Off The Record: కొప్పుల కష్టాలు ఇన్నిన్ని కావయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆయన రాష్ట్రానికి మంత్రి అయినా… సొంత నియోజకవర్గంలో ఆటుపోట్లను తట్టుకోలేకపోతున్నారా? ఓవైపు ప్రతిపక్షాలు, మరోవైపు సొంత పార్టీలోనివారే ఆయన్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఇంటా..బయటా ఇబ్బందులు పడుతున్న ఆ మంత్రి ఎవరు? అలా ఎందుకు జరుగుతోంది?
Also Read
కొప్పుల ఈశ్వర్ గెలుపుపై వివాదం
బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. తొలుత మేడారం నుంచి రెండు సార్లు గెలిచిన ఆయన… పునర్విభజనలో ఆ నియోజకవర్గం రద్దు కావడంతో కొత్త గా ఏర్పడ్డ ధర్మపురికి మారి విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఆయన గెలుపుపై వివాదం తలెత్తింది… స్వల్ప మెజార్టీతో గట్టెక్కిన మంత్రి మీద ప్రత్యర్థి అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టుకు వెళ్లారు.. ప్రస్తుతం విచారణలో ఉన్న ఆ కేసు కొప్పులకు తలనొప్పిగా మారింది… స్ట్రాంగ్ రూం తెరిచి ఎన్నికల డాక్యమెంట్లు, సీసీ పుటేజ్ తమ పరిశీలనకు పంపాలని కోర్టు ఆదేశించింది..కానీ, స్ట్రాంగ్ రూం తెరవాలని చూసిన అధికారులకు తాళం చెవి దొరక్కపోవడంతో కొత్త వివాదం తలెత్తింది… ఇది కొప్పుల పనేనంటూ కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్ ఆరోపిస్తూ మరోసారి హైకోర్ట్ తలుపు తట్టారు. నాలుగేళ్లుగా నడుస్తున్న ఎన్నికల ఫలితాల కేసులో తాళం చెవి పోవడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది…
నియోజకవర్గంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసనలు
తన నియోజకవర్గ పరిధిలోని వెల్గటూర్ మండంలో క్రిబ్‌కో భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసనలు సాగుతున్నాయి. ఆ పరిశ్రమ వెదజల్లే కాలుష్యం వల్ల తాము నష్టపోతామని నాలుగు గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. కలెక్టర్ ఆఫీసు ముందు నిరసనలు, పాదయాత్రలు నిర్వహించారు. మాకు ఇథనాల్ పరిశ్రమ వద్దంటూ గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు కూడా చేసాయి పంచాయతీలు. నియోజకవర్గ యవతకు ఉపాధి లభిస్తుందని చెప్పి కొప్పుల ఈశ్వర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని భూసేకరణ చేయించి, ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేసారు. ఈ ఆందోళనలతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలకు ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించడంతో మరింత ఉధృతం అయ్యాయి… స్వయంగా మంత్రి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. వినకుండా ఆయన్ని వెనక్కు పంపారు నాలుగు గ్రామాల ప్రజలు. మంత్రిగా ఉన్న కొప్పులకు తన నియోజకవర్గంలోనే ప్రజల నుంచి తిరుగుబాటు రావడం మింగుడు పడటం లేదట…
తన వైఖరితో స్వపక్షంలోనే టార్గెట్ అవుతున్న కొప్పుల
ఏ చిన్న అవకాశం దొరికినా ఇరుకున పెడుతున్న ప్రతిపక్షాలు ఓ వైపు ఉంటే.. స్వపక్షంలోనే తన వైఖరితో కొందరికి టార్గెట్ అవుతున్నారట కొప్పుల. ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై ఆయన అసహనం వ్యక్త చేశారట… దీన్ని జీర్ణించుకోలేని సంజయ్ అనుచరులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంజయ్‌కి వ్యతిరేకంగా జడ్పీ చైర్మన్‌ని కొప్పుల ప్రోత్సహిస్తున్నారని ద్వితీయ శ్రేణి నేతలు అంటున్నారు… జిల్లాలో అందరిని కలుపుకుపోవాల్సిన మంత్రి ఇలా చేయడంతో నేతలు ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట… మంత్రికి తన స్వంత నియోజకవర్గంలోనూ ద్వితీయ శ్రేణి నేతలతో ముప్పు పొంచి ఉందంటున్నారు.. బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ వివేక్ ధర్మపురిలో పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ క్యాడర్‌ను ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నారట ఈశ్వర్… కొప్పుల కొంతమంది నేతలనే కోటరీగా చేసుకున్నారని, వారి మాటలే వింటున్నారని స్థానిక సంస్థల ప్రతినిధులు వాపోతున్నారట.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంటా బయట పోరుతో కొప్పుల ఎలా నెగ్గుకు వస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది… కోర్టు కేసును ప్రతిపక్షాలు ఆయుధంగా మార్చుకోవడం… ప్రతిష్టాత్మక పరిశ్రమ ఏర్పాటుకు నిరసనలు రావడం… సొంత నియోజకవర్గంలో క్యాడర్ అసంతృప్తి… మరోవైపు ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉన్న ప్రత్యర్థులతో పోరాడాల్సిన పరిస్థితులు… కొప్పులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టబోతున్నాయన్నది లోకల్ టాక్.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!