ఇదే అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గం. కోఆపరేటివ్ సొసైటీలకు ఎన్నికలు లేకపోవడంతో వేస్తున్న త్రిసభ్య కమిటీలు ఇక్కడ అధికార వైసీపీ ప్రజాప్రతినిధికి కాసులు కురిపిస్తున్నాయట. ఇందుకోసం అధికారులపై తీవ్రస్థాయిలో ఆ నేత ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. అంతేకాదు.. త్రిసభ్య కమిటీలో చోటు కల్పించేందుకు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. త్రిసభ్య కమిటీలో ఒకరిని ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకునేందుకు కూడా చెయ్యి తడపాల్సిందేనట. ఈ అంశంపై నియోజకవర్గంలో ఓ రేంజ్లో చర్చ జరుగుతోంది. Read Also:…
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల బిజీలో పడింది. సమయం దగ్గర పడుతుండటంతో.. పార్టీని సమరానికి సిద్ధం చేసే పనిలో పడ్డారు నాయకులు. ఎన్నికల కోసమే కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్‌లకు వ్యూహకర్తగా ఉన్నారు సునీల్ కనుగోలు. అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహన్ని ఆయన పార్టీకి అందజేశారట. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు.. పార్టీ బలాబలాలు తదితర అంశాలపై నేరుగా కాంగ్రెస్ హైకమాండ్‌కే ఆయన రిపోర్ట్ ఇచ్చారట. తెలంగాణలో కాంగ్రెస్ బలంగానే ఉందని ఆయన తన నివేదికలో ప్రస్తావించినట్టు సమాచారం. ఈ…
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పారు. 1994, 1999లో నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే. ప్రస్తుతం బీజేపీ నాయకుడు. సొంత పార్టీని విమర్శించకుండానే సంగమేశ్వరం వద్ద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఐకానిక్ వంతెనను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేపట్టబోతున్నారు. అక్కడ బ్రిడ్జి కం బ్యారేజి నిర్మించాలనేది ఆయన డిమాండ్. ఈ ఉద్యమం వెనుక కండువా మార్చే ఎత్తుగడ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీకి గుడ్‌బై చెప్పి తిరిగి టీడీపీలోకి వెళ్లే అవకాశాలు…
కొంత కాలంగా గవర్నర్, తెలంగాణ సర్కార్ మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఈ దూరం కారణంగా బడ్జెట్ ఆమోదించలేదని హైకోర్టు తలుపు తట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పరిణామాల్లో వచ్చిన మార్పుతో గవర్నర్, రాష్ట్ర సర్కార్ మధ్య సయోధ్య కుదిరింది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గవర్నర్ తమిళిసై తీరుపై అధికార BRS పార్టీ నాయకులు కొంతకాలంగా భగ్గుమంటున్నారు. రాజ్‌భవన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సీన్ మారడంతో గవర్నర్ విషయంలో అధికారపార్టీ నేతల…
Off The Record: నెల్లూరు జిల్లా వైసీపీలో రేగిన అలజడి ప్రతి జిల్లాలోనూ ఉందనేది టీడీపీకి ఉన్న సమచారం. ఆ విషయం తెలిసినప్పటి నుంచి టీడీపీ నాయకులు.. కేడర్‌లో కలవరం మొదలైంది. నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరు ముగ్గురు వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి..ఆనం రామనారాయణరెడ్డి కండువా మార్చే సూచనలు ఉన్నాయి. ఇదే జిల్లాలో మరో కీలక నేత కూడా టీడీపీలోకి జంప్ చేయడానికి సిద్దంగా ఉన్నారనే…
Off The Record: నిన్నటి వరకు కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారం ఏపీ బీజేపీలో హాట్ టాపిక్. బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన శివప్రకాష్‌తో కన్నా భేటీ తర్వాత ఆ జోరు చాలా వరకు తగ్గిందని ఊపిరి పీల్చుకుంది ఏపీ శాఖ. ఇప్పుడు కొత్త అంశం దుమారం రేపుతోంది. ఆ మధ్య జాతీయ కార్యవర్గ సమావేశాలకు సోము వీర్రాజు ఢిల్లీ వెళ్లారు. హస్తిన చేరుకోగానే సోము వీర్రాజు తీవ్ర అస్వస్థతకు లోనై.. ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని సోషల్…
Off The Record: కాకినాడ రూరల్ నియోజకవర్గానికి టీడీపీకి ఇన్చార్జి లేరు. ప్రస్తుతం ఉన్న నేతల్లో ఎవరికీ టిక్కు పెట్టడం లేదు అధిష్ఠానం. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన విభేదాల వల్ల పిల్లి ఫ్యామిలీ టీడీపీకి దూరంగా ఉంది. పార్టీ అధినేత జిల్లాకు వచ్చినా కనీసం అటువైపు కూడా చూడలేదు కానీ.. తర్వాత టీడీపీ అధినేతను కలిసి మళ్లీ రూరల్ నియోజకవర్గంలో పిల్లి కుటుంబం తళుక్కుమంది. మాజీ ఎమ్మెల్యేకే ఇంఛార్జ్‌గా పగ్గాలు ఇస్తారని భావించినా.. టీడీపీ…
Off The Record: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా.. తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి గెలిచారు బండి సంజయ్. ఆపై సమీకరణాలు కలిసొచ్చి.. ఏకంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడయ్యారు. బీజేపీ అగ్రనాయకత్వం కూడా సంజయ్‌ను ప్రోత్సహిస్తూ వస్తోంది. ప్రస్తుత కమలనాధుల దృష్టంతా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఉంది. ఇదే సమయంలో కీలక నాయకులు అసెంబ్లీకి పోటీ చేసే స్థానాలపైనా కాషాయ శిబిరంలో చర్చ సాగుతోంది. ఆ క్రమంలోనే బండి సంజయ్ అసెంబ్లీకి ఎక్కడ నుంచి…
Off The Record: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలలో మెచ్చా నాగేశ్వరరావు ఒకరు. అశ్వారావుపేటలో సైకిల్ గుర్తుపై గెలిచినా తర్వాత కండువా మార్చేశారు. అధికారపార్టీకి జైకొట్టారు మెచ్చా. ఆయన గులాబీ కండువా కప్పుకొన్నప్పటికీ నియోజకవర్గంలో పార్టీ కేడర్ మింగిల్ కాలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేకు కొత్త సమస్య సవాల్ విసురుతోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసమ్మతి బాట పట్టడంతో ఆ ప్రభావం అశ్వారాపుపేటలోనూ కనిపిస్తోంది. ఎమ్మెల్యే మెచ్చా…
Off The Record: విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. 2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన ఆశించిన పదవులు దక్కలేదు. దీంతో కోటంరెడ్డిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పలు సందర్భాలలో తనలోని అసంతృప్తిని వ్యక్తం చేశారు కూడా. నెల్లూరు జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభించినప్పటి నుంచీ ఆయన వెన్నంటి నిలిచినా తనకు గుర్తింపు లేదని పలుమార్లు పార్టీ నేతలు,…