Off The Record: వాళ్ళిద్దరూ కలిసి నడుస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నియోజకవర్గాల్లో దూకుడు పెంచుతోంది అధికారపార్టీ బీఆర్‌ఎస్. ఎమ్మెల్యేలు, ఇంఛార్జులతో ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తోంది. ఈ విషయంలో ఊరందరిదీ ఓ దారైతే.. ఉలిపికట్టుది మరోదారి అన్నట్టుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓ నియోజకవర్గ నేతల తీరు ఉంది. ఆ సెగ్మెంట్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
Also Read
కుత్బుల్లాపూర్‌లో ఆత్మీయ సమ్మేళనాల సందడి లేదా?
కుత్భుల్లాపూర్. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఆసక్తికర చర్చ జరుగుతున్న నియోజకవర్గం. ఇక్కడి ఎమ్మెల్యే అధికారపార్టీకి చెందిన వివేకానందగౌడ్. గులాబీ శిబిరంలో కుత్భుల్లాపూర్‌లో చర్చకు కారణం.. ఇక్కడ ఆత్మీయ సమ్మేళనాలు జోరందుకోకపోవడమే. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆత్మీయ సమ్మేళనాలకు ప్రాధాన్యం ఇస్తోంది అధిష్ఠానం. ఈ సమ్మేళనాల విజయవంతానికి జిల్లాల వారీగా ఇంఛార్జులను కూడా నియమించారు పార్టీ పెద్దలు. ఎక్కడైనా సమస్యలు తలెత్తినా.. పార్టీ పెద్దల మధ్య తగువులు గుర్తించినా.. జిల్లా ఇంఛార్జులు ఎక్కడికక్కడ సరిచేస్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణులు ఉత్సాహంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తుంటే.. కుత్బుల్లాపూర్‌లో ఆశించినంత సందడి లేదు. దీనికి కారణం నియోజకవర్గంలో నెలకొన్న ఆధిపత్యపోరేనని తెలుస్తోంది.
ఆచితూచి అడుగులు వేస్తోన్న ఎమ్మెల్యే వివేక్
మేడ్చల్ జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే వివేకానంద ఆత్మీయ సమ్మేళనాలపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా MLC శంభీపూర్ రాజు ఉన్నారు. వీరిద్దరికీ కొంతకాలంగా పొసగడం లేదు. నియోజకవర్గంలో భిన్న ధృవాలుగా మారిపోయారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒకే ఒక్క ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తే దానికి జిల్లా అధ్యక్షుడి హోదాలో శంభీపూర్ రాజు వెళ్లారు. కానీ.. ఆ సమావేశానికి ఎమ్మెల్సీ వర్గానికి చెందిన లోకల్ లీడర్స్ రాలేదు. మీటింగ్‌కు రావాలని వాళ్లకు ఎమ్మెల్యే వివేక్ నుంచి పిలుపు లేకపోవడంతో వెళ్లలేదని కొందరి వాదన. అయితే జిల్లా అధ్యక్షుడి హోదాలో ఉన్న ఎమ్మెల్సీనే తన వర్గాన్ని సమావేశానికి తీసుకురావాలని వివేక్ శిబిరం చెబుతోంది.
సీటు విషయంలో వివేక్, శంభీపూర్‌రాజు మధ్య తగువు
కుత్బుల్లాపూర్ సీటు విషయంలో వివేక్, శంభీపూర్‌రాజుల మధ్య తగువు నెలకొంది. ఈ సీటును శంభీపూర్‌రాజు కూడా ఆశిస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకే ఇవ్వాలనేది వివేక్ డిమాండ్. సిట్టింగ్‌లకే టికెట్స్ అని అధిష్ఠానం చెప్పడంతో చాలా ధీమాగా ఉన్నారు వివేక్. కానీ.. ఎమ్మెల్సీ వర్గం నుంచి ఎదురవుతున్న సవాళ్లతో కినుక వహించారు. ఇదే సమయంలో ఆత్మలు కలవడం లేదన్న ఎమ్మెల్యే కామెంట్సూ చర్చకు కారణం అవుతున్నాయి. కుత్బుల్లాపూర్ సమస్య పార్టీ పెద్దల దృష్టిలో ఉన్నప్పటికీ.. అక్కడి నుంచి దిద్దుబాటు చర్యలు లేవనే అభిప్రాయంలో పార్టీ వర్గాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆత్మీయ సమ్మేళనాల విషయంలో ఎమ్మెల్యే వివేక్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. కాకపోతే అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ పరిణామాలపై పార్టీ ఏం చేస్తుంది? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కలిసి సాగుతారా లేదా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
తాజావార్తలు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!