Off The Record: విలక్షణ తీర్పులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నియోజకవర్గం తాడేపల్లిగూడెంలో రాజకీయం ఆసక్తిగా మారుతోంది. పొత్తు ఉంటుందో లేదో తేలక టీడీపీ, జనసేన ఆశావహుల మధ్య కోల్డ్‌వార్ పీక్స్‌కు చేరింది. పొత్తు పొడిస్తే పోటీలో ఉండేది ఎవరు? పొత్తు లేకుండా గెలిచేది ఎవరనే లెక్కలేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఐదు పార్టీలు గెలిచాయి. టీడీపీ నాలుగుసార్లు.. కాంగ్రెస్, ప్రజారాజ్యం, బీజేపీ, వైసీపీలో ఒక్కోసారి ఈ సీటును తమ ఖాతాలో వేసుకున్నాయి. 1999…
Off The Record: ఇటీవల పార్టీ సమావేశంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పనిచేస్తున్న కలెక్టర్లను ఉద్దేశించి ఆయన ఈ మాటలు అన్నారు. కేవలం ఏదో ఆరోపణలు.. విమర్శలకు పరిమితం కాకుండా.. ఆ IAS అధికారులపై ఫిర్యాదు చేస్తామని.. వారు చేస్తున్న అక్రమాలను ఆధారాలతో సహా బయట పెడతామని సంజయ్ చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన ఆరోపణలు ఎలా ఉన్నా.. అసలు సంజయ్‌కు వారిపై సమాచారం…
Off The Record: టెక్కలి. అధికార వైసీపీ దృష్టి సారించిన కీలక నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. కానీ.. టెక్కలి వైసీపీలో మూడు గ్రూపులు. నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌ను ఎమ్మెల్సీని చేసి అందరినీ కలుపుకొని వెళ్లాలని చెప్పినా.. గ్రౌండ్లో పరిణామాలు మరోలా ఉన్నాయని పార్టీ వర్గాల మాట. అధినేత తిలకం దిద్దినా.. దువ్వాడ సరిగా కుదురుకోలేకపోతున్నారట. ఇంటా బయటా రాజకీయాల్లో గెలవలేకపోతున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టెక్కలిలో వైసీపీ జెండా ఎగరేయాలనేది…
Off The Record: తెలంగాణలో బలపడాలనేది బీజేపీ ఆలోచన. తద్వారా ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాలని ఆశిస్తున్నారు. చేరికలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కమిటీని వేశారు. కానీ.. చేరికల విషయంలో కమలనాథులు ఆశించినట్టుగా అడుగులు పడటం లేదు. గతంలో చేరిన వాళ్లే కొందరు బీజేపీని వీడి వెళ్లిపోయారు. కొత్తగా ఎవరైనా వస్తానంటే వాళ్లను అడ్డుకునే పరిస్థితి ఉండటంతో కేడర్ విస్మయం చెందుతోంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత సోదరుడు బీజేపీలో చేరాలని అనుకుంటే.. ఆఖరి నిమిషంలో ఆయన చేరికను…
Off The Record: కడప.. సీఎం సొంత జిల్లా.. YSR కుటుంబానికి కంచుకోట. పులివెందుల తర్వాత వైఎస్ ప్యామిలీ ప్రభావం బలంగా ఉన్న నియోజకవర్గంలో రెండు దశాబ్దాలుగా ముస్లిం సామాజికవర్గానికి చెందిన వారే గెలుస్తూ వస్తున్నారు. కేవలం కడప ఎమ్మెల్యే అని అనిపించుకోవడమే కాదు.. అమాత్య పదవులు చేపట్టి ఓ రేంజ్‌కి వెళ్లిపోయారు. వరుసగా రెండు పర్యాయాలు గెలిచిన నాయకులు కనిపిస్తారు. 1955, 1967 ప్రాంతాల్లో ఎం.రహంతుల్లా గెలిస్తే.. తర్వాత రెడ్డి సామాజికవర్గ నాయకులు 1972 నుంచి…
Off The Record: పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతుంది. ములుగు నియోజకవర్గం తర్వాత… నర్సంపేట సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇవ్వాలి. ఆ తరువాత మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి యాత్ర వెళ్తుంది. ఇది ముందుగా అనుకున్న షెడ్యూల్‌గా చెబుతున్నారు. ములుగులో యాత్ర మొదలయ్యాక ఎక్కడా బ్రేకులు లేకుండా సాఫీగా సాగిపోతుందని రేవంత్‌రెడ్డి కూడా భావించారట. అయితే ములుగులో యాత్ర పూర్తి కాగానే నర్సంపేట వెళ్లకుండా మహబూబాబాద్ నియోజకవర్గంలోకి ఎంటరైంది. దీంతో నర్సంపేటను…
Off The Record: వచ్చే ఎన్నికల్లో BRS, లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని మునుగోడు బైఎలక్షన్ తర్వాత చర్చ ఊపందుకుంది. ఉభయ పక్షాల నుంచి ఈ దిశగా ప్రకటనలు వచ్చాయి.. మాటలు కలిశాయి. అయితే తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలు కలిసి పనిచేస్తాయా? అని ఆరా తీస్తున్నారు. తాజాగా వామపక్ష శిబిరాల నుంచి వస్తున్న స్టేట్మెంట్లతో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. పొత్తులో ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారని ఇన్నాళ్లూ…
Off The Record: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు. సొంత పార్టీ నేతలతోనే ఎమ్మెల్యేకు పడటం లేదు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే నేనే రాజు.. నేనే మంత్రి అంటూ వ్యవహరిస్తున్నారనేది వైసీపీ ద్వితీయశ్రేణి నేతల ఆరోపణ. గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్‌బాబు గత ఎన్నికల సమయంలో సంతనూతలపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మొదట్లో అంతా బాగానే ఉన్నా తర్వాత సొంత పార్టీ నేతలతో గ్యాప్ వచ్చింది. తమకు ఓ మాట కూడా చెప్పకుండా ఎమ్మెల్యే ఇష్టారీతిన…