Man beats wife : ఈ మధ్య కాలంలో అకారణంగా భార్యభర్తలు చంపుకుంటున్నారు. చిన్న చిన్న వాటికే ఈగోలు పెంచుకుని చేతులారా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అలాంటి ఘటనే ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. అన్నం వండలేదని భర్త కోపంలో భార్యను కొట్టి చంపాడు.
Power cut in the President's program: కరెంట్ కోతలు సామాన్యుడికే కాదు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా తప్పడం లేదు. ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతుండగా కరెంట్ పోయింది. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. ఒడిశాలోని బరిపాడలోని మహారాజా శ్రీ రామచంద్ర భంజదేయో విశ్వవిద్యాలయం 12వ స్నాతకోత్సవానికి శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఆమె ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ పోయింది. దీంతో లైట్లు ఆఫ్ కావడంతో వేదికపై చీకటి అలుముకుంది.
70-Year-Old Forced To Walk Barefoot To Collect Pension From Bank: వృద్ధులకు ప్రభుత్వం ఇచ్చే పింఛనే ఆసరా. ప్రభుత్వం ఇచ్చే రెండు మూడు వేలను నెలంతా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారు. అదే సమయంలో పింఛన్ సరైన సమయంలో రాకుంటే వారి బాధ వర్ణణాతీతంగా ఉంటుంది. చాలా కుటుంబాల్లో కన్నవాళ్లు వృద్ధులైన తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోవడంతో ఈ పింఛనే ఆధారంగా ఉంటోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పింఛన్ కోసం పడుతున్న పాట్లు పలువురితో కంటతడిపెట్టిస్తోంది. ప్రస్తుతం దీనికి…
Minor’s Marriage with Dogs: చిన్నారులకు వీధి కుక్కలతో వివాహం జరిపించారు.. అదేంటి? కుక్కలతో పెళ్లి ఏంటి? అనే అనుమానం వెంటనే రావొచ్చు.. నిజమే ఒడిశాలో జరిగిన ఈ ఘటన వైరల్‌గా మారిపోయింది.. ఇంతకీ వీధి కుక్కలతో పెళ్లి చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందనే వివరాల్లోకి వెళ్తే.. అదో నమ్మకం.. మూఢనమ్మకం.. ఎందుకంటే.. ఓ వైపు ఆధునిక పరిజ్ఞానంలో దూసుకెళ్తుంటే.. మరోవైపు.. ఇలాంటి నమ్మకాలు కూడా అదేస్థాయిలో పెంచిపోషిస్తున్నవారు లేకపోలేదు.. మొత్తంగా ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఇద్దరు…
రాత్రిపూట చెదురుమదురు ఘటనలు హింసాత్మకంగా మారగా, అనుమానాస్పద పరిస్థితుల్లో ఓ వ్యక్తి మరణించిన తర్వాత శనివారం ఒడిశాలోని సంబల్పూర్ పట్టణంలో కర్ఫ్యూ విధించబడింది. శుక్రవారం సాయంత్రం హనుమాన్ జయంతి ఊరేగింపులు కట్టుదిట్టమైన భద్రతలో జరిగిన తరువాత హింస జరిగింది.
వేసవిలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. చాలా రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, బీహార్తో సహా దేశంలోని కొన్ని ప్రాంతాలలో రాబోయే మూడు, నాలుగు రోజులలో వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
Odisha: ఒడిశాలో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన బైకు ర్యాలీలో ఉద్రిక్తత చెలరేగింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఏప్రిల్ 12న సంబల్పూర్ జిల్లాలో ఇరు వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో సంబల్పూర్ జిల్లాలో గురువారం ఉదయం 10 గంటల నుంచి 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
Triple Talaq: సైబర్ మోసాల పట్ల ప్రభుత్వాలు ఎన్ని సూచనలు చేసిన ఎక్కడో చోట ప్రజలు అత్యాశకు పోయి డబ్బు పోగొట్టుకుంటున్నారు. విదేశాల నుంచి గిఫ్టులు పంపిస్తామని, లాటరీ తగిలిందని చెబుతూ జనాలను మోసం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సైబర్ మోసం 15 ఏళ్ల వివాహబంధానికి తెరపడేలా చేసింది. వివరాల్లోకి వెళితే ఒడిశాకు చెందిన ఓ మహిళ రూ. 1.5 లక్షలను సైబర్ మోసంలో పోగొట్టుకుంది. ఇది తెలిసిన భర్త ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు.
Cunning Friend : ప్రతి ఒక్కరి జీవితంలో ఓ బెస్ట్ ఫ్రెండ్ తప్పని సరిగా ఉంటారు. స్నేహం చాలా ముఖ్యం. సన్నిహిత మిత్రులతో ప్రతిదీ పంచుకుంటాము. అతడు కనిపించకుంటే చాలా బాధపడతాము.
Odisha: ఒడిశాలో బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ హెడ్ మాస్టర్ కు జైలు శిక్ష విధించింది కోర్టు. 2015లో 11 మంది బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు సదరు హెడ్ మాస్టర్. ఆయనకు సుందర్గఢ్ జిల్లాలోని పోక్సో కోర్టు బుధవారం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 62 ఏళ్ల వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా లెఫ్రిపారా బ్లాక్ లోని ఓ పాఠశాలలో పనిచేసేవారు. ఆ సమయంలో స్కూల్ లోని బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.