Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Jc Brothers Route Changed

Off The Record: ఆ బదర్స్ రూటు మార్చారా?

NTV Telugu Twitter
Published Date :March 31, 2023 , 10:07 pm
By NTV WebDesk
Off The Record: ఆ బదర్స్ రూటు మార్చారా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

అనంతపురం జిల్లాలో… ప్రత్యేకించి తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌ రూట్‌ మార్చారా? బండి ఎప్పుడూ టాప్‌ గేర్‌లోనే ఉండాలనుకుంటే.. రూట్‌ బాగోక జర్క్‌లొస్తున్నాయ్‌… కాస్త మార్చి చూద్దామనుకున్నారా? ఎప్పుడూ ఏదో ఒక విషయం మీద రచ్చ చేస్తూ కూర్చుంటే… పబ్లిసిటీ పీక్స్‌లో వచ్చినా…. లోకల్‌గా మేటర్‌ వీక్‌ అవుతోందని గ్రహించారా? ఎక్కడ తేడా కొట్టింది? ఈ మార్పునకు కారణాలేంటి? మరీ ముఖ్యంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫోకస్‌ ఎందుకు మారింది?

నో.. రెచ్చగొట్టడం, రెచ్చిపోవడాలు
మేం ట్రెండ్ సెట్‌ చేస్తాం తప్ప… ఫాలో కాము. … ఇదీ… జేసీ బ్రదర్స్‌ తమ పనుల ద్వారా బయటి ప్రపంచానికి చెప్పే మాట. అందులోనూ దివాకర్‌రెడ్డి కంటే ప్రభాకర్‌రెడ్డికి ఇంకా దూకుడు ఎక్కువ. అవతలోడు ఎవడైతే నాకేంటి అన్న రీతిలో ఉంటాయి ఆయన చర్యలు. అయితే… జగన్‌ సర్కార్‌ వచ్చాక ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. అయినా వైఖరి మాత్రం మారలేదు. తాడిపత్రిలో దశాబ్దాలుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అంతకుముందు జేసీ ఫ్యామిలీ ఆధిపత్యమే నడిచినా….2019 ఎన్నికల తరువాత పెద్దారెడ్డి పట్టుబిగించారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నియోజకవర్గంలో జరిగే పనుల విషయంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి – మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య అభిప్రాయ భేదాలు తీవ్రం అయ్యాయి. దీంతో నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు టెన్షన్‌ వాతావరణం నెలకొంటోంది. ఎమ్మెల్యేను ఉద్దేశించి ప్రభాకర్‌రెడ్డి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేయడం.. దాని మీద రచ్చ కావడం సర్వ సాధారణమైపోయింది. కానీ… ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఏమనుకున్నారో ఏమో రూట్‌ మార్చారు. ఎప్పుడూ ఎదుటి వాళ్ళని తిడుతూ కూర్చుంటే… మనకు వచ్చేదేంటన్న రియలైజేషన్‌ వచ్చిందో ఏమో కానీ… ఆయన తాత్కాలికంగా తిట్ల దండకానికి బ్రేక్‌ ఇచ్చారు. సాధారణంగా జేసీ బ్రదర్స్‌ ఎప్పుడూ జనంలోనే ఉంటారు. కానీ… ఇప్పుడు ఇంకాస్త డోస్‌ పెంచారు ప్రభాకర్‌రెడ్డి.

ప్రజా సమస్యల మీదే ప్రభాకర్‌రెడ్డి ఫోకస్‌

ప్రత్యర్థి మీద రాజకీయ సవాళ్ళు, ప్రతి సవాళ్ళను పక్కనపెట్టి నియోజకవర్గంలోని సమస్యల మీద మాత్రమే స్పందిస్తున్నారు ప్రభాకర్‌రెడ్డి. ఎక్కడెక్కడ ఏయే సమస్యలున్నాయి? వాటికి పరిష్కారం ఎలాగన్న విషయాలను అనుచరులు, కార్యకర్తల మధ్య కూర్చుని చర్చిస్తున్నారు. తరచూ అందర్నీ కలుస్తూ… వాళ్ళలో ఒకడిగా మారిపోతున్నారు తప్ప ఎమ్మెల్యే మీద ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లేదు. అదే టైంలో విచిత్రంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ స్టెల్లోకి వచ్చారు. ప్రస్తుతం పాదయాత్రల పేరుతో జనం మధ్యకు వెళ్తున్నారు ఎమ్మెల్యే. ఇప్పటికే పెద్దవడుగూరు, పెద్దపప్పూరు మండలాల్లో పాదయాత్ర ముగించారు. అక్కడ ఆయన మాట్లాడే మాటలు హీట్‌ పెంచేస్తున్నాయి. ఇంకాస్త ఎక్కువైతే మొదటికే మోసం తెచ్చేలా ఉన్నాయన్నది లోకల్‌ వైసీపీ టాక్‌.

ఎవరెన్ని మాట్లాడినా మౌనంగానే ప్రభాకర్‌రెడ్డి
జనం మధ్యకు వెళ్తున్న ఎమ్మెల్యే ప్రజల సమస్యలు వినకుండా… జేసీ ప్రభాకర్ రెడ్డిని దూషించేందుకు ఎక్కువ టైం కేటాయిస్తున్నారన్న చర్చ ప్రజల్లో జరుగుతోంది. దీనికి తోడు ఎమ్మెల్యే వెంట వచ్చిన ఇతర నేతలు సైతం మాజీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇంత మంది ఎన్ని మాట్లాడినా.. జేసీ మౌనంగా ఉండటం మాత్రం ఆశ్చర్యంగా ఉందంటున్నారు స్థానికంగా గమనిస్తున్నవారు. ప్రత్యర్థి ఎవరైనా చిన్న మాట అంటేనే తోకతొక్కిన తాచులా విరుచుకపడే జేసీ… ఇంత కూల్‌గా ఎందుకు ఉంటున్నారనేది అందరి మెదళ్ళను తొలుస్తున్న ప్రశ్న. తన ప్రత్యర్థులు ఎంత తిట్టినా.. ఆయన మాత్రం నో మేటర్‌ అన్నట్టుగా కనిపిస్తున్నారు. అంతే కాదు.. నియోజకవర్గంలో గతంలో మాదిరి నిరసనలు తెలియజేసే ప్రయత్నం ఎక్కడా కనిపించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల సమయంలో మాత్రం సీఎం జగన్ పై విమర్శలు చేసిన ప్రభాకర్‌రెడ్డి తర్వాత సైలెంటైపోయారు.

జేసీ ప్రభాకర్‌రెడ్డిలో ఉన్నట్టుండి ఈ మార్పు ఎందుకు వచ్చిందన్న చర్చ ఇప్పుడు తాడిపత్రి పొలిటికల్‌ సర్కిల్స్‌లో జరుగుతోంది. ఇది దేనికి సంకేతమని మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో గతానికి భిన్నంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి దూషణల పర్వానికి తెరలేపడాన్ని కొత్తగా చూస్తున్నారు నియోజకవర్గ ప్రజలు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • chandrababu
  • cm jagan
  • JC brothers
  • off the record

తాజావార్తలు

  • Deputy CM Pawan Kalyan: ఆ గిరిజనుల రహదారి సమస్య పరిష్కారం.. ఫొటోలు షేర్‌ చేసిన పవన్‌ కల్యాణ్‌..

  • Kidney Racket: కిడ్నీ రాకెట్ మాఫియాలో విస్తుపోయే అంశాలు.. భారత్‌లో కిడ్నీ దందా నడిపిన శ్రీలంక వాసి..!

  • Sanjay Raut: పహల్గామ్ ఉగ్రవాదులు బీజేపీలో చేరొచ్చు.. అందుకే పట్టుకోవడం లేదు

  • Hamas-US: కాల్పుల విరమణపై అమెరికా చర్చలు.. హమాస్ తిరస్కరణ

  • Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

ట్రెండింగ్‌

  • Moto g86 Series: మోటొరోలా నుంచి మోటో G86 పవర్ 5G, మోటో G86 5G, మోటో G56 5G మూడు కొత్త 5G ఫోన్లు లాంచ్…!

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions