Off The Record: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో టిడిపికి ఎంతో సెంటిమెంటుతో కూడుకున్న నియోజకవర్గం. పార్టీ పెట్టిన తొలినాళ్లలో ఎన్టీఆర్.. ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. పార్టీకి అంత బలమైన కేడర్ ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలోని ప్రతి ఒక్క నియోజకవర్గంలో 40 వేల మెజారిటీతో ఓడిపోతే…తిరుపతిలో ఎనిమిది వందల ఓట్ల తేడాతో సీటు కోల్పోయింది టీడీపీజ అప్పటి నుంచి వరుసగా ఓటములను చవిచూస్తోంది. మున్సిపల్ ఎన్నికలలో కనీసం సగం డివిజన్లలో పోటీ చేయలేని స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో జిల్లా టిడిపిపై తీవ్ర స్దాయిలో విమర్శలు వచ్చాయి. 50 డివిజన్లలో కేవలం 22 చోట్ల మాత్రమే ప్రధాన ప్రతిపక్షం…అతికష్టం మీద నామినేషన్లు వేయగలిగింది. టౌన్ బ్యాంకు ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పార్టీ సైలెంట్ అవ్వడానికి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, అమె అల్లుడే కారణమన్న టాక్ ఓ రేంజ్‌లో సాగుతోంది.
గత ప్రభుత్వం హాయాంలో చక్రం తిప్పిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఆమె అల్లుడు సంజయ్…పార్టీ ఓటమీ పాలైన తరువాత అడ్రస్ లేకుండా పోయారట. సుగుణమ్మ అడప దడప కనిపించిన ఫలితం శూన్యం అంటున్నారు టీడీపీ శ్రేణులు. టీడీపీ నేతల నరసింహా యాదవ్ సహా మిగిలిన నేతలు…ఉన్నారంటే ఉన్నాము అన్నట్లుగా..అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. ఇదే విషయాన్ని అధినేతకు పలుమార్లు ఫిర్యాదు చేశారట స్థానిక నేతలు. అత్యంత కీలకమైన నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితిపై సీనియర్ నేతలు ఆగ్రహంగా ఉన్నారట.
తిరుపతి నేతల విషయంలో అధినేత చంద్రబాబు సైతం పలుమార్లు హెచ్చరించారట. ఇక లాభం లేదని అనుకున్నారో ఎమో… నెల్లూరులో జరిగిన జోనల్ సమావేశంలో బహిరంగంగానే సుగుణమ్మకు, ఇతర నేతలకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారట చంద్రబాబు. తిరుపతిలో ఉండే నాయకులు…తన పక్కన కూర్చోవడం…తన దగ్గరి ఉపన్యాసం ఇవ్వడం కాదంటూ క్లాస్ పీకారట. పని చేయకుండా తన దగ్గర తిరిగితే…నమస్కారం పెట్టి కాఫి ఇచ్చి పంపుతానని గట్టిగానే చెప్పారట చంద్రబాబు. చంద్రబాబు ఘాటుగానే క్లాస్ ఇవ్వడంపై తిరుపతి తమ్ముళ్ళలో హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి. గౌరవం వేరే…నాయకత్వం పెట్టడం వేరే అంటూ…ఫైనల్ వార్నింగ్ బెల్ బాబు ఇచ్చారనే టాక్ పార్టీలో నడుస్తోంది.
తిరుపతి నగరంలో వైసిపి చేస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్లు అభివృద్ధి…అటు ఉంచితే వాటి వెనుక అక్రమాలు జరిగాయని జనసేన నేతలు చేస్తున్న విమర్శలు కూడా చేయలేని స్థితిలో ఉన్నారు టీడీపీ నేతలు. తిరుపతిలో టీడీపీ నేతల వ్యవహారశైలిపై పార్టీ పెద్దలకు కొందరు ఫిర్యాదు చేశారట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు అడ్డుకోవడానికి జెబీ శ్రీనివాస్ లాంటి యువ నేతలు వెళ్ళారే తప్పా…మాజీ ఎమ్మెల్యేగా ముందస్తుగా ప్రణాళికలు ఎమీ చేయలేకపోయారన్న చర్చ సాగుతోంది. ఎవరికి వారు గ్రూపులతో కొట్టుకుంటూ పార్టీని నాశనం చేస్తున్నారనే ఫీడ్ బ్యాక్ ఉండటంతో చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారట. ఇక లాభం లేదనుకొని సుగణమ్మకు బహిరంగంగానే క్లాస్ పీకారనే టాక్ నడుస్తోంది. మరి ఫైనల్ వార్నింగ్ బెల్‌తో అయినా నేతలు అలెర్ట్ అవుతారా ? లేక తమ ధోరణితో వెళ్తారో వేచి చూడాలి.