ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ వివిధ దేశాలకు చెందిన ప్రధాన మంత్రులు, మంత్రులు, దేశ రాయబారులు సందేశాలు పంపుతున్నారు.
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీఎం వైయస్.జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎంఓ కార్యాలయ అధికారులతో కలిసి.. ఈ ప్రమాద ఘటనపై ఆయన సమీక్షించారు. తాజా సమాచారం ప్రకారం 237 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. క్షతగాత్రుల సంఖ్యకూడా భారీగా ఉందని వివరించారు.
ఒడిశాలో రైలుపట్టాలపై మరణ మృదంగం మోగింది. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కి చేరింది. మరో 900 మందికిపైగా గాయపడగా.. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 233 మందికిపైగా చనిపోయారని తాజా సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తంచేశారు.
Rail Accident: పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ స్టేషన్ నుండి తమిళనాడులోని చెన్నైకి వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం ఒక గూడ్స్ రైలును ఢీకొట్టింది.
Coromandel Express: హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం సాయంత్రం పెను ప్రమాదానికి గురైంది. ఈ రైలు ఒడిశాలోని బాలాసోర్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో గూడ్స్ రైలును ఢీకొట్టింది.
Odisha: భార్యపై అనుమానంతో పసిపాప ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాడు ఓ కసాయి తండ్రి. బిడ్డకు పురుగుమందు ఇంజెక్షన్ ఇచ్చారు. ప్రస్తుతం పాప ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగింది. పసికందును సోమవారం బాలాసోర్లోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చేర్చగా, ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. మంగళవారం వరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాకపోవడంతో కేసును సుమోటోగా స్వీకరించి దర్యాప్తు జరుపుతున్నట్లు బాలసోర్ ఎస్పీ సాగరిక నాథ్ వెల్లడించారు.
Cyclone Mocha: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మోచా తుఫాన్’ భారతదేశాన్ని ఆందోళనకు గురిచేసింది. ముఖ్యంగా ఒడిశాతో పాటు తూర్పు కోస్తా ప్రాంతాలపై ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) హెచ్చరించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మోచా తుఫాన్ దిశ మార్చుకుని, మయన్మార్(బర్మా) వైపు కదులుతోంది. ఇది గంటకు 148 కిలోమీటర్ వేగంతో ‘ చాలా తీవ్రమైన తుఫాన్’గా మారే అవకాశం ఉంది.