Off The Record: కడప.. సీఎం సొంత జిల్లా.. YSR కుటుంబానికి కంచుకోట. పులివెందుల తర్వాత వైఎస్ ప్యామిలీ ప్రభావం బలంగా ఉన్న నియోజకవర్గంలో రెండు దశాబ్దాలుగా ముస్లిం సామాజికవర్గానికి చెందిన వారే గెలుస్తూ వస్తున్నారు. కేవలం కడప ఎమ్మెల్యే అని అనిపించుకోవడమే కాదు.. అమాత్య పదవులు చేపట్టి ఓ రేంజ్‌కి వెళ్లిపోయారు. వరుసగా రెండు పర్యాయాలు గెలిచిన నాయకులు కనిపిస్తారు. 1955, 1967 ప్రాంతాల్లో ఎం.రహంతుల్లా గెలిస్తే.. తర్వాత రెడ్డి సామాజికవర్గ నాయకులు 1972 నుంచి…
Off The Record: పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతుంది. ములుగు నియోజకవర్గం తర్వాత… నర్సంపేట సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇవ్వాలి. ఆ తరువాత మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి యాత్ర వెళ్తుంది. ఇది ముందుగా అనుకున్న షెడ్యూల్‌గా చెబుతున్నారు. ములుగులో యాత్ర మొదలయ్యాక ఎక్కడా బ్రేకులు లేకుండా సాఫీగా సాగిపోతుందని రేవంత్‌రెడ్డి కూడా భావించారట. అయితే ములుగులో యాత్ర పూర్తి కాగానే నర్సంపేట వెళ్లకుండా మహబూబాబాద్ నియోజకవర్గంలోకి ఎంటరైంది. దీంతో నర్సంపేటను…
Off The Record: వచ్చే ఎన్నికల్లో BRS, లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని మునుగోడు బైఎలక్షన్ తర్వాత చర్చ ఊపందుకుంది. ఉభయ పక్షాల నుంచి ఈ దిశగా ప్రకటనలు వచ్చాయి.. మాటలు కలిశాయి. అయితే తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలు కలిసి పనిచేస్తాయా? అని ఆరా తీస్తున్నారు. తాజాగా వామపక్ష శిబిరాల నుంచి వస్తున్న స్టేట్మెంట్లతో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. పొత్తులో ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారని ఇన్నాళ్లూ…
Off The Record: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు. సొంత పార్టీ నేతలతోనే ఎమ్మెల్యేకు పడటం లేదు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే నేనే రాజు.. నేనే మంత్రి అంటూ వ్యవహరిస్తున్నారనేది వైసీపీ ద్వితీయశ్రేణి నేతల ఆరోపణ. గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్‌బాబు గత ఎన్నికల సమయంలో సంతనూతలపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మొదట్లో అంతా బాగానే ఉన్నా తర్వాత సొంత పార్టీ నేతలతో గ్యాప్ వచ్చింది. తమకు ఓ మాట కూడా చెప్పకుండా ఎమ్మెల్యే ఇష్టారీతిన…
Off The Record: తెలంగాణ అసెంబ్లీలో మొన్నటి వరకు బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఉన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. వివాదాస్పద వ్యాఖ్యల ఘటనలో రాజాసింగ్‌ను బీజేపీ సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో చెప్పాలని నోటీసు కూడా ఇచ్చింది. ఇది జరిగి నెలలు గడుస్తున్నా.. రాజాసింగ్ జైలు నుంచి బయటకొచ్చి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నా.. బీజేపీ నాయకత్వం స్పందించలేదు. సస్పెన్షన్ ఎత్తేస్తారని ప్రచారం జరిగినా అది ప్రచారంగానే మిగిలిపోయింది. రాజసింగ్ సస్పెన్షన్‌పై నిర్ణయం తీసుకోకపోగా.. ఆయన…
Off The Record: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యారు. సిట్టింగ్ ఎంపీగానే ఉన్నప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఓపిగా ఉన్న ఆయన బీఆర్ఎస్ను వదిలేయాలని డిసైడ్ అయ్యారు. పొంగు లేటి వర్గాన్ని బీఆర్ఎస్ సస్పెండ్ చేస్తోంది. దమ్ముంటే తనపై వేటు వేయాలని మాజీ ఎంపీ అధికారపార్టీని సవాల్ చేస్తున్నారు. ఆయన నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు. ఇల్లెందు, అశ్వారరావుపేట, వైరా అభ్యర్థులను ప్రకటించేశారు. అయితే, పొంగులేటి ఏ పార్టీలోకి వెళ్తారనే…
Off The Record: శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్ మంత్రి ధర్మాన ప్రసాదరావు. సమస్య ఏదైనా.. సందర్భం ఎలాంటిదైనా.. బహిరంగ సభైనా.. అసెంబ్లీలోనైనా ధర్మాన ప్రసంగం ఒబ్బిడిగా.. సోది లేకుండా ఉంటుంది. ఈ విషయంలో విమర్శకుల ప్రశంసలు సైతం ధర్మానకే. ఆహార్యంలోనే కాదు.. మాటలోనూ గాంభీర్యానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ప్రసాదరావు ఇప్పుడు ప్రసంగాల్లో హుందాతనం కోల్పోతున్నారనే చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో ఆయన చేస్తున్న కామెంట్స్.. వరుసగా సంచలనం రేకెత్తిస్తున్నాయి. ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రం…
Off The Record: గ్రంధి శ్రీనివాస్. భీమవరం ఎమ్మెల్యే. రాష్ట్రం దృష్టిని ఆకర్షించేలా గత ఎన్నికల్లో నెంబర్ వన్ విజయాన్ని సాధించినా గుర్తింపు విషయంలో ఆయన స్థానం ఎన్నో నెంబరో అర్ధం కావడం లేదట. రెండుసార్లూ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఆ విషయంలో అసంతృప్తి లేకపోయినా జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆయన్ని ఆవేదనకు లోను చేస్తున్నాయట. అధినేతని ఒప్పించి.. జనాన్ని మెప్పించినా రావాల్సిన గుర్తింపు ఇంకా దక్కలేదని గ్రంధి అనుచరుల్లోనూ అసంతృప్తి ఉందట. గ్రంధికి ప్రాధాన్యం లేకపోవడం…
Off The Record: MIM హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన పార్టీగా ఇన్నాళ్లు గుర్తింపు ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పోటీ చేయకపోయినా నాలుగైదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టింది. మహారాష్ట్ర, యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఉనికి చాటుకుంది. ఇప్పుడు టిఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణలోని మిగిలిన నియోజకవర్గాలపై ఎంఐఎం దృష్టిపెట్టింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్-ఎంఐఎం వాగ్వాదంలో తాము ఈసారి కనీసం 50 సీట్లలో పోటీ చేస్తామని…
Off The Record: కడప పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడిగా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎం. లింగారెడ్డి ఉన్నారు. వచ్చే మార్చి నాటికి ఆయన జిల్లా అధ్యక్ష పదవి చేపట్టి రెండేళ్లు పూర్తవుతుంది. 2024లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో పార్టీ జిల్లా పగ్గాలు మరొకరికి ఇవ్వాలనే ఆలోచనలో టీడీపీ అధిష్ఠానం ఉందట. అయితే ఎవరిని ఆ హాట్ సీటులో కూర్చోబెట్టాలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారట. నియోజకవర్గాల వారీగా ఇంఛార్జుల నుంచి అభిప్రాయ సేకరణ చేసిన సమయంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం…