‌నే వేశారు. మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్‌గా ఉన్న అమయ్ కుమార్‌కు హైదరాబాద్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. మొన్నటిదాకా అమయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్. తాజా బదిలీల్లోనైనా హైదరాబాద్‌కు పూర్తిస్తాయి కలెక్టర్‌ను నియమిస్తారని అనుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు మరో తొమ్మిది నెలలే ఉండటంతో రెండేళ్ల కంటే ఎక్కువుగా ఒకేచోట విధులు…
Off The Record: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా రాజకీయాలు వాడీవేడిగా మారుతున్నాయి. ఇది గిరిజనులకు రిజర్వ్ చేసినా నియోజకవర్గమైనప్పటికీ సాధారణ సెగ్మెంట్‌కు మించిన పొలిటికల్ ఎత్తులు నడుస్తున్నాయి. వైరాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనుచరులు ఎక్కువే. గత కొన్నిఎన్నికల్లో ఆయన చెప్పినవారే ఎమ్మెల్యేలుగా గెలుస్తుండటంతో.. ఆ విజయాన్ని పొంగులేటి ఖాతాలో వేసేవారు కనిపిస్తున్నారు. ప్రస్తుతం అధికారపార్టీలో రెబల్‌గా మారిపోయారు పొంగులేటి. ఆయన అనుచరులు సైతం ఒక్కొక్కరుగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈ క్రమంలో వైరాలోని…
Off The Record: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుకు జరిగబోయే పోటీ ఆసక్తి రేకెత్తిస్తోంది. సిట్టింగ్ సభ్యుడు పీవీఎన్ మాధవ్ పదవీ కాలం వచ్చే నెలలో ముగుస్తోంది. ఇక్కడ ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై.. ఓటర్ల నమోదు జరిగింది. ఉత్తరాంధ్రలో శాసనమండలి ఎన్నికలను బలనిరూపణకు కీలకంగా భావిస్తున్నాయి ప్రధాన పార్టీలు. తొలిసారి టీడీపీ, వైసీపీ ఎక్కువ ఫోకస్ పెట్టడంతో అనేక అంచనాలు నెలకొన్నాయి. అందరికంటే…
Off The Record: నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ తర్వాత వివిధ జిల్లాల్లో వైసీపీ నేతల పనితీరుపై స్థానికంగా ఎక్కడికక్కడ చర్చ జరుగుతోంది. పైకి చెప్పేదొకటి.. తెరవెనుక మరొకటి చేస్తున్న నేతల గురించి టాక్ నడుస్తోంది. ఇదే తరహాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై ఫోకస్ నెలకొంది. గత ఎన్నికల్లో బిగ్ షాటైన దేవినేని ఉమా మహేశ్వరరావును ఓడించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు మైలవరం ఎమ్మెల్యే వసంత. ఇప్పుడు ఆయన తీరు…
Off The Record: డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కీలక నియోజకవర్గం కొత్తపేట. ఇక్కడ తెలుగుదేశం, జనసేన పార్టీలకు సొంత అన్నదమ్ములే ఇంఛార్జీలు. వారే మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందం.. బండారు శ్రీనివాస్. ఇద్దరికీ అస్సలు పడటం లేదు. ఒక చిన్న వివాదం అపోహలతో పెరిగి పెద్దదై పరస్పరం పోటీకి దిగే స్థాయికి చేరింది. 2019 ఎన్నికల్లో ఇద్దరూ అదే చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి సత్యానందం.. జనసేన నుంచి శ్రీనివాసరావు బరిలో ఉండాలని చూస్తున్నారు.…
Off The Record: నోముల భగత్.. ఎంసీ కోటిరెడ్డి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన నాయకులు. ఇద్దరూ కలిసి ఉన్నట్టు కనిపించినా.. చాలా విషయాల్లో ఇద్దరి మధ్య చాలా గ్యాప్ ఉంది. సీనియర్ రాజకీయ వేత్త నోముల నర్సింహయ్య 2018లో నాగార్జున సాగర్ నుంచి అధికారపార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన హఠాన్మరణంతో వచ్చిన ఉపఎన్నికల్లో నర్సింహయ్య కుమారుడు భగత్ ఎమ్మెల్యేగా గెలిచారు. వాస్తవానికి ఉపఎన్నికలోనే ఎంసీ కోటిరెడ్డి టికెట్ ఆశించారు. కానీ.. పార్టీ పెద్దల…
Off The Record: యాత్ర… ఫర్ ది చేంజ్.. అంటూ రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టారు. మేడారం సమ్మక్క సారలమ్మ నుండి యాత్ర మొదలైంది. హాత్ సే హాత్ జొడో యాత్ర పేరుతో… ఐదు నెలలపాటు తిరగాలని స్కెచ్ వేశారు రేవంత్. దీనికి కొందరు సీనియర్లు అభ్యంతరం తెలిపారు. హాత్ సే హాత్ జోడో కాన్సెప్ట్ వేరు.. రేవంత్ యాత్ర వేరు అని AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రే ముందే చెప్పేశారు AICC కార్యక్రమాల…
Off The Record: అసమ్మతి.. అసంతృప్తి…! ప్రస్తుతం తెలంగాణలో ఒక మున్సిపాలిటీ నుంచి మరో మున్సిపాలిటీకి పాకుతున్న రాజకీయ అలజడి. పదవులపై ఆశ కలుగుతుందో లేక ఎమ్మెల్యేలు, మంత్రులపై ఉన్న ఆగ్రహమో కానీ.. మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి నుంచి నగర పంచాయితీల వరకు ఒకే సీన్ కనిపిస్తోంది. మొదట్లో రాజధానికి ఆనుకుని ఉన్న కొన్ని పురపాలికల్లో బీజంపడ్డ అసమ్మతి ఇప్పుడు అన్ని జిల్లాల్లోనూ అధికాపార్టీలో కంపనాలు తీసుకొస్తోంది. అధిష్ఠానం వారిస్తున్నా.. ఎమ్మెల్యేలు బుజ్జగిస్తున్నా స్థానిక సంస్థల్లోని ప్రజాప్రతినిధులు…
Off The Record: ఇదీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేటెస్ట్ స్టేట్మెంట్. ఇప్పటి వరకు జనసేనతోనే ఉన్నాం… జనసేనతోనే ఉంటాం.. జనసేనా కూడా మాతోనే ఉంటుందన్న సోము మాట మారిపోతోంది. ఒక రోజు కాదు… ఒకసారి కాదు… రోజూ అదే మాట.. అదే తీరు. జనసేనాని ఏమన్నా…. ఏం చెప్పినా…. చివరికి మాతోనే ఉంటారనే ధీమాతో ఉండేది ఏపీ బీజేపీ. అంతేకాదు నేతల మాటల్లో కూడా అది స్పష్టంగా కనిపించేది. కానీ ఓటు చీలనివ్వనని…